Advertisement

సినీజోష్ రివ్యూ: వలిమై

Thu 24th Feb 2022 03:18 PM
valimai movie,valimai telugu review,valimai review,valimai movie review,ajith valimai review  సినీజోష్ రివ్యూ: వలిమై
Valimai Telugu Review సినీజోష్ రివ్యూ: వలిమై
Advertisement

సినీజోష్ రివ్యూ: వలిమై 

బ్యానర్: బే వ్యూ ప్రాజెక్ట్స్ LLP, జీ స్టూడియోస్ 

నటీనటులు: అజిత్ కుమార్, హ్యూమా ఖురేషి, కార్తికేయ తదితరులు

మ్యూజిక్: యువన్ శంకర్ రాజా

బ్యాక్ గ్రౌండ్ స్కోర్: గిబ్రాన్

సినిమాటోగ్రఫీ: నిరవ్ షా 

ఎడిటింగ్: విజయ్ వేలుకుట్టి 

ప్రొడ్యూసర్స్: బోనీ కపూర్

డైరెక్టర్: H.వినోథ్ 

కోలీవుడ్ లో టాప్ హీరో అజిత్ కుమార్ ఎక్కువగా యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తుంటారు. ఆయన యాక్షన్ కి అజిత్ ఫాన్స్ పడిపోతారు. కొంతకాలంగా యాక్షన్ నేపథ్యంలోనే సినిమాలు చేస్తున్న అజిత్.. ఖాకి, పింక్ రీమేక్ తో డైరెక్టర్ గా నిరూపించుకున్న H.వినోథ్ దర్శకత్వంలో బోని కపూర్ నిర్మాతగా వలిమై సినిమా చేసారు. ఫుల్లీ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తెలుగు హీరో కార్తికేయ విలన్ గా నటించడం, అజిత్ కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉండడంతో.. వలిమై ని నిర్మాతలు తెలుగులోనూ ప్రమోట్ చేసి రిలీజ్ చేసారు. బైక్ రేసింగ్ ఆధారంగా తెరకెక్కిన వలిమై నేడు వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి వలిమై తో ప్రేక్షకులు సంతృప్తి పడ్డారా లేదా.. అనేది సమీక్షలో చూసేద్దాం.

కథ:

విశాఖ తీరంలో సైతాన్ అనే బ్యాచ్ అరాచకాలు సృష్టిస్తూ డ్రగ్స్ దందా, వరుస చైన్ స్నాచింగ్ లు, దొరికిన వారిని దొరికినట్టుగా హత్యలు చేస్తూ ఉంటారు. వరుస దోపిడీలు, ఎప్పుడు దాడులు జరుగుతాయో అనే భయంతో విశాఖ ప్రజలు జీవిస్తుంటారు. విశాఖలో జరిగే అరాచకాలను అడ్డుకట్టవేసేందుకు పోలీస్ ఆఫీసర్ అర్జున్ (అజిత్ కుమార్) విశాఖలో ఛార్జ్ తీసుకుంటాడు. విశాఖలో అరాచకాలు సృష్టించే ఆ గ్యాంగ్ వెనుక నరేన్(కార్తికేయ) ఉన్నాడని తెలుసుకున్న అర్జున్ ఏం చేసాడు? నరేన్ ని పట్టుకునే క్రమంలో అర్జున్ కి ఎదురైన సమస్యలేమిటి? చివరకు అర్జున్ నరేన్ బ్యాచ్ కి ఎలా ముగింపు పలికాడు? అనేది మిగిలిన కథ.

పెరఫార్మెన్స్:

అజిత్ బైక్ రేసర్ గా ఇరగదీసాడు. స్వతహాగా అజిత్ రేసర్ కావడం ఈ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. దర్శకుడు అజిత్ హీరోయిజాన్ని సూపర్బ్ గా ఎస్టాబ్లిష్ చేసాడు. కాకపోతే అజిత్ కాస్త బరువు పెరిగి వయసు మీరిన వాడిలా కనిపించి ఫాన్స్ ని నిరాశపరిచాడు. ఇక హీరో కార్తికేయ మరోసారి విలన్ గా కనిపించాడు. అది కూడా అజిత్ సినిమాలో అంటే ఆ కేరెక్టర్ కి మరింత క్రేజ్ వస్తుంది. అజిత్ - కార్తికేయ కాంబో బైక్ రేసింగ్ సీన్స్ నిజంగా అద్భుతమే. కాకపోతే కార్తికేయ కేరెక్టర్ కి, కార్తికేయపై రాసుకున్న సీన్స్ కి దర్శకుడు పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. ఇక హీరోయిన్ గా చేసిన హ్యూమా ఖురేషి పాత్రని కూడా దర్శకుడు తేల్చేసాడు.. మిగతా కేరెక్టర్స్ గురించి చెప్పుకోవడానికి అంతగా లేదు.

విశ్లేషణ:

కొన్నేళ్లుగా యాక్షన్ అంటే అజిత్, అజిత్ అంటే యాక్షన్ అన్నట్టుగానే ఆయన కథల ఎంపిక కనిపిస్తుంది. ప్రస్తుతం దర్శకుడు వినోథ్ కూడా అజిత్ ని యాక్షన్ హీరోగానే చూపించాలని ఫిక్స్ అయ్యి.. హీరో ఎలివేషన్ సీన్స్, యాక్షన్ ఆధారంగానే వలిమై కథ రాసుకున్నాడు. వలిమై పక్కా యాక్షన్ ఎంటెర్టైనెర్. కానీ వలిమై లో యాక్షన్ తీసేస్తే.. కథలో ఇంకేమి కనిపించదు. రొటీన్ కథకి యాక్షన్ మిక్స్ చేసి వదిలాడు. ఆ యాక్షన్ సన్నివేశాలకు, బైక్ రేసింగ్ సీన్స్ కి పడిపోయే అజిత్ వినోథ్ చెప్పిన కథని ఓకె చేసినట్లుగా అనిపిస్తుంది.  వినోథ్ కూడా యాక్షన్ సీన్స్ ని బాగానే హ్యాండిల్ చేసాడు. ఫస్ట్ హాఫ్ అంతా రేసి స్క్రీన్ ప్లే తో పరుగులు పెట్టించినా.. సెకండ్ హాఫ్ లో ఆ ఫ్లో ని వదిలేసాడు. ఫస్ట్ హాఫ్ లో యాక్షన్ సీన్స్ మెయిన్ హైలెట్. మాస్ ఎలివేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ వలిమై యాక్షన్ సీన్స్ ని వేరే లెవల్ లో చూపించారు. బస్సు ఛేజ్ బావున్నా సెకండ్ హాఫ్ లో మథర్ సెంటిమెంట్ మైనస్. అది అనవసరంగా పెట్టారనిపిస్తుంది. సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకుడు ఆశించిన రీతిలో లేకపోవడం సినిమాకి మైనస్ అయింది. కథను ఎలివేట్ చేస్తూ దర్శకుడు వినోద్ రాసుకున్న సీరియస్ ట్రీట్మెంట్ కొన్ని చోట్ల లాజికల్ గా అనిపించలేదు. సెకండ్ హాఫ్ లో సినిమా నిడివి ఇబ్బంది పెట్టింది. హాలీవుడ్ రేంజ్ నుండి రొటీన్ రేంజ్ కి సినిమాని పడేసారు. అదే ఎమోషన్స్ లేపేసి మాస్ అండ్ యాక్షన్ గా సినిమాని మలిచినట్లయితే వలిమై ఫలితం ఎక్కడో ఉండేది.

సాంకేతికంగా:

సాంకేతికంగా వలిమై సినిమా చాలా అద్భుతంగా ఉంది. యువన్ శంకర్ రాజా సాంగ్స్ అంతంత మాత్రంగా ఉన్నా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెయిన్ హైలెట్ గా నిలిచింది. గిబ్రాన్ యాక్షన్ సన్నివేశాల్లో ఇచ్చిన బ్యాగ్ రౌండ్ స్కోర్ సూపర్బ్ అనేలా ఉంది. ఇక సినిమాలో మెయిన్ క్రెడిట్ యాక్ష‌న్ మాస్ట‌ర్ల‌కు ఇవ్వాలి. వాళ్లు తీర్చిదిద్దిన ఫైట్స్‌, ఛేజింగులు సినిమాని ప్రధాన ప్లస్ పాయింట్స్ లో ఒకటిగా నిలిచాయి. సినిమాటోగ్రఫీ బావుంది. కానీ ఎడిటింగ్ మాత్రం ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. సెకండ్ హాఫ్ లో కత్తెర వేయాల్సిన సీన్స్ బోలెడన్ని.! 

ఫినిషింగ్ టచ్ : కహాని మే నై... వలిమై (బలం)

రేటింగ్: 2.25/5

Valimai Telugu Review:

Valimai Movie Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement