Advertisement

సినీ జోష్ రివ్యూ: కెజిఎఫ్ చాప్టర్ 2

Thu 14th Apr 2022 12:04 PM
kgf2:kgf: chapter 2 review,kgf 2 review,kgf chapter 2 movie review,kgf chapter 2 telugu review,kgf 2 movie review,kgf 2 telugu review  సినీ జోష్ రివ్యూ: కెజిఎఫ్ చాప్టర్ 2
Cinejosh Review: KGF: Chapter 2 సినీ జోష్ రివ్యూ: కెజిఎఫ్ చాప్టర్ 2
Advertisement

సినీ జోష్ రివ్యూ: కెజిఎఫ్ చాప్టర్ 2 

బ్యానర్: హోంబేలె ఫిలిమ్స్

నటీనటులు: యాష్, సంజయ్ డత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, రావు రమేష్, ఈశ్వరి రావు, ప్రకాష్ రాజ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: రవి బాసృర్ 

సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ 

ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి 

ప్రొడ్యూసర్: విజయ్ కిరాగండూరి 

దర్శకత్వం: ప్రశాంత్ నీల్

రిలీజ్ డేట్: 14-04-2022 

 కన్నడలో ఓ సినిమా తెరకెక్కింది.. అది డబ్ అయ్యి పాన్ ఇండియా భాషాల్లో రిలీజ్ అయ్యింది అనుకున్నారు కానీ.. ఆ సినిమా పాన్ ఇండియా మార్కెట్ లో కలక్షన్స్ వర్షం కురిపిస్తుంది అని ఆ సినిమా మేకర్స్ కూడా ఎక్సపెక్ట్ చేసి ఉండరు. అదే కన్నడ కెజిఎఫ్. కెజిఎఫ్ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ప్రతి భాషలోనూ రికార్డు కలెక్షన్స్ తో హిట్ అయ్యింది. దానికి పార్ట్ 2 గా తెరకెక్కిన కెజిఎఫ్ చాప్టర్ 2 పై అంచనాలు ఏర్పడ్డాయి. కెజిఎఫ్ లో యాక్షన్ ప్యాకెడ్ యశ్ ఎలివేషన్ సీన్స్ కి ఆడియన్స్ మాత్రమే కాదు.. టాలీవుడ్ హీరోలు, బి,సి సెంటర్ ఆడియన్స్ ఓన్ చేసుకున్న చిత్రమిది. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఎంజాయ్ చెయ్యడంతో చాప్టర్2 పై క్రేజ్ హైప్ బాగా పెరిగాయి. కెజిఎఫ్ తో అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీసు సునామి సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ - హీరో యశ్ లు ఈసారి భారీ అంచనాల నడుమ కెజిఎఫ్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఆడియన్స్ అంచనాలు కెజిఎఫ్ 2 తో అందుకున్నారా.. లేదా.. అనేది సమీక్షలో చూసేద్దాం.

కథ:

నరాచీని, కె.జి.ఎఫ్ ను దక్కించుకున్న రాకీ భాయ్ (యష్) తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంటాడు. తన శత్రువులకు సింహస్వప్నంగా ఉంటూనే, కెజిఎఫ్‌లో ప్రజలని తన సైన్యంగా చేసుకుని పాలిస్తున్న రాకీ భాయ్‌ని ఢీకొట్టేందుకు గరుడ నుంచి తప్పించుకు పారిపోయిన అధిరా (సంజయ్‌దత్) కెజిఎఫ్ సామ్రాజ్యంలో అడుగుపెడతాడు. అధీరా తో పాటుగా రాఖి భాయ్ భారత ప్రధాని రమికా సేన్ (రవీనా టండన్)తో సైతం తలబడతాడు. రాఖీ, అధిరాకు మధ్య ఎలాంటి ఘర్షణ నడించింది? అధిరా తిరిగి రావడానికి కారకులు ఎవరు? ప్రధాన మంత్రిగా ఉన్న రవీనా టాండన్‌ కెజిఎఫ్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది? దేశ ప్రధానిని సైతం ఎదిరించిన ఇండియాస్ బిగ్గెస్ట్ క్రిమినల్ రాకీ భాయ్ పయనం ఏమైంది? అనేది కెజిఎఫ్ 2 మిగతా కథ.

నటీనటులు: 

యశ్ ఎప్పటిలాగే మాస్ కటౌట్ కి సరిపోయే పెరఫార్మెన్స్ తో అదరగొట్టేసాడు. రాఖీ భాయ్ గా పార్ట్ 1 కన్నా పార్ట్ 2 లో మరింతగా చెలరేగిపోయాడు. రాఖీ భాయ్ పాత్రలో యశ్ ని తప్ప మరో నటుడ్ని ఊహించుకోలేం. ఆడియన్స్ యశ్ అసలు పేరు మర్చిపోయి రాకీ భాయ్ గానే అతడ్ని గుర్తించే స్థాయిలో జీవించేశాడు. ఫైట్స్ అండ్ డైలాగ్స్ మాత్రమే కాదు.. ఎమోషన్స్ కూడా అద్భుతంగా పండించాడు. యశ్ తర్వాత అంత గొప్పగా నటించింది బాలీవుడ్ నటి రవీనా టాండన్. ప్రధానమంత్రి రమికా సేన్ గా హుందాగా నటించడమే కాక.. ఆ పాత్ర వెయిట్ ను క్యారీ చేసింది. మెయిన్ విలన్ సంజయ్ దత్ కూడా క్రూరంగా ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ శ్రీనిధి శెట్టి పాత్రకి ప్రాధాన్యత లేకపోయినా ఉన్న సీన్స్ లో అందంగా గ్లామర్ గా కనిపించింది. ప్రకాష్ రాజ్, రావు రమేష్ తమ తమ పాత్రలకి న్యాయం చేసారు.

విశ్లేషణ:

ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ లో యశ్ ని రాఖీ భాయ్ గా మాస్ గా క్రూరంగా చూపించాడు. రాఖీ నుండి రాఖీ భాయ్ గా ఎలా ఎదిగాడో ఎలివేషన్స్ తో ప్రూవ్ చేసాడు. ముంబై డాన్ గా మారి అక్కడి నుండి నారచీ కి చేరి కెజిఎఫ్ ని దక్కించుకున్న వైనాన్ని ఫస్ట్ పార్ట్ లో ప్రెజెంట్ చేసాడు. కెజిఎఫ్ కోసం కాచుకుని కూర్చున్న గద్దల్లాంటి విలన్స్ ని, కెజిఎఫ్ ని దక్కించుకున్న రాఖీ భయ్ కి మధ్యన ఏం జరగబోతుందో అనేది పార్ట్2 లో ఉత్కంఠ రేపేలా చేసాడు. చాప్టర్ 2 లోకి వచ్చేసరికి కథలోకి రావడానికి దర్శకుడు చాలా టైం తీసుకున్నాడు. అసలు కథలోకి వచ్చాక కాస్త అక్కడక్కడ కథ నెమ్మదిగా సాగడం, హీరో ఎలివేషన్ సీన్స్ కాస్త పెరిగినట్టుగా అనిపించాయి. అయితే రాకీ క్యారెక్టర్ మాత్రమే కాదు.. ప్రతి క్యారెక్టర్ ను కథకు అనుగుణంగా తీర్చిదిద్దిన విధానం బావుంది. సాధారణంగా ఇలాంటి మాస్ మసాలా సినిమాల్లో హీరో కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏ క్యారెక్టర్ కి దక్కదు. కానీ కెజిఎఫ్ లో అన్ని కేరెక్టర్స్ ఎలివేట్ అయ్యాయి. ఆ గ్రాఫ్ ను స్క్రీన్ మీద ప్రెజంట్ చేయడంలోనూ ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడు. కాకపోతే ఉన్న కథనే ఎక్కువగా సాగదీయడం డ్రా బ్యాక్ అయ్యిందని అనిపించింది. యాక్షన్ సీన్స్ మరియు సెంటిమెంట్ సీన్స్ కూడా కాస్త డోస్ ఎక్కువయ్యాయి. అక్కడక్కడా తప్ప సప్సెన్స్, థ్రిల్ అనేవి ఎక్కడా కనిపించవు. మాస్ ఆడియన్స్ కి మాత్రం ఏ ఒక్క యాక్షన్ సీన్ అనవసరం అనిపించదు, ఓ ఒక్క ఎపిసోడ్ లోనూ అతి కనిపించదు. స్టన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో, యాక్షన్స్ సీన్స్‌తో పాటు ఎన్నో ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఎలివేషన్స్ అన్నీ కూడా కెజిఎఫ్‌ని మించి చూపించాడు. కాకపోతే కెజిఎఫ్ లో కథని అమ్మ సెంటిమెంట్ ని బాగా చూపించినా.. కెజిఎఫ్ 2 లో ఆ కథ కనిపించలేదు. అన్నీ యాక్షన్ సీన్స్ తోనే సమాధానం చెప్పినట్టుగా, కథ మిస్ అయిన ఫీలింగ్ ఆడియన్స్ లో కలిగింది. ఏదైనా మాస్ ఆడియన్స్ కి, బి,సి సెంటర్ ఆడియన్స్ కి ఫుల్ మసాలా కిక్కిచ్చేదిలా కెజిఎఫ్ 2 నిలిచిపోతుంది.. అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సాంకేతికంగా:

సంగీత దర్శకుడు రవి బస్రూర్ మ్యూజిక్ బావుంది. సౌండ్ డిజైనింగ్ విషయంలో అతడు తీసుకున్న శ్రద్ధ, నేపధ్య సంగీతంతో హీరో ఎలివేషన్స్ ను ఎలివేట్ చేసిన తీరు ప్రశంసనీయం. కెమెరామెన్ భువన్ గౌడ కలర్ గ్రేడింగ్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. కెజిఎఫ్ ప్రపంచంలోని ప్రేక్షకుల్ని లీనం చేశాడు. యాక్షన్ సీక్వెన్స్ ని అద్భుతంగా చూపించాడు. ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి సినిమాకి మరో ప్లస్. కార్ ఛేజింగ్ సీక్వెన్స్ అండ్ ఫైరింగ్ సీక్వెన్స్ లను కట్ చేసిన విధానం హాలీవుడ్ స్థాయిని మించి ఉంది. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి.

రేటింగ్: 2.75/5

Cinejosh Review: KGF: Chapter 2:

KGF: Chapter 2 Telugu Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement