సినీజోష్ రివ్యూ: జాతి రత్నాలు

Thu 11th Mar 2021 02:36 PM
jathi ratnalu movie,naveen polishetty jathi ratnalu review,jathi ratnalu movie telugu review,jathi ratnalu movie review,jathi ratnalu movie review and rating,naveen polishetty,priyadarshi,rahul ramakrishna,anudeep,nag ashwin,swapna cinemas  సినీజోష్ రివ్యూ: జాతి రత్నాలు
Jathi Ratnalu Movie Review సినీజోష్ రివ్యూ: జాతి రత్నాలు

నటీనటులు: నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, గిరిబాబు, బ్రహ్మాజీ, శుభలేఖ సుధాకర్, తనికెళ్ళ భరణి, నరేశ్, వెన్నెల కిశోర్ తదితరులు.

సంగీతం: రధన్

ఎడిటింగ్: అభినవ్ రెడ్డి దండ

సినిమాటోగ్రఫీ: సిద్ధం మనోహర్

నిర్మాణం: స్వప్నా సినిమా

దర్శకత్వం: అనుదీప్ కేవీ

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో గోల్డ్ పేస్ బాయ్స్ లా కనిపించి.. ఆ సినిమా హీరో కన్నా సైడ్ కేరెక్టర్స్ చేసిన విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ హీరో అయితే.. నవీన్ పోలిశెట్టి మంచి హీరో అయ్యాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అంటూ మంచి థ్రిల్లర్ సబ్జెక్టు తోనే కామెడీ పండించిన నవీన్ పోలిశెట్టి.. తర్వాత బాలీవుడ్ లో చిచ్చోరె సినిమాలో నటించి మెప్పించాడు. ఎక్కడో యూట్యూబ్ వీడియోస్ చేసుకునే నవీన్ పోలిశెట్టి తన కామెడీతోనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. రీసెంట్ గా మరో ఇద్దరు కమెడియన్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లతో కలిసి నాగ్ అశ్విన్, స్వప్న దత్ ల స్వప్న సినిమా బ్యానర్ లో అనుదీప్ దర్శకత్వంలో జాతి రత్నాలు అంటూ కామెడీ ఎంటర్టైనర్ తో వచ్చేసాడు. జాతి రత్నాలు రిలీజ్ కి ముందే భారీ ప్రమోషన్స్ తో సినిమాపై యూత్ లో, ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేసారు. మరి నవీన్ పోలిశెట్టి అండ్ బ్యాచ్ చెప్పినట్టుగా జాతి రత్నాలు ప్రేక్షకులను ఎంతవరకు ఎంటర్టైన్ చేసారో సమీక్షలో చూసేద్దాం.

కథ:

జోగిపేట్ లో లేడీస్ ఎంపోరియమ్ ను రన్ చేస్తున్న శ్రీకాంత్ (నవీన్ పొలిశెట్టి) కి శేఖర్ (ప్రియదర్శి), రవి (రాహుల్ రామకృష్ణ) అనే ఇద్దరు స్నేహితులు ఉంటారు. లేడీస్ ఎంపోరియమ్ లో పని చెయ్యడం ఇష్టం లేని శ్రీకాంత్.. గాలికి తిరిగే ఇద్దరు స్నేహితులతో కలిసి హైద్రాబాద్ లో ఉద్యోగం సంపాదించి లైఫ్ ను ఎంజాయ్ చేయాలనుకుంటాడు. అలా శ్రీకాంత్, రవి, శేఖర్ లు హైద్రాబాద్ కు పయనమవుతారు. అక్కడో రిచెస్ట్ అపార్ట్ మెంట్ లో మకాం పెడతారు. పక్క ఫ్లాట్ లో ఉంటున్న చిట్టి (ఫరియా అబ్బుల్లా) తో శ్రీకాంత్ ప్రేమాయణం మొదలుపెడతాడు. అలా నడుస్తున్న క్రమంలో ముగ్గురు స్నేహితులు.. అనుకోకుండా ఓ కేసు విషయంలో జైల్లో పడతారు. జాలిగే తిరిగే వారు హైదరాబాద్ వచ్చి ఎలాంటి కష్టాలు పడ్డారు.? ముగ్గురు స్నేహితులు జైలు కెందుకెళ్లారు.? అసలు వారు ఇరుక్కున్న కేసు ఏమిటి? ఆ కేసు నుండి మన జాతి రత్నాలు బయటికి ఎలా వచ్చారు? అనేది మిగతా కథ.

పెరఫార్మెన్స్:

శ్రీకాంత్ గా నవీన్ పోలిశెట్టి పెరఫార్మెన్స్ చాలా నేచురల్ గా అనిపిస్తుంది. నవీన్ కామెడీ టైమింగ్ అదుర్స్. నవీన్ కామెడీ టైమింగ్.. జాతి రత్నాల ప్రమోషన్స్ లో ఎప్పటికప్పుడు రివీల్ అయినా.. జాతి రత్నాలు సినిమాలో మాత్రం నవీన్ పోలిశెట్టి కడుపుబ్బా నవ్వించేసాడు. ఇక మరో ఇద్దరు రత్నాలు గా నటించిన రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి కామెడీ తో సినిమాను నిలబెట్టారు. వెన్నెల కిశోర్ కామెడీ మరింతగా మెప్పిస్తుంది. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చక్కటి అభినయంతో మెప్పించింది. ఈ సినిమా తర్వాత ఆమెకి వరుస ఆఫర్స్ లభిస్తాయనడంలో సందేహంలేదు. ఈ సినిమాలో బిగ్ సర్ప్రైజ్ గెస్ట్ రోల్స్ లో కీర్తి సురేశ్ మెరుపులు, ఒక షాట్ లో విజయ్ దేవరకొండ కనిపించడం ప్రేక్షకులకి కిక్ ఇస్తుంది. జడ్జ్ గా బ్రహ్మానందం నవ్వులు పూయిస్తారు. ఇక మురళీ శర్మ, బ్రహ్మాజీ, గిరిబాబు, శుభలేఖ సుధాకర్, తణికెళ్ళ భరణి, జబర్దస్త్ మహేశ్ పాత్రలు కూడా కామెడీగా ఆకట్టుకునేలా ఉన్నాయి.

విశ్లేషణ:

కామెడీనే ప్రధాన అస్త్రంగా చేసుకొని కథ రాసుకున్నప్పుడు ఒకోసారి లాజిక్కులు మిస్ అవుతుంటాయి. అయితే ఆ వీక్ నెస్ ను కవర్ చేసి, ప్రేక్షకుల్ని పూర్తిగా సినిమాలోకి లీనం చేయాలంటే మాత్రం.. హిలేరియస్ కామెడీని వర్కవుట్ చేయాల్సి ఉంటుంది. కథకు తగ్గ కేరెక్టర్స్ రాసుకుంటే.. కొత్త దర్శకుడు అనుదీప్ తన డెబ్యూ మూవీకి సరిగ్గా ఆ వ్యూహాన్నే అనుసరించాడు. అందులో దర్శకుడు అనుదీప్ దాదాపు గా సక్సెస్ అయ్యాడు కూడా. సినిమా స్టార్టింగ్ నుంచి వన్ లైన్ పంచులు పేలుస్తూ జాతి రత్నాలుగా ముగ్గురు స్నేహితులూ చేసిన ఎంటర్ టైన్ మెంట్ అంతా ఇంతా కాదు. కామెడీ హైలెట్ అయితే సరిపోదు.. కామెడీని పండించే నటులకు ఆ సత్తా ఉండాలి. అదే అనుదీప్ కి ప్రధాన ఆయుధంగా మారింది. టాప్ కమెడియన్స్ తో హీరో నవీన్ పండించిన కామెడీకి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వడం ఖాయం. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ .. హాస్యం పండించడంలో ఆరితేరిన వారు. ఆ ముగ్గురితోనూ టైటిల్ జెస్టిఫికెషన్ ఇవ్వడానికి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకూ బాగా కష్టపడ్డాడు దర్శకుడు. సినిమాలో కథకి ప్రాధాన్యత అనిపించదు. అలాగే కథలోకి ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యే టైం కూడా ఇవ్వలేదు. సింపుల్ కథను మెయిన్ లీడ్ పై ఆద్యంతం కామెడీను హైలైట్ చేస్తూ బాగా డీల్ చేసారు. అనుదీప్ కి జాతి రత్నాలు ఫస్ట్ సినిమానే అయినా ఒక అవుట్ అండ్ అవుట్ ఫన్నీ రోలర్ కాస్టర్ జర్నీగా ఈ సినిమాను హ్యాండిల్ చెయ్యడంలో తన పనితనం కనిపిస్తుంది. ఈ సినిమా ఫస్టాఫ్ వరుస పంచ్ లతో.. గ్యాప్ లేని కామెడీతో ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తుంది. సెకండాఫ్ కొచ్చేసరికి  కొన్ని డ్రాగులు, ఫస్టాఫ్ రేంజ్ లో కామెడీ వర్కవుట్ కాకపోవడంతో కాస్త బ్యాలెన్స్ తప్పినట్టుగా అనిపించినా క్లైమాక్స్ లో కథపై కామెడీ పై చెయ్యి సాధించింది. మరి కొన్నివారాలుగా సీరియస్ సినిమాలతో సర్దుకుపోతున్న ప్రేక్షకులకి జాతి రత్నాలు నవ్వులు పంచడం 100% పక్కా.

సాంకేతికంగా:

రధన్ మ్యూజిక్ సినిమాకి హైలెట్ అనే చెప్పాలి. చిట్టి నీ నవ్వే.. పాట చాలా బాగుంది. మిగతా రెండు మూడు పాటలు సరదాగా సాగాయి. ఇక నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలకు తగ్గట్టుగా ఆకట్టుకుంది. సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ మాత్రం షార్ప్ గ అనిపిస్తుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. 

పంచ్ లైన్: నవ్వుల నవ రత్నాలు

రేటింగ్: 3.0/5

Jathi Ratnalu Movie Review:

Jathi Ratnalu Movie Telugu Review