Advertisement

సినీజోష్ రివ్యూ: లక్ష్య

Fri 10th Dec 2021 03:02 PM
lakshya review,lakshya telugu review,lakshya movie review,naga shaurya lakshya review,naga shourya,jagapathi babu,ketika sharma  సినీజోష్ రివ్యూ: లక్ష్య
Lakshya Movie Telugu Review సినీజోష్ రివ్యూ: లక్ష్య
Advertisement

సినీజోష్ రివ్యూ: లక్ష్య

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ 

నటీనటులు: నాగ శౌర్య, కేతిక శర్మ, జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, రవి ప్రకాష్, సత్య తదితరులు

సినిమాటోగ్రఫీ: రామ్

మ్యూజిక్ డైరెక్టర్: కాల భైరవ 

ఎడిటర్: జునైద్ సిద్దిక్యూ 

నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, రామ్ మోహన్ రావు, శరత్ మరార్

దర్శకుడు: సంతోష్ జాగర్లమూడి  

తన కెరీర్ లో కేవలం ఛలో మాత్రమే హిట్ ఉంది అని చెప్పిన నాగ శౌర్య.. ఈమధ్యనే లక్ష్మి సౌజన్య అనే లేడీ డైరెక్టర్ తో జత కట్టి వరుడు కావలెను మూవీ తో మంచి హిట్ అందుకున్నాడు.. దానితో నాగ శౌర్య నెక్స్ట్ మూవీ లక్ష్య పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. లక్ష్య సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది.. స్పోర్ట్స్ నేపథ్యం అంటే.. సినిమా లో యాక్షన్ సీన్స్, ఎమోషన్స్ అన్ని కలగిలిపి ఉంటాయి.. కానీ కమర్షియల్ హంగులు తక్కువగా ఉంటాయి.. అయినా కథ మీదున్న నమ్మకంతో నాగ శౌర్య ఈ ఆర్చరీ నేపథ్యం ఉన్న లక్ష్య మూవీ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.. మరి నాగ శౌర్య నమ్మకాన్ని లక్ష్య మూవీ నిలబెట్టిందో.. లేదో.. అనేది సమీక్షలో చూసేద్దాం. 

కథ:

పార్థు(నాగ శౌర్య)తండ్రి వాసు (ర‌విప్రకాష్‌) ఆర్చరీలో వరల్డ్ ఛాంపియన్ అవాలని అనుకున్నా.. అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరణిస్తాడు. పార్ధు తన తాత (సచిన్ ఖేడేకర్) అండతో విలువిద్యలో విశేషంగా రాణిస్తుంటాడు. త‌న కొడుకు క‌ల‌ను మ‌న‌వ‌డి ద్వారా తీర్చుకోవాల‌ని తాపత్రయ‌ప‌డ‌తాడు పార్ధు తాత. పార్ధు ల‌క్ష్య సాధ‌న కోసం ఆర్చరీలో ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు కురుక్షేత్ర ఆర్చరీ అకాడ‌మీలో చేర‌తాడు. ఆ అకాడమీలో రెండుసార్లు స్టేట్ ఛాంపియన్ అయిన రాహుల్ (శత్రు) పార్థు లోని టాలెంట్ ని, అతనెక్కడ తన కలని నిజం కాకుండా చేస్తాడేమో అని ఈర్ష్యపడిన రాహుల్ పార్డుపై ఓ కుట్రను పన్నుతాడు. ఆ సమయంలోనే పార్థు తాత మరణించడంతో.. పార్ధు కుంగిపోతాడు. ఆ త‌ర్వాత  జ‌రిగే ఓ సంఘ‌ర్షణ‌లో పార్థు చేతికి తీవ్ర గాయ‌మ‌వుతుంది. దాంతో పార్ధు అర్చరీకి దూరమవుతారు.అసలు పార్ధు పై రాహుల్ చేసిన కుట్ర ఏమిటి? అర్చరీకి దూరమైన పార్ధు మళ్లీ ఎలా గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు? పార్థు త‌న ల‌క్ష్య సాధ‌న కోసం ఏం చేసాడు? చివరికి అడ్డంకులు దాటుకుని ఆర్చరీలో పార్థు ఛాంపియన్ అయ్యాడా? అనేది మిగతా కథ.

పెరఫార్మెన్స్

పార్థు పాత్రలో నాగ‌శౌర్య పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు.. మొదట్లో స్టైలిష్ గాను, తర్వాత 8 పాక్స్ బాడీ తోనూ చ‌క్కటి వేరియేష‌న్ చూపించాడు. ముఖ్యంగా ఎయిట్ ప్యాక్ లుక్ కోసం నాగ శౌర్య ప‌డిన క‌ష్టం తెర‌పై క‌నిపిస్తుంది. ఆర్చరీ ఆట కోసం తపనపడే క్రీడాకారుడిగా నాగ శౌర్య ఎమోషనల్ పెరఫార్మెన్స్ బావుంది.. కాకపోతే రొమాంటిక్ గా అదరగొట్టే నాగ శౌర్య కి ఈ సినిమాలో మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. రితికా పాత్రలో కేతిక అందంగా అయితే క‌నిపించింది. కానీ కేతికకి న‌టించే ఆస్కారం దొర‌క‌లేదు. పార్ధు తాతగా స‌చిన్ ఖేడ్కర్, జ‌గ‌ప‌తిబాబుల పాత్రలు సినిమాకి బ‌లాన్నిచ్చాయి. మిగతా నటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

క్రీడా నేపథ్యంలో చాలా సినిమాలు తెరకెక్కాయి.. పవన్ కళ్యాణ్ తమ్ముడు, రవితేజ అమ్మానాన్నా తమిళ అమ్మాయి,  వెంకటేష్ గురు, అలాగే బాలీవుడ్ లో ఇంకా చాలా సినిమాలు స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కినవి ఉన్నాయి.. కాకపోతే స్పోర్ట్స్ డ్రామా అంటే.. పాలిటిక్స్, ఆపోజిట్ ప్లేయర్స్ కుట్రలు కుతంత్రాలు అనేవి కామన్. క్రికెట్, రన్నింగ్, బాక్సింగ్, ఫుడ్ బాల్ ల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చి సక్సెస్ అయినా.. ఆర్చరీ నేపథ్యంలో ఇంతవరకు సినిమా తీసిన వారు లేరు.. ఇప్పుడు అదే  ఆర్చరీ నేపథ్యంతో దర్శకుడు సంతోష్ జాగర్లమూడి లక్ష్య మూవీ ని తెరకెక్కించాడు. అయితే ఆర్చరీ అంటే విలు విద్య అనేది.. పెద్దగా ఆదరణకు నోచుకోని ఆట.. క్రికెట్, ఫుడ్ బాల్, బాక్సింగ్ లాగా ఆర్చరీ క్రీడ పెద్దగా పాపులర్ అయిన ఆట కాదు. ఇప్పుడు ఆ నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా సంతోష్ జాగర్లమూడి లక్ష్య మూవీ చేసాడు. మరి అన్ని స్పోర్ట్స్ డ్రామాలలో లాగే. లక్ష్య లో కూడా పాలిటిక్స్, కుట్రలు కుతంత్రాలు ఉన్నా.. ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. అలాగే ఆట చుట్టూ బ‌ల‌మైన డ్రామా పండ‌లేదు. గేమ్ లో స‌రైన ఎమోషన్స్ కానీ, ట్విస్ట్ లు కానీ క‌నిపించ‌వు. దీంతో సినిమా ఆద్యంతం చ‌ప్పగా సాగుతున్న ఫీలింగ్ తెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఒలింపిక్స్ అర్హత పోటీలు చూపించ‌డం.. అదే సమ‌యంలో పార్థు మ‌రో చోట గాయాల‌తో ప‌డిపోయి ఉండటం వంటి స‌న్నివేశాల‌తో సినిమా ఆస‌క్తిక‌రంగా ప్రారంభ‌మ‌వుతుంది. ఆ వెంట‌నే ఫ్లాష్‌బ్యాక్ స‌న్నివేశాలతో పార్థు బాల్యాన్ని, అత‌ని నేప‌థ్యాన్ని చ‌క‌చ‌కా ప‌రిచ‌యం చేసి ప్రేక్షకుల్ని నేరుగా క‌థ‌లోకి తీసుకెళ్లే ప్రయ‌త్నం చేశాడు ద‌ర్శకుడు. పార్థు అకాడ‌మీలోకి అడుగు పెట్టాకే క‌థ‌కు కాస్త ఊపొచ్చినట్లవుతుంది. అయితే గేమ్ చుట్టూ తిరగాల్సిన క‌థ తాత-మ‌న‌వ‌ళ్ల అనుబంధాల చుట్టూ తిరగడం.. అందులోనూ స‌రైన ఎమోషన్స్ పండ‌క‌పోవ‌డంతో సినిమా చ‌ప్పగా మారిపోతుంది. అంతేకాకుండా పార్థు ఆర్చరీలో స్టేట్ ఛాంపియ‌న్‌గా నిలిచిన తీరు మ‌రీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఆటలో ఎక్కడా ఫైట్ క‌నిపించ‌దు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు రాహుల్ గ్యాంగ్‌తో పార్థు త‌ల‌ప‌డే స‌న్నివేశాలు.. చేతి గాయంతోనే వ‌చ్చి ఒలింపిక్స్ అర్హత పోటీలో పాల్గొనే స‌న్నివేశాలు సినిమాకి ఊపు తీసుకొస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ లో పార్థు ని ఆర్చరీ నుండి తప్పించడంతో.. సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సెకండ్ హాఫ్ లో పార్థు త‌న ల‌క్ష్య సాధ‌న కోసం తిరిగి ఎలా స‌న్నద్ధమ‌య్యాడు.. ఈ క్రమంలో పార్థసార‌ధి అత‌నికెలా సాయ‌ప‌డ్డాడ‌న్నది ఆస‌క్తిక‌రంగా చూపించారు. కొన్ని సన్నివేశాలు నాటకీయంగా, సినిమాటిక్ గా ఉన్నా ఫస్ట్ హాఫ్ తో పోల్చితే క‌థ కాస్త ర‌స‌వ‌త్తరంగా సాగ‌డానికి సాయ‌ప‌డుతుంది. ఎయిట్ ప్యాక్ లుక్‌తో పార్థు పాత్ర క‌నిపించే స‌న్నివేశాలు, రెండు యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి ప్రధాన ఆక‌ర్షణ‌గా నిలిచాయి. క్లైమాక్స్ లో పార్థు ప్రపంచ ఆర్చరీ ఛాంపియ‌న్‌గా నిలిచే ఎపిసోడ్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అయితే కథలో స్ట్రాంగ్ విల‌న్ లేక‌పోవ‌డం ఈ సినిమాకి మెయిన్ మైనస్ అయ్యింది.

సాంకేతికంగా..

మ్యూజిక్ డైరెక్టర్ కాల భైర‌వ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అని చెప్పలేం కానీ.. ఆకట్టుకునేలా ఉంది. సాంగ్స్ కూడా సో సో గానే అనిపిస్తాయి. రామ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ ఓకె ఓకె.. నిర్మాణ విలువ‌లు ఫ‌ర్వాలేద‌నిపించాయి.

రేటింగ్: 2.25/5

Lakshya Movie Telugu Review:

Lakshya Movie Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement