Advertisement

సినీజోష్ రివ్యూ: కపటధారి

Fri 19th Feb 2021 01:04 PM
sumanth,kapatadhaari movie review,sumanth kapatadhaari,kapatadhaari telugu review,kapatadhaari review rating,kapatadhaari movie rating  సినీజోష్ రివ్యూ: కపటధారి
Kapatadhaari movie Telugu review సినీజోష్ రివ్యూ: కపటధారి
Advertisement

బ్యానర్: క్రియేటివ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ అండ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌

నటీనటులు: సుమంత్‌, నందిత, సుమన్ రంగనాథ్, నాజర్‌, జయప్రకాశ్, వెన్నెల కిషోర్‌ తదితరులు

సంగీతం: సిమన్‌ కె కింగ్‌

సినిమాటోగ్రఫీ: రసమతి

ఎడిటర్‌: ప్రవీణ్‌ కేఎల్‌

నిర్మాతలు: ధనంజయన్‌, లలితా ధనంజయన్‌

దర్శకత్వం: ప్రదీప్‌ కృష్ణమూర్తి

అక్కినేని హీరోల్లో ప్రస్తుతం బాగా వెనుకబడిపోయిన హీరో సుమంత్. కొన్నేళ్లుగా ప్లాప్స్ తో కొట్టుమిట్టాడిన సుమంత్ కి మళ్ళీ రావా హిట్ కొంత ఊరటనిచ్చింది. సుబ్రమణ్యపురంతో ఫామ్ లో కొచ్చిన సుమంత్ కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన సూపర్ థ్రిల్లర్ కవలుధారి సినిమాను కపటధారిగా రీమేక్ చేసాడు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రని సుమంత్ పోషించాడు. కన్నడ కవలుధారి తమిళంలో కూడా రీమేక్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది. తమిళంలో కవలుధారి రీమేక్ కి పాజిటివ్ రివ్యూస్ రావడంతో కవలుధారి రీమేక్ కపటధారిపై అంచనాలు, ఆసక్తి పెరిగింది. మరి కపటధారి తెలుగు ప్రేక్షకులను ఎంత థ్రిల్ చేసిందో చూద్దాం.

కథ:

ట్రాఫిక్ ఎస్.ఐ గా పనిచేస్తున్న గౌతమ్ (సమంత్)కి క్రైమ్ డిపార్ట్ మెంట్ లోకి వెళ్లలేకపోయానన్న అసంతృప్తి తో విధులు నిర్వర్తిస్తుంటాడు. గౌతమ్ ట్రాఫిక్ డ్యూటీ చేసే ప్రాంతాల్లో తవ్వకాల్లో మూడు అస్తి పంజరాలు బయటపడతాయి. అయితే ఆ కేసుని శోధించే పోలీసులు అది ఏదో ప్రమాదంలో మరణించిన వారి శవాలుగా కేసు క్లోజ్ చేసే ప్రయత్నాలు చేసే టైం లో ట్రాఫిక్ ఎస్ ఐ గౌతమ్ ఈ కేసుని పర్సనల్ గా తీసుకుంటాడు. గౌతమ్ ఇన్వెస్టిగేషన్ లో ఆ కేసు మలుపుల మీద మలుపులు తీసుకుంటూ మరింత క్లిష్టంగా మారుతుంది. అసలు ఈ కేసులో గౌతమ్ కి ఎదురైన సమస్యలేమిటి? ఆ హత్యలు ఎందుకు జరిగాయి? ఎవరు చేసారు? ఎప్పుడో చనిపోయి.. మరుగున పడిపోయిన ఆ కేసుని గౌతమ్ ఎలా ఛేదించాడు? అనేది మిగతా కథ.

పెరఫార్మెన్స్:

గౌతమ్ గా, ట్రాఫిక్ అధికారిగా సుమంత్ మెప్పించాడు. పాత్ర వరకు ఓకె గాని.. ఆ పాత్రలో ఉండాల్సిన గంభీరత మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇక జీకేగా తమిళ నటుడు రాజశేఖర్, రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ గా నాజర్ లు కథ గ్రిప్పింగ్ గా కొనసాగేందుకు దోహదపడ్డారు. హీరోయిన్ నందిత పాత్రకి పెద్దగా స్కోప్ లేదు. వెన్నెల కిషోర్ ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా నవ్వించాడు. విలన్ గా కన్నడ నటుడు సతీష్ కుమార్ ఆ పాత్రకు చక్కగా సరిపోయాడు. మిగతావారు పరిధిమేర ఆకట్టుకున్నారు. 

విశ్లేషణ:

కన్నడలో హిట్ అయిన కలవధారి రీమేక్ చెయ్యడం కాదు.. దర్శకుడు ప్రదీప్‌ కృష్ణమూర్తి యాజిటీజ్ గా కపటధారిగా దింపేసాడు. ప్రతి క్రైం థ్రిల్లర్ మూవీస్ లో ఉన్న ట్విస్ట్ లు, సమస్యలు కపటధారిలో కూడా కనిపిస్తాయి. కాకపోతే ఓ ట్రాఫిక్ పోలీసు ఆఫీసర్.. హత్య కేసుకి ముడివడిన చిక్కుముడులు విప్పుతూ ఎలా ఇన్వెస్టిగేషన్ చేసాడనేది కాస్త కొత్తగా అనిపిస్తుంది. అప్పుడెప్పుడో 40 ఏళ్ళ క్రితం జరిగిన హత్యలను హీరో ఎలా సాల్వ్ చేసాడో అనేది ఈ క్రైం థ్రిల్లర్ కపటధారి కథ. కేసు పరిశోథన చేసేటప్పడు కథ అర్థం కావడానికి ఆ పాత్రలతోనే చెప్పించడం కొత్తగా అనిపించింది. కాకపోతే కొంత గందరగోళంగానూ అనిపిస్తుంది. కేసుని ఇన్వెస్ట్ గేషన్ చేసే టైం లో హీరో కి రిటైర్డ్ పోలీసు అధికారి అయిన నాజర్ తోడవడంతో కథలో స్పీడు పెరుగుతుంది. అయితే కేసు పరిశోధనలో అనేక ట్విస్ట్ లు కనిపిస్తుంటాయి. కేసు సాల్వ్ అవుతుంది అనుకున్న తరుణంలో కేసు మరో మలుపు తిరిగుతుంది. ఇలాంటి ట్విస్ట్ లతోనే కపటధారి ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతగా మెప్పించకపోయిన సెకండ్ హాఫ్ పర్వాలేదనిపిస్తుంది. కలవదారిని ఉన్నది ఉన్నట్టుగా తెలుగులో తెరకెక్కించినా కన్నడలో ఉన్న ఎమోషన్స్ తెలుగులో పండలేదు. డైలాగుల్లో లిప్ మూమెంట్ కొన్ని చోట్ల సింక్ కాలేదు. మూల కథను తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి కొన్ని కమర్షియల్ అంశాలు చేరిస్తే సినిమా మరో మెట్టు పైన ఉండేది. 

సాంకేతికంగా:

ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ రీరికార్డింగ్. క్రైం థ్రిల్లర్ కథలకు ఉంల్సిన నేపధ్య సంగీతం ఈ సినిమాకి బాగా హెల్ప్ చేసింది. రసమతి ఫోటోగ్రఫి బావుంది. నిర్మాణ విలువలు పరిమితులకు లోబడి ఉన్నట్లుగా అనిపిస్తుంది.

పంచ్ లైన్ : కన్నడ దారిలో కపటధారి 

రేటింగ్: 2.25/5

Kapatadhaari movie Telugu review:

Sumanth Kapatadhaari Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement