Advertisement

సినీజోష్ రివ్యూ: దృశ్యం 2

Thu 25th Nov 2021 01:59 PM
drushyam 2 movie review,drushyam 2 movie,drushyam 2 movie telugu review,venkatesh drushyam 2 review,venkatesh,meena,jeethu josef  సినీజోష్ రివ్యూ: దృశ్యం 2
Drushyam 2 Movie Telugu Review సినీజోష్ రివ్యూ: దృశ్యం 2
Advertisement

సినీజోష్ రివ్యూ: దృశ్యం 2 

బ్యానర్: సురేశ్‌ ప్రొడక్షన్స్‌, 

నటీనటులు: వెంకటేశ్‌, మీనా, కృతిక, ఏస్తర్‌ అనిల్‌, సంపత్‌ రాజ్‌, నదియా, నరేశ్‌, పూర్ణ, తనికెళ్ల భరణి, సత్యం రాజేశ్‌ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: అనూప్‌ రూబెన్స్‌

సినిమాటోగ్రఫీ: సతీష్‌ కురుప్

ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె వెంకటేశ్‌

నిర్మాత: డి.సురేశ్‌బాబు, ఆంటోనీ పెరంబవూర్‌, రాజ్‌కుమార్‌ సేతుపతి

దర్శకత్వం: జీతూ జోసెఫ్‌

రీమేక్ రాజా.. వెంకీ మామ వెంకటేష్ పర భాషల్లో హిట్ అయిన సినిమాలని వరసగా రీమేక్ చేస్తూ..భారీ హిట్స్ కొట్టేస్తున్నారు. రీసెంట్ గా తమిళ అసురన్ ని తెలుగులో నారప్పగా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టిన వెంకటేష్.. తాజాగా మలయాళంలో భారీ హిట్ అయిన దృశ్యం 2 ని తెలుగులో దృశ్యం 2 గా రీమేక్ చేసి.. నేడు అమెజాన్ ప్రైమ్ ఓటిటి నుండి రీలీజ్ చేసేవారు. కరోనా పాండమిక్ సిట్యువేషన్ లో తన సినిమాలని ఓటిటి నుండి రిలీజ్ చేసి హిట్స్ కొట్టేస్తున్నారు వెంకీ. ఇక దృశ్యం సినిమాకి సీక్వెల్ గా వచ్చిన దృశ్యం2 సినిమాని ఒరిజినల్ దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకేకించడం, దృశ్యం మొదటి భాగం సూపర్ హిట్ అవడం, అలాగే మలయాళంలో దృశ్యం 2 బిగ్గెస్ట్ హిట్ అవడంతో.. ఇప్పుడు తెలుగులో వస్తున్న దృశ్యం 2 మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మరి దృశ్యంతో హిట్ కొట్టిన వెంకటేష్.. మరోసారి మీనా తో కలిసి దృశ్యం 2 తో హిట్ కొట్టారో లేదో సమీక్షలో చూసేద్దాం..

కథ:

దృశ్యం సినిమాకి కొనసాగింపుగా.. దృశ్యంలో ఐజి గీత(నదియా) కొడుకు వరుణ్‌ కనిపించకుండా పోయిన కేసు నుంచి బయటపడిన రాంబాబు (వెంకటేష్) ఫ్యామిలీ ని ఊరిలోవారు అనుమానిస్తూనే ఉంటారు. రాంబాబే ఈ హత్య చేసి ఉంటాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రాంబాబు కేబుల్ టివి ఓనర్ నుండి థియేటర్ ఓనర్ స్థాయికి ఎదుగుతాడు. థియేటర్ యజమానిగా ఓ సినిమా ని తీసే ప్లాన్ లో ఉంటాడు. ముగిసిపోయింది అనుకున్న వరుణ్‌ కేసు తాలూకు భయాలు మాత్రం రాంబాబు ఫ్యామిలీని వెంటాడుతూనే ఉంటుంది. పోలీసులు ఎక్కడ కనిపించినా రాంబాబు భార్య జ్యోతి(మీనా), పిల్లలు అంజు (కృతిక) అను (ఏస్తర్‌) భయపడుతూనే ఉన్తరు. ఇక రాంబాబు ఇంటి దగ్గర్లోనే.. ఒక భార్య భర్త తరచూ గొడవ పడుతుంటారు. భర్త భార్యని తరచూ కొడుతుంటాడు. అయితే పక్కింటి ఆమెకి సపోర్ట్ గా రాంబాబు భార్య జ్యోతి ఉంటుంది. అసలు ముగిసిపోయింది అనుకున్న వరుణ్ కేసుని గీత ఫ్రెండ్ ఐజీ గౌతమ్‌ సాహూ(సంపత్‌ రాజ్‌) మళ్ళీ రీ ఓపెన్ చేసి సీక్రెట్ గా రాంబాబు ఫ్యామిలీని వాచ్ చేస్తూ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. మరి వరుణ్ కేసు విషయంలో ఐజీకి దొరికిన ఆధారాలేంటి? అసలు రాంబాబు వరుణ్ ని చంపి పోలీస్ లకి అధరాలు దొరక్కుండా ఏం చేసాడు? కేసు రీ ఓపెన్‌తో రాంబాబు భార్య, పిల్లలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అసలు ఫైనల్ గా రాంబాబు ఫ్యామిలీ ఈ కేసు నుంచి బయటపడిందా? అనేది తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 2 చూసెయ్యాల్సిందే.

పెరఫార్మెన్స్:

రాంబాబు గా సెటిల్డ్ పెరఫార్మెన్స్ తో వెంకటేష్ మరోసారి అదరగొట్టేసారు. నారప్ప గా వెంకటేష్ లుక్స్, ఆయన నటనకు ఎంతైతే పేరొచ్చిందో.. దృశ్యం లోని రాంబాబు గా వెంకటేష్ కి అంతే పేరు వస్తుంది. కుటుంబ పెద్దగా.. తన భార్య, పిల్లలని కాపాడుకోవడానికి పడే తపన, ఎక్సప్రెషన్స్, ఎమోషన్స్ అన్ని సినిమాకే హైలెట్ అనేలా ఉన్నాయి. రాంబాబు భార్య పాత్రలో మీనా ఆకట్టుకుంది. కృతిక, ఏస్తర్‌లు పరిధి మేరకు నటించారు. ఐజీ పాత్రలో సంపత్‌రాజ్‌, కానిస్టేబుల్‌గా సత్యం రాజేశ్‌, లాయర్‌గా పూర్ణ తమ పాత్రలకి 100 పర్సెంట్ న్యాయం చేసారు. నదియా, నరేశ్‌ ఎప్పటిలాగే తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

విశ్లేషణ:

కూతురిని కాపాడుకోవడం కోసం.. తమ జీవితంలోకి వచ్చిన ఓ విష పురుగుని చంపేసి.. దానిని పోలీస్ లకి దొరక్కుండా కప్పెట్టేసిన కథ తో దృశ్యం మూవీ తెరకెక్కింది. మలయాళంలో వచ్చిన ఆ సినిమా అన్ని భాషల్లో రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్ గా దృశ్యం 2 తెరకెక్కినది. మరి దృశ్యం లో ఉన్న ట్విస్ట్ లు, ఉత్కంఠని దృశ్యం సీక్వెల్ లో మెయింటింగ్ చెయ్యడం సాధ్యమయ్యే పని కాదు.. కానీ దర్శకుడు జీతూ జోసెఫ్.. ఆరేళ్ళ క్రితం మరుగున పడిన మర్డర్ ని చేధించే ప్లాన్ చేసి.. మళ్ళీ రాంబాబు ఫ్యామిలీని ఇరుకున పడేసేలా.. దానిలో తగిన సస్పెన్స్, ఉత్కంఠ ఉండేలా ప్లాన్ చేసి దృశ్యం 2 తో మలయాళంలో సక్సెస్ అయ్యాడు. అదే కథని తెలుగు నేటివిటీకి సరిపోయేలా దృశ్యం 2 గా రీమేక్ చేసారు. ఒరిజినల్ కథలోని సోల్ మిస్ అవ్వకుండా.. తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాని దర్శకుడు తీర్చిదిద్దాడు. కథలోకి వెళితే.. ఐజి గీత కొడుకు వరుణ్ మిస్సింగ్‌ కేసు పూర్తయి ఆరేళ్లు అయిన తర్వాత నుంచి కథను మొదలు పెట్టిన దర్శకుడు ఆ కేసు ముగిసిపోయినా.. ఆ కేసు భయాలతో రాంబాబు భార్య, పిల్లలు ఎలాంటి మానసిక ఒత్తిడిని ఫేస్ చేసారు, అలాగే పక్కింటి వాళ్ల తగవులతో.. కాస్త సాగదీతగా అనిపించినా.. వరుణ్ కేసు పోలీస్ లు సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనగానే.. ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ మొదలవడం, ఆ కేసు లో రాంబాబాబు మరోసారి తన ఫ్యామిలీని రక్షించుకోవడానికి చేసే పనులు ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అయ్యేలా చేసాయి. పోలీసుల కి దొరక్కుండా రాంబాబు వేసే ఎత్తులు, పైఎత్తులతో కథ లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి వరుణ్‌ను హత్య చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకొని లొంగిపోవడంతో ప్రేక్షకుడిలో టెంక్షన్ మొదలవుతుంది. అక్కడ ఇచ్చిన ట్విస్ట్ కి ఆడియన్స్ మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంటుంది. ఇక రాంబాబు ఫ్యామిలీ కోర్టులో నిలబడే సన్నివేశాలు, కోర్టు వాదనలు అన్ని అద్భుతంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ కథ అంతా తనికెళ్ళ భరణి చేత పోలీస్ లకి చెప్పించడం అన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. దర్శకుడు జీతూ ప్రేక్షకులని కుర్చీలకి అతుక్కునేలా ట్విస్ట్ లు ఇవ్వడంలో మజా కనిపిస్తుంది. చాల రోజుల తర్వాత మంచి సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకులు ఎంజాయ్ చేసే చిత్రంగా దృశ్యం 2 నిలిచిపోతుంది అనడంలో సందేహమే లేదు.

సాకేతికంగా..

సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. అనూప్‌ రూబెన్స్‌ నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్‌ అనేలా ఉంది. సతీశ్‌ కురుప్‌ సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. తెలుగు నేటివిటీకి దగ్గరగా సన్నివేశానికి తగినట్లు ప్రతి ఫ్రేమ్‌ను అందంగా, ఉత్కంఠగా తీర్చిదిద్దాడు. మార్తాండ్‌ కె వెంకటేశ్‌ ఎడిటింగ్‌ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా కథకు సరిపోయేలా ఉన్నాయి. 

రేటింగ్: 2.75/5

Drushyam 2 Movie Telugu Review:

Drushyam 2 Movie Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement