Advertisement

సినీజోష్ రివ్యూ: వకీల్ సాబ్

Fri 09th Apr 2021 11:04 AM
vakeel saab movie,pawan kalyan,pawan klayan vakeel saab movie,dil raju,sri venkateswara creations,vakeel saab trailer,vakeel saab review,vakeel saab movie review,vakeel saab movie telugu review,pawan vakeel saav review  సినీజోష్ రివ్యూ: వకీల్ సాబ్
Cinejosh Review: Vakeel Saab సినీజోష్ రివ్యూ: వకీల్ సాబ్
Advertisement

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్

నటీనటులు: పవన్ కళ్యాణ్, శృతిహాసన్ (గెస్ట్ రోల్), నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్, ముకేశ్రిషి, వంశీ కృష్ణ, మీర్ తదితరులు

సంగీతం:  ఎస్.ఎస్.థమన్

ఫోటోగ్రఫీ:  పి.ఎస్.వినోద్

సమర్పణ:  బోనీకపూర్

నిర్మాత:  దిల్ రాజు

దర్శకత్వం: వేణు శ్రీరామ్

ఫ్యాన్స్ తో పవర్ స్టార్ అని పిలిపించుకుంటూ.. ట్రేడ్ తో కింగ్ అఫ్ ఓపెనింగ్స్ అనిపించుకుంటూ తనదైన స్టైల్, యాటిట్యూడ్, మేనరిజమ్స్ తో సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసే పవన్ కళ్యాణ్ రాజకీయాల వైపు వెళ్లడంతో నటుడిగా తనకో రెండేళ్ల గ్యాప్ వచ్చింది. ఆపై రీ ఎంట్రీ కోసం ఏరి కోరి హిందీ హిట్ ఫిలిం పింక్ రీమేక్ ని ఎంచుకుంటే కరోనా సృష్టించిన కలకలం ఇంకో వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చింది. మొత్తానికి మూడేళ్లకు పైగా వెండితెరకు దూరమైన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు నేడు (ఏప్రిల్ 9 ) వకీల్ సాబ్ గా తన వాదన వినిపించడానికి అభిమాన ప్రేక్షకుల ముందు ప్రత్యక్షమయ్యారు. అయితే మహిళా సాధికారికత ముఖ్యాంశంగా తెరకెక్కిన పింక్ వంటి కథలో పవన్ లాంటి స్టార్ ఇమడగలిగారా..? ఫ్యాన్స్ కోరుకునే తన పవర్ నీ - సబ్జెక్టులోని ఫ్లేవర్ నీ బ్యాలన్స్ చెయ్యగలిగారా..? చాలా గ్యాప్ తర్వాత రిలీజ్ అవుతోన్న బిగ్ లీగ్ హీరో సినిమాగా అందరిలోనూ రేకెత్తిన అంచనాలను అందుకోగలిగారా..? వకీల్ సాబ్ గురించి తన పద్దతిలోనే చెప్పుకుంటూ వెళదాం ఇక విశ్లేషణలోకి..!!
వకీల్ సాబ్ వాదించిన కేస్ : జాబ్స్ చేసుకుంటూ ఒకే ఫ్లాట్ లో కలిసుండే పల్లవి (నివేద థామస్), జరీనా (అంజలి), దివ్య (అనన్య) అనే ముగ్గురు మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఒకానొక సందర్భంలో కొందరు అబ్బాయిలని కలిస్తే, ఆ కుర్రాళ్ళు ఈ అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే పల్లవి ఏం చేసింది, ఎందుకు ఈ ముగ్గురు అమ్మాయిలు కోర్టులో ముద్దాయిలుగా నిలబడాల్సి వచ్చింది, వారిని ఆ కేసునుంచి బయటకు తేవడానికి - వనితల హక్కుని తెలియచెప్పడానికి డిఫెన్స్ లాయర్ సత్యదేవ్ (పవన్ కళ్యాణ్) ఎలా పోరాడాడు అన్నదే క్లుప్తంగా వకీల్ సాబ్ కథ. ఎంత క్లుప్తంగా చెప్పినా చాలా స్పష్టంగానే అర్ధం అయిపోయే ఈ స్టోరీ కాన్సెప్ట్ హిందీ, తమిళం రెండు భాషల్లోనూ మంచి మార్కులు వేయించుకుంది అంటే దానికి కారణం... ఈ కథలో కరెక్టుగా పండిన ఎమోషనల్ డ్రామా. అందుకే ఆ కోర్ట్ రూమ్ సీన్స్ వరకూ మార్పులు చేసే సాహసం మనవాళ్ళు కూడా చెయ్యలేదు. కానీ మిగిలిన పార్ట్ మొత్తం సినిమాటిక్ లిబర్టీని ఎక్కువగా తీసేసుకుని పవర్ స్టార్ ఇమేజుని బ్యాలన్స్ చేసే ప్రాసెస్ లో నానా ప్రయాసలు పడ్డారు. అవేంటో తరువాత చెప్పుకుందాం. ముందుగా....
వకీల్ సాబ్ చూపించిన జోష్ : పరిపక్వత చెందిన పవన్ కళ్యాణ్ నటనను మనకు పరిచయం చేస్తుంది లాయర్ సత్యదేవ్ పాత్ర. క్యాంపస్ స్టూడెంటుగా, ప్రేమికుడిగా, భర్తగా, తాగుబోతుగా, అడ్వకేటుగా వివిధ కోణాలను తనలో చూపుతూ.. ప్రతి యాంగిల్ లోనూ తనదైన స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకుంటూ వింటేజ్ పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అనిపించారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా కోర్ట్ సీన్స్ లో పవన్ పెరఫార్మెన్స్ హైలైట్ అని చెప్పాలి. తన ఆర్గ్యుమెంట్ గట్టిగా వినిపిస్తూనే అసలు ఎంటర్టైన్మెంట్ కే స్కోప్ లేని ఆ స్పేస్ లో తన మార్క్ చమక్కులతో అలరించారు పవన్. ఇక యాక్షన్ సీన్స్ లో పవన్ చూపించే పవర్ తెలిసిందే కదా. తనకే సొంతమైన యాటిట్యూడ్ తో ఫైట్స్ ని ఇంకాస్త హైట్స్ కి తీసుకెళ్లారు. మిగిలిన ప్రధాన పాత్రల విషయానికి వస్తే... నివేదా థామస్, అంజలి, ప్రకాష్ రాజ్ ఆయా క్యారెక్టర్స్ కి అదనపు బలం అయ్యారు. ఇప్పటికే బెస్ట్ పెరఫార్మెర్స్ గా ప్రూవ్ చేసుకున్న వ్యక్తులు కనుక మరోసారి అలవోకగా ది బెస్ట్ ఇచ్చారు. అనన్య, వంశీ కృష్ణ, ముకేశ్ ఋషి, మీర్ తదితరులు అందరూ కూడా వారి రోల్స్ లో ఒదిగిపోయారు.
వకీల్ సాబ్ స్ట్రాంగ్ ఎవిడెన్సులు : ఇమేజ్ కీ, ఇతివృత్తానికీ సమ న్యాయం చెయ్యాల్సిన వకీల్ సాబ్ అందుకోసమై సంపాదించిన స్ట్రాంగ్ ఎవిడెన్సులు ఏమిటంటే... పవన్ కళ్యాణ్ లుక్స్. తమ అభిమాన హీరోని ఒకే సినిమాలో మూడు వేరియేషన్స్ లో చూడడం కంటే ఫ్యాన్స్ కి కావాల్సింది ఏముంటుంది.! ఫస్టాఫ్ లోని బియర్డ్ లుక్ తో ఎంత మ్యాచోగా కనిపించారో - నల్లకోటు తొడిగి సెకండ్ హాఫ్ లో అంతే హుందాగా అనిపించారు పవన్. ఇక ఫ్లాష్ బ్యాక్ లోని పవన్ లుక్ ఫ్యాన్స్ కి బోనస్. టెక్నీషియన్స్ వైజ్ ఫస్ట్ చెప్పాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించే. తాను పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అంటూ ఓపెన్ గానే చెప్పుకున్న థమన్ తన అభిమానాన్ని వీలైనంత ప్రదర్శించే ప్రయత్నం చేసాడు. పాటలవరకూ ఆ కథకి తగ్గ అవుట్ పుట్టే ఇచ్చినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి  మాత్రం థియేటర్స్ దద్దరిల్లాయి. పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ కోర్ట్ రూమ్ డ్రామాని కరెక్ట్ వేలో ప్రోజెక్టు చేసింది. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, మాటల రచయిత తిరు, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు వకీల్ కేస్ గెలవాలని తమ తోడ్పాటు అందించారు. ఓ మై ఫ్రెండ్ తో ఫెయిల్యూర్ నీ, ఎమ్ సి ఏ తో ఎబోవ్ యావరేజ్ నీ చూసిన వేణు శ్రీరామ్ ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో బాగానే కష్టపడ్డాడు. పింక్ వంటి కాంప్లికేటెడ్ కథనీ... పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ నీ ఎట్ ఎ టైం డీల్ చెయ్యడం టఫ్ జాబ్ అయినప్పటికీ అటు స్టోరీలోని సోల్ చెడకుండా ఇటు పవన్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవ్వకుండా మ్యాగ్జిమమ్ ట్రై చేసాడు. పవన్ తో సినిమా నా డ్రీమ్ అని ఎప్పట్నుంచో చెబుతూ వస్తోన్న నిర్మాత దిల్ రాజు విష్ వకీల్ సాబ్ తో నెరవేరింది. దిల్ రాజు వల్ల లాయర్ సత్యదేవ్ వంటి మెమొరబుల్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ దరిచేరింది.
వకీల్ సాబ్ వీక్ ఎలిమెంట్స్ : తప్పుడు కేస్ లో ఇరుక్కుని నిస్సహాయ స్థితిలో నిలబడ్డ ఆడపిల్ల కోసం ఓ ముసలి లాయర్ ముందడుగు వెయ్యడం, కోర్టులో ఫైట్ చేసి విమెన్ రైట్ ని ప్రూవ్ చేయడం అనేది పింక్ స్టోరీలోని సోల్. ఆ కథకి తమిళ్ లో కాస్త సాంబార్ ఫ్లేవర్ మిక్స్ చేస్తే మనోళ్లు ఏకంగా దాన్నే దమ్ బిర్యానీలా మార్చేశారు. పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్ నుంచే చెవులు హోరెత్తిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మొదలెట్టి వీలున్న ప్రతి సీన్ కీ, వీలు చూసుకుని మరీ తీసుకున్న ప్రతి షాట్ కీ విపరీతమైన ఎలివేషన్ ఇచ్చుకున్నారు. దాంతో కథలో ఇన్ సెక్యూరిటీ అనేదే లేకుండా పోయింది. మెయిన్ డ్రామాలోని ఇంటెన్సిటీ మిస్ అయింది. ముఖ్యంగా పవన్ కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కథలో సరిగా ఇమడలేదు. అంతకుమించిన కంపేరిజన్స్ తో స్పాయిలర్స్ రాయడం కరెక్ట్ కాదు కనుక వదిలేద్దాం కానీ కొన్ని మాత్రం ప్రస్తావించి తీరాలి. టైటిల్ వకీల్ సాబ్ అయినందుకు అనుకుంటా.... సినిమాలోని ప్రతి పాత్ర పవన్ ని వకీల్ సాబ్ అని పిలిచేస్తూ ఉంటుంది. సరే వేరే పాత్రలైతే సరిపెట్టుకోవచ్చు కానీ సాటి లాయర్లు కూడా అలాగే పిలవడం, ప్రాసిక్యూట్ చేసే ప్రకాష్ రాజ్ కూడా నందా అని పిలిపించుకుంటూ పవన్ రోల్ కి పేరు లేనట్టు వకీల్ సాబ్ అనడం మరీ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అలాగే ఎవరికి ఏ అన్యాయం జరిగినా డైరెక్ట్ గా ఈ వకీల్ సాబ్ దగ్గరికే వచ్చెయ్యడం, ఎంపీ రేంజ్ వ్యక్తి ఈ వకీల్ సాబ్ పేరు వినగానే భయపడిపోవడం, వకీల్ డైరెక్ట్ గా వెళ్లి వార్నింగ్ లు ఇచ్చెయ్యడం అన్నీ ఆర్టిఫీషియల్ గా అనిపిస్తాయి. ఇరికించిన ఫైట్లు, అతికించిన మాటలు అయితే కోకొల్లలు. చివరిగా సాక్ష్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకునే కోర్టు ఆ పద్దతి పక్కనెట్టి మరీ తీర్పునిచ్చిన తీరు మీకు కన్విన్సింగ్ గా అనిపించలేదు అంటే దానికి కారణం వాదనలో సరైన పదును లేదనే ఫీలింగ్ కలగడమే.! 
వకీల్ సాబ్ మెయిన్ ఎట్రాక్షన్స్ : ఆఫ్ కోర్స్... పవన్ కల్యాణే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అనేది పసి పిల్లాడు కూడా చెప్పేదే. దానికి తోడు పవన్ వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబందించిన పలు డైలాగులు ఉండటం తన అభిమానులకు అదనపు ఆనందాన్ని ఇస్తుంది. యురేనియం తవ్వకాలు, సింగరేణి కార్మికుల సమస్యలు, బూటకపు ఎన్ కౌంటర్లు, విద్యార్థుల ఆగ్రహావేశాలు, పేదలపై పెద్దల దాడులు.... ఇలా చాలా టాపిక్స్ ని కవర్ చేస్తూ ఏ స్వార్ధం లేకుండా మనలాంటి వాళ్ళ కోసం నిలబడే వ్యక్తిని దూరం చేసుకోవడం జనం దురదృష్టం, ఏ జనం కోసమైతే ఆయన అన్నీ కోల్పోయాడో ఆ జనం తన నమ్మకాన్ని నిలబెట్టలేకపోయారు, ఆశతో వున్నవాడికే గెలుపు ఓటమి ఉంటాయి. ఆశయంతో ఉన్నవాడికి ప్రయాణం మాత్రమే ఉంటుంది, ఓటమి అంటే అవమానం కాదు మనల్ని మనం గెలిచే అవకాశం వంటి డైలాగ్స్ తో వకీల్ సాబ్ లోని జనసేనానిని ఎక్కడికక్కడ చూపించే ప్రయత్నం చాలా బలంగా జరిగింది. ఈ దేశంలో అడుక్కుంటే అన్నం దొరుకుతుంది, కాస్త కష్టపడితే ఉండడానికో గూడు దొరుకుతుంది. కానీ పేదవాడికి న్యాయం మాత్రం దొరకట్లేదు అనే మాటతో మోటివేట్ అయ్యే ఈ వకీల్ సాబ్ యాక్షన్ సీన్స్ లో కీళ్లు విరగ్గొడుతూ - కోర్ట్ లో సెక్షన్స్ చెప్పి అదరగొడుతూ ఫ్యాన్స్ ని బాగానే అలరించాడు. అయితే ఈ సినిమాకి అసలైన టార్గెట్ ఆడియన్స్ లేడీస్. మరి ఆ మహిళా ప్రేక్షకుల స్పందన పైనే అల్టిమేట్ రిజల్టు, రేంజు ఆధారపడి ఉంటాయి.
ఫైనల్ జడ్జిమెంట్ : కథని మించి కదం తొక్కిన హీరోయిజం.!! 
రేటింగ్: 3/5

Cinejosh Review: Vakeel Saab:

Pawan Kalyan Vakeel Saab Movie Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement