Advertisement

సినీజోష్ రివ్యూ: జాంబీ రెడ్డి

Fri 05th Feb 2021 02:48 PM
zombie reddy movie,zombie reddy telugu movie review,zombie reddy review,prashanth varma,teja sajja,daksha nagarkar,anandi  సినీజోష్ రివ్యూ: జాంబీ రెడ్డి
Zombie Reddy Movie Review సినీజోష్ రివ్యూ: జాంబీ రెడ్డి
Advertisement

బ్యానర్: యాపిల్ ట్రీ స్టూడియోస్ 

నటి నటీనటులు: తేజ సజ్జ, ఆనంది, దక్ష నాగర్కర్, గెటప్ శ్రీను, హర్షవర్ధన్, హరిబాబు, హరితేజ, పృథ్వి రాజ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: మార్క్ కే రాబిన్

సినిమాటోగ్రఫీ: విల్లే 

ఎడిటర్: సాయి బాబు 

నిర్మాత: రాజశేఖర్ వర్మ 

డైరెక్టర్: ప్రశాంత్ వర్మ 

జాంబీ అనే జోనర్ తెలుగు ప్రేక్షకులకు కొత్తే. హాలీవుడ్ వాటిల్లో జాంబీ జోనర్ లో తెరకెక్కే మూవీస్ లో థ్రిల్ ఉంటుంది. ఆ కోవకు చెందిన సినిమాలన్నీ ఓ సీరియస్ థీమ్ లోనే సాగుతుంటాయి. అలాంటి జాంబీ ని తెలుగుకి పరిచయం చెయ్యాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ కొత్తగా ట్రై చేసాడు. అయితే సీరియస్ నెస్ కి కామెడీ జొప్పించి జాంబీ ని కాస్త జాంబీ రెడ్డిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. తేజ సజ్జని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాని ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు. మరి జాంబీ అనే పదాన్ని, ఆ జోనర్ ని కొత్తగా చూస్తున్న, వింటున్న తెలుగు ప్రేక్షకులను జాంబీ రెడ్డి ఆకట్టుకున్నాడా లేక నిరాశ పరిచాడా.. తేజ సజ్జా హీరోగా ఎంత వరకు న్యాయం చేసాడు.. అనేది సమీక్షలో చూసేద్దాం.

కథ:

మారియో (తేజ సజ్జ‌)  వీడియో గేమ్ డిజైనర్‌. మారియో డిజైన్ చేసిన ఓ వీడియో గేమ్ సంచలనం సృష్టిస్తుంది. ఆ వీడియో గేమ్ ట్రెండ్ అవుతున్న సమయంలో ఆ వీడియో గేమ్ లో ఏర్పడిన బగ్స్ వలన ట్రేండింగ్ లో ఉన్న గేమ్ కి సమస్య ఏర్పడుతుంది. అయితే అందులో వచ్చిన ఎర్రర్స్ ని క్లియర్ చేసుకోవడం కోసం మారియో కర్నూలు కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ కర్నూలులో ఫ్రెండ్ పెళ్లి జరుగుతుంటుంది. తన స్నేహితుడు (హేమంత్) సహాయంతో వీడియో గేమ్ ఎర్రర్స్ ని పరిష్కరించుకుందామనుకున్న మారియోకి తన ఫ్రెండ్ సీమ పగల మధ్య ఇరుక్కున్నాడనిపించి.. ఫ్రెండ్ పెళ్లి ఆపడానికి ట్రై చేస్తుంటాడు. మ‌రోవైపు కర్నూలు వెళ్లే టైం లో మారియో ఫ్రెండ్ ఒకరు జాంబీలా మారిపోయి మనుషులను కొరుక్కుని తినేస్తుంటాడు. ఆఊరు ఊరంతా జాంబీలుగా మారిపోతారు. అసలు మనుషులు అలా జాంబీలు గా ఎందుకు మారాల్సి వచ్చింది? మారియో తన ఫ్రెండ్ పెళ్లి ఆపగలిగాడా? మారియో జాంబీ ల నుండి ఎలా తప్పించుకున్నాడు? అనేది మిగతా కథ.

పెరఫార్మెన్స్:

చైల్డ్ ఆర్టిస్ట్ గా తేజ సజ్జా ప్రేక్షకులకు సుపరిచితుడే. అందుకే హీరోగా లాంచ్ అయిన కొత్తగా అనిపించడు. ఎప్పుడూ చూసిన మొహం లాగే కనబడతాడు. అయితే ప్రశాంత్ వర్మ కూడా మరీ హీరోయిజాన్ని తేజ మీద రుద్దకుండా.. చాలా లైట్ గానే హీరోగా ప్రోజెక్ట్ చేసాడు. మారియో పాత్రకి సూట్ అయ్యాడు. లుక్స్ పరంగా సో సో గా అనిపించినా నటన పరంగా పర్లేదనిపించాడు. హీరోయిన్ ఆనంది నటన పరంగాను లుక్స్ పరంగాను ఆకట్టుకుంటుంది. దక్ష నగార్కర్ ప్రమోషన్స్ లో గ్లామర్ గా కనిపించింది ఆమె పాత్రని సినిమాలో మాత్రం తేల్చేసారు. జస్ట్ గ్లామర్ పరంగా ఆకట్టుకుంటుంది. సినిమాలో మెయిన్ కమెడియన్స్ గా జబర్దస్త్ ఫేమ్ గెటప్ శీను మెప్పించాడు. ఆర్జే హేమంత్, పృథ్వీ కూడా కామెడీ పరంగా బాగానే కష్టపడ్డారు. మిగతా వారు పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

తెలుగు ప్రేక్షకులు కొత్తగా వింటున్న పేరు జాంబీ. జాంబీ మూవీ హాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన జోనర్. ఆద్యంతం ఆసక్తిరేకెత్తించే కథల్లో కావాల్సినంత థ్రిల్లింగ్ ఉంటుంది. అందుకే ఆ జోనర్ హాలీవుడ్ లో బాగా సక్సెస్ అయ్యింది. కానీ ఇక్కడ దర్శకుడు ప్రశాంత్ వర్మ జాంబీ కథకు కామెడీ జొప్పించాడు. తెలుగు ప్రేక్షకులకు పరిచయమే లేని జోనర్ కి తెలుగు ప్రేక్షకులు బాగా ఇష్టపడే కామెడీని లింక్ చేసి జాంబీ రెడ్డిగా మార్చేశాడు. కరోనా క్రైసిస్ టైం లో కరోనా వ్యాక్సిన్ ప్రయోగంతో మనుషులు జాంబీలుగా మారడమనే కాన్సెప్ట్ కొత్తగా అనిపించడంతో సినిమాపై అందరిలో ఆసక్తి రేకెత్తింది. టీవీలో ప్రధాన మంత్రి రేపటి నుండి లాక్ డౌన్ అంటూ ప్రకటన వస్తూ ఉండగానే కరోనాకు వేక్సిన్ ప్రయోగం అంటూ మనుషుల ఫై ఇంజక్షన్ ఇవ్వటం విచిత్రంగా అనిపిస్తుంది. కాకపోతే సినిమాలో కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా జాంబీలు పుట్టారనేది మాత్రం ప్రేక్షకులకు అసలు ఎక్కదు. జాంబీలు మిగతా మనుషుల్ని ఎటాక్ చేయడం ఆ తర్వాత పరిణామాలన్నింటినీ కూడా ప్రశాంత్ కేవలం కామెడీ కోసమే వాడుకోవడం వల్ల ఎక్కడా ఈ కాన్సెప్ట్ ను సీరియస్ గా తీసుకుని.. ప్రేక్షకులు భయపడే పరిస్థితి ఉండదు. అయితే ఆ క్రమంలో వచ్చే కామెడీ సన్నివేశాలు మాత్రం పేలవీయంగా ఉన్నాయి. జబర్దస్త్ ఫేమ్ గెటప్ శీను, ఆర్జే హేమంత్ కేరెక్టర్స్ తో కామెడీ బాగానే పండించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.  ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యాక్షనిజం, సిల్లీ కామెడీ గా అనిపిస్తుంది. జాంబీలకు విరుగుడు మందు విషయంలో దేవుడితోనూ ముడిపెట్టే ప్రయత్నం జరిగింది కానీ దానిలో కూడా ప్రేక్షకులు అంత ఇన్వాల్వ్ అవ్వరు. 'అ' సినిమా చూసి ప్రశాంత్ వర్మ పై అంచనాలు పెంచుకుని కల్కికి సినిమా చూస్తేనే అది జస్ట్ యావరేజ్ అనిపించుకుని. ఇక ఆ రెండు చూసి జాంబీని ఎక్కువగా ఊహించుకుని థియేటర్స్ కి వెళితే కష్టం. కాదు మనకు లాజిక్కులతో ట్విస్ట్ లతో అవసరం లేదు అంటే జాంబీ రెడ్డిని ఓ లుక్కేయ్యొచ్చు. 

సాంకేతికంగా..

ఈ సినిమాకి మార్క్ కె రాబిన్ నేపధ్య సంగీతం ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. అక్కడక్కడా సౌండ్స్ తో ఇబ్బంది పెట్టినా ఓవరాల్ గా బావుంటుంది. ఇక విల్లే కెమరా గొప్పదనం అడుగడుగునా కనిపిస్తుంది. ఈ సినిమాలో మరో హైలెట్ మేకప్ ఆర్టిస్ట్ లే. జాంబీల మేకప్ చూస్తే వారి కష్టం తెలుస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నా.. అవి సినిమాకు ఏ మాత్రం ఉపయోగ పడలేదు. 

పంచ్ లైన్: జాంబీ రెడ్డి 'ఆ' అనేలా కాదు 'ఊహు' అనేలా వుంది. 

రేటింగ్:1.5/5

Zombie Reddy Movie Review:

Zombie Reddy Telugu Movie Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement