Advertisement

సినీజోష్ రివ్యూ: రెడ్

Thu 14th Jan 2021 04:18 PM
red movie,ram,red telugu review,ram movie red,red movie review rating  సినీజోష్ రివ్యూ: రెడ్
Cinejosh Review Red సినీజోష్ రివ్యూ: రెడ్
Advertisement

బ్యానర్: స్రవంతి మూవీస్ 

నటీనటులు: రామ్ పోతినేని, మాళవికా శర్మ, నివేథా పేతురాజ్, అమృత అయ్యర్, సత్య, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ , పవిత్ర లోకేష్ తదితరులు

సంగీతం: మణిశర్మ

కెమెరా: సమీర్ రెడ్డి

నిర్మాత: స్రవంతి రవికిషోర్

మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కిశోర్ తిరుమల

లవర్ బాయ్ రామ్ ని పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ అంటూ మాస్ శంకర్ గా మార్చేశాడు. ఐస్మార్ట్ శంకర్ లో రామ్ మాస్ లుక్స్ కెవ్వు కేకే. రామ్ డాన్స్, రామ్ లాంగ్వేజ్ అన్ని మేజర్ హైలెట్స్. అంత బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ నుండి తమిళంలో హిట్ అయిన తడమ్ కి ఆధారంగా కిషోర్ తిరుమల మాస్ ఎలిమినేట్స్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా రెడ్ సినిమాని తెరకెక్కించాడు. లాక్ డౌన్ కి ముందు విడుదల కావాల్సిన రెడ్ మళ్ళీ ఇన్నాళ్ళకి థియేటర్స్ లోనే విడుదలైంది. ఓటిటి నుండి వచ్చిన బడా ఆఫర్స్ ని రామ్ వద్దని థియేటర్స్ కోసం భీష్మించుకుని కూర్చున్నాడు. మరి ఇస్మార్ట్ శంకర్ తో భారీ హిట్ కొట్టిన రామ్ రెడ్ తో ఆ హిట్ ని కొనసాగించాడా.. లేదా.. అనేది సమీక్షలో చూసేద్దాం.

కథ:

ఆదిత్య అండ్ సిద్ధార్థ్ గా రామ్ రెండు పాత్రల్లో కనిపిస్తాడు.  ఆదిత్య ఒక దొంగ. సిద్ధార్థ్ ఇంజనీర్. ఆదిత్య పేకాట ఆడడం కోసం మోసాలకు పాల్పడుతుంటాడు. స్నేహితుడు వేమా(సత్య) అప్పులు కట్టడానికి దాచుకున్న డబ్బుతో ఆదిత్య పేకాట ఆడి వాటిని పోగొడతాడు. ఆ డబ్బు ఎలా సర్దాలో తెలియక సతమతమవుతున్న టైం లోనే ఆకాష్ అనే వ్యక్తి చంపబడతాడు. ఆ హత్య చేసింది సిద్ధార్థ్ నే చెప్పి అతన్ని అరెస్టు చేస్తారు. మరోపక్క ఆదిత్య కూడా ఇదే కేసులో చిక్కుకుంటాడు. ఇంతకీ ఆకాష్‌ను ఎవరు చంపారు? అసలు ఆ హత్య వెనుక అలాగే కథలోని అసలు చిక్కు ముడి వెనుక మొత్తం ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి? చివరకు ఆదిత్య అండ్ సిద్ధార్థ్ ఆ హత్య కేసు నుండి ఎలా బయటపడతారు ? అనేది మిగిలిన కథ.

నటన:

రామ్ ఆదిత్య గా సిద్దార్థ్ గా రెండు పాత్రల్లో వేరియేషన్ చూపించాడు. అక్కడక్కడా లుక్స్ ఒకేలా ఉన్నా.. రామ్ కాస్త డిఫ్రెంట్ గా కనిపించడానికి ట్రై చేసాడు. ఆదిత్య పాత్ర లో మాస్ గా కనిపించడానికి రామ్ చాలానే కష్టపడ్డాడు. హీరోయిన్స్ ముగ్గురు ముగ్గురే. నివేత పేతురేజ్, మాళవిక శర్మ పాత్రలకి ప్రాధాన్యత అనిపించకపోయినా ప్రతి పాత్ర కథలో ముఖ్యమైందిలా అనిపిస్తుంది. ప్రతి పాత్ర ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ లో అదరగొట్టేసింది. మిగతా వారు పరిధిమేర ఆకట్టుకున్నారు. 

విశ్లేషణ:

క్రైమ్ థ్రిల్లర్ కథలు ప్రేక్షకులకి కొత్త కాదు. కానీ ఇలాంటి కథల్లో సాగదీత అసలు పనికి రాదు. కిషోర్ తిరుమల తమిళంలో హిట్ అయిన తడమ్ కి రీమేక్ గా ఈ సినిమాని రూపొందించినా రెడ్ లో అదనపు ఆకర్షణగా ఫ్యామిలీ డ్రామా ని యాడ్ చేసాడు.  సినిమా ఫస్ట్ హాఫ్ అంతా సిద్దార్థ్, ఆదిత్యల ప్రేమ కథని అరిష్కరించిన దర్శకుడు ఫస్ట్ హాఫ్ ని బాగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అంతా సాగదీతే కనిపిస్తుంది. ప్రధానంగా స్క్రీన్ ప్లే లోపమే కనిపిస్తుంది. పాత్రలు అలా ఎందుకు మారాయో చూపడానికి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఆ సన్నివేశాలు కూడా బోర్ కొట్టిస్తాయి. ఇంటర్వెల్ ముందు సన్నివేశాలు సెకండ్ హాఫ్ ఉత్కంఠను కలిగిస్తాయి. ఆకాష్ హత్య తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఆ కేసు ఆదిత్య, సిద్దార్థ్ మీదకి వెళ్లడం, ఆ హత్య ఎవరు చేసారో అనే ఇన్వెస్టిగేషన్ మొదలవడంతో కథ ఆసక్తిగా మారుతుంది. అయితే క్లైమాక్స్ లోనే కథలోని చిక్కుముడి వీడేలా చేసాడు దర్శకుడు. కథ సీరియస్ గా సాగుతున్న టైం లో ఫ్యామిలీ టచ్ ఇవ్వడం కథకి బ్రేకులు వేసిన్ ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో రామ్ ద్విపాత్రాభినయం కొత్తగా అనిపిస్తుంది. కథ నేపథ్యం కొత్తగానే ఉన్నా అక్కడక్కడా సాగదీత సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. కథకు అవసరం లేని అనవసరమైన సన్నివేశాలు ఎక్కువైపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.

సాంకేతికంగా..

మణిశర్మ అందించిన మ్యూజిక్ బావుంది. హెబ్బా చేసిన దించాక్ ఐటెం సాంగ్ మెప్పిస్తుంది. నేపథ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. నిర్మాత స్రవంతి రవి కిషోర్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్: 2.25/5

Cinejosh Review Red:

Red Movie Telugu Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement