Advertisement

సినీజోష్ రివ్యూ: చక్ర

Fri 05th Mar 2021 01:13 PM
chakra movie,chakra movie review,vishal chakra movie telugu review,chakra review  సినీజోష్ రివ్యూ: చక్ర
Chakra Movie Review సినీజోష్ రివ్యూ: చక్ర
Advertisement

బ్యానర్: విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ 

నటీనటులు: విశాల్, రెజీనా కసాండ్రా,శ్రద్ధ శ్రీనాథ్, కేఆర్ విజయ, రోబో శంకర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: యువన్ శంకర్ రాజా

సినిమాటోగ్రఫీ: బాల సుబ్రహ్మణియన్

ఎడిటింగ్: త్యాగు

నిర్మాత: విశాల్

రచన, దర్శకత్వం: ఎం.ఎస్. ఆనందన్

అభిమన్యుడు, డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ మూవీస్ తో ఫామ్ లోకొచ్చిన విశాల్ మళ్ళీ అదే పంథా కథలను ఎంచుకుంటున్నాడు. యాక్షన్ హీరోగా విశాల్ అభిమన్యుడు లాంటి కథతో చక్ర తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అభిమన్యుడు సైబర్ క్రైమ్ థిల్లర్ గా ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడంతో.. మళ్ళీ అలాంటి కథతోనే చక్ర అంటూ విశాల్ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాడు. చక్ర ప్రోమోస్, ట్రైలర్ అన్ని అభిమన్యుడు సినిమాని పోలి ఉండడంతో అంచనాలు కూడా పెరిగాయి. మరి విశాల్ సొంత నిర్మాణంలో తెరకెక్కిన చక్ర ప్రేక్షకులను ఎంత థ్రిల్ చేసిందో సమీక్షలో చూసేద్దాం.

కథ:

ఆగస్టు 15న అనేక ప్రాంతాల్లో వరుసగా 50 ఇళ్లల్లో ఒకేసారి దోపిడీలతో కథ ప్రారంభమవుతుంది. ముసుగు వ్యక్తులు ఈ దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఈ దోపిడీల కేసును కమిషనర్ పోలీస్ ఆఫీసర్ గాయత్రి (శ్రద్ధా శ్రీనాధ్)కు అప్పగిస్తారు. అప్పటికే ఆమె చంద్రు (విశాల్)తో ప్రేమలో ఉంటుంది. దోపిడీ గురైన ఇళ్లలో చంద్రు ఇల్లు కూడా ఉంటుంది. చంద్రు ఓ మిలటరీ ఆఫీసర్. అతని తండ్రికి సంబంధించిన అశోక చక్ర అవార్డును కూడా దోపిడీ దారులు దోచుకుంటారు. ఈ దోపిడీలు చిన్న దొంగల పని కాదని, దీని పెద్ద నెట్ వర్క్ ఉందని కేసు దర్యాప్తులో బయటపడుతుంది. ఈ కేసు దర్యాప్తులో గాయత్రికి చంద్రు సహాయ పడతాడు. అసలు ఈ దొంగతనం దొంగల పనా? లేదంటే ఎవరన్నా మాస్టర్ మైండ్ ఈ నేరాలకు పాల్పడుతున్నారా? చంద్రు తన తండ్రి అశోక్ చక్ర ని దక్కించుకుంటాడా? అసలు ఈ దోపిడీ కేసుని ఓ మిలటరీ ఆఫీసర్ ఎలా సాల్వ్ చేసాడు? అనేది చక్ర కథ.

పెరఫార్మెన్స్:

చంద్రుగా విశాల్ బాగా చేశాడు. ఎప్పటిలాగే మిలటరీ ఆఫీసర్ గా లుక్స్ పరంగా అదరగొట్టేసాడు. పెరఫార్మెన్స్ లోను విశాల్ దూకుడు చూపించాడు. హీరోయిన్ శ్రద్ద శ్రీనాధ్ అటు పోలీస్ ఆఫీసర్ గా ఇటు గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. యాక్షన్ సన్నివేశాల్లోను శ్రద్ద మంచి నటన కనబర్చింది. రెజీనా నెగెటివ్ పాత్రలో తన పాత్రకి న్యాయం చేసింది. మిగతా నటులు పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

ఈ డిజిటల్ నేరాలకు సంబంధించిన సినిమాలు ఇంతకుముందు కూడా చాలానే వచ్చాయి. ఎక్కడిదాకో ఎందుకు గతంలో విశాల్ చేసిన అభిమన్యుడు తరహాలోనే ఈ చక్ర సినిమా కూడా ఉంటుంది. హ్యాకింగ్ నేటి సమాజంపై ఎలాంటి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. డిజిటల్ నేరగాళ్లు ఎందుకు తయారవుతున్నారు.దీన్ని ఎలా అరికట్టవచ్చు.. అనే అంశాలను దర్శకుడు ఈ సినిమాలో డీల్ చేశాడు. కథ, కథనం, విశాల్ పాత్ర చూడగానే అందరూ అభిమన్యుడికి సీక్వెల్ గానే ఊహించుకుంటారు. అయితే చక్ర సైబర్ క్రైమ్ కథాంశం కాస్త కొత్తగా కనిపిస్తుంది అంతే. దర్శకుడు ప్రేక్షకుడిని కథలోకి నేరుగా తీసుకెళ్లే ప్రయత్నం చేసాడు. ఫస్ట్ హాఫ్ అంతా ముసుగు వ్యక్తుల దోపిడీ దొంగతనాలు.. వాటిని ఛేదించే ఓ పోలీస్ ఆఫీసర్.. ఆమెకి హెల్ప్ చేసే మిలటరీ ఆఫీసర్.. ఆ కేసుని చేధించే క్రమంలో ఉన్న చిక్కుముడులు విప్పే ప్రయత్నంతో బాగానే ఆకట్టుకుంది. కనీ సెకండ్ హాఫ్ లో ఆ గ్రిప్ కొనసాగించలేకపోయారు. ఇంటర్వెల్ కి ముందు లీల కేరెక్టర్ ని చూపించి సెకండ్ హాఫ్ మీద ఆసక్తి కలిగించినా.. లీల ఎత్తులకు చంద్రు పై ఎత్తులు వేసినా.. అది చాలా లైట్ గా అనిపిస్తుంది.. కానీ అందులో ఇంట్రెస్ట్ గా ఏమి కనిపించదు. ఎలాంటి కథ అయినా విలన్ పవర్ ఫుల్ గా ఉంటేనే సినిమా రక్తి కడుతుంది. పైగా ఇందులో విలన్ ఓ యువతి. ఆమెను మిలటరీ ఆఫీసర్ పట్టుకోవడం అంటే కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్టు ఉంటుంది. విశాల్ కోసం ఫైట్స్ పెట్టాల కాబట్టి మధ్యలో కొందరు నేరగాళ్లను ఈ కథలో కలిపి హీరో వాళ్లతో పోరాట సన్నివేశాలను చూపించాల్సి వచ్చింది. విలన్ డిజిటల్ క్రైమ్ లో తోపు అని చూపించేరేగానీ ఎక్కడా ఆ ఊపు కనిపించదు. డిజిటల్ క్రైమ్ అని ఏదేదో ఊహించేసుకుని సినిమాకి వెళితే నిరాశ తప్పదు. 

సాంకేతికంగా:

యువన్ శంకర్ రాజా సంగీతానికి పెద్దగా స్కోప్ లేదు. ఒకే ఒక పాట ఉంది. నేపధ్య సంగీతం ఫరవాలేదు. బాల సుబ్రహ్మణియన్ ఫోటోగ్రఫి సినిమాకి రిచ్ లుక్ ని తీసుకొచ్చింది. ఎడిటింగ్ లో కత్తెర వెయ్యాల్సిన సీన్స్ లెక్కబెట్టలేనన్ని ఉన్నాయి. నిర్మాణ విలువలు కథానుసారం బావున్నాయి.

పంచ్ లైన్: ఈసారి సైబర్ చక్రం సరిగా తిరగలేదు 

రేటింగ్: 2.5/5

Chakra Movie Review:

Vishal Chakra Movie Telugu Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement