Advertisement

ఏటిటి రివ్యూ: డర్టీ 'హరి'

Sat 19th Dec 2020 04:03 PM
dirty hari movie,dirty hari telugu review,dirty hari movie review  ఏటిటి రివ్యూ: డర్టీ 'హరి'
Dirty Hari Movie Review ఏటిటి రివ్యూ: డర్టీ 'హరి'
Advertisement

డర్టీ హరి మూవీ ఏటిటి రివ్యూ 

నటీనటులు: శ్రవణ్ రెడ్డి, రుహాణి శర్మ, సిమ్రత్ కౌర్, సురేఖ వాణి, అప్పాజీ, జబర్దస్త్ మహేష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: మార్క్ కె రాబిన్

నిర్మాతలు :  గుడూరు సతీష్ బాబు, గుదురు సాయి పునీత్

దర్శకుడు : ఎం.ఎస్.రాజు

వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో సక్సెస్ ఫుల్ నిర్మాత గా మారిన ఎం ఎస్ రాజు.. వాన, తూనీగ తూనీగ సినిమాలతో దర్శకుడిగా మారి చేతులు కాల్చుకున్నాడు. అయినా డైరెక్షన్ ని వదలకుండా నేటి తరాన్ని దృష్టిలో పెట్టుకుని డర్టీ హరి అనే అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాని తెరకెక్కించాడు. మరి కరోనా టైం లో బాగా క్లిక్ అయిన ఓటిటి, ఏటిటీల మధ్యలో తన డర్టీ హరి ని ఫ్రైడే మూవీస్ ఏటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మా సినిమాలో అడల్ట్ కంటెంట్ లేదు.. కేవలం ఒక్క సాంగ్ కే పరిమితం అంటూ ఎం ఎస్ రాజు తన సినిమాని ప్రమోట్ చేసుకున్నాడు. అయినా ఫ్యామిలీ ప్రేక్షకులకు బోల్డ్ కంటెంట్ మూవీస్ అంతగా ఎక్కవు. ఓటిటి మరియు ఏటిటి లలో ఇంట్లోనే అందరూ కలసి కూర్చుని ఫ్యామిలీస్ చూసే సినిమాలే క్లిక్ అవుతాయి. ఇలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలకు ఫ్యామిలీ ప్రేక్షకుల ఆదరణ ఉండదు. ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే ఇలాంటి సినిమాలను ఇష్టపడతారు. అయినా డర్టీ హరి సినిమా ఫ్రైడే మూవీస్ లో చూడాలంటె 120 రూపాయలు పెట్టి టికెట్ కొనాలనే రూల్ పెట్టి మరి సినిమాని ఏటిటిలో విడుదల చేసారు. మరి డర్టీ హరి సినిమాకి ఆ ఒక్క వర్గం ప్రేక్షకుల ఆదరణ అయినా దక్కిందో లేదో సమీక్షలో చూద్దాం.

కథ:

పల్లెటూరిలో పెరిగిన హరి(శ్రవణ్ రెడ్డి) ఎన్నో కలలు కంటూ వాటిని నిజం చేసుకోవాలని హైదరాబాద్ కు వస్తాడు. అక్కడ వసుధ(రుహాని శర్మ) అనే గొప్పింటి అమ్మాయి ఆమె సోదరుడు అలాగే సోదరుడు గర్ల్ ఫ్రెండ్ జాస్మిన్(సిమ్రాత్ కౌర్) బాచ్ లో హరి కలుస్తాడు. అక్కడ వసుధ ఫ్రెండ్ జాస్మిన్ ని చూసి ఆకర్షితుడవుతాడు హరి. అదే టైం లో వసుధ ఆస్తికి ఆకర్షితుడై.. హై లైఫ్ అనిభావించడానికి వసుధకి ప్రపోజ్ చేస్తాడు. వాళ్ళ ప్రేమకు పెద్దల అంగీకరించడంతో హరి - వసుధ పెళ్లి జరిగిపోతుంది. వసుధాని పెళ్లి చేసుకున్న హరి అంతకుముందే పరిచయం వున్న జాస్మిన్ తో ఎఫ్ఫైర్ నడిపిస్తాడు. జాస్మిన్ ఎఫ్ఫైర్ సీక్రెట్ గా దాస్తూ మేనేజ్ చేసే హరి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు? వసుధకి తెలియకుండా జాస్మిన్ వ్యవహారాన్ని హరి ఎలా దాచి పెట్టాడు?  హరి ఇద్దరమ్మాయిల మధ్యన ఎలా నలిగి పోయాడు? చివరికి డర్టీ హరి ఏం చేసాడు? అనేది మిగతా కథ.

నటీనటుల నటన:

సినిమా మొత్తం మూడు కేరెక్టర్స్ చుట్టూనే తిరుగుతుంది. శ్రవణ్ రెడ్డి - రుహని శర్మ - సిమ్రత్ కౌర్ ల చుట్టూనే కథ తిరుగుతుంది. హీరో శ్రవణ్ రెడ్డి డర్టీ హరి పాత్రలో ఆకట్టుకునే విధంగా చాలా సెటిల్డ్ గా చేసాడు. శ్రవణ్ కానీ లుక్స్ మరియు డైలాగ్ డెలివరీ కానీ చాల బావున్నాయి. అలాగే శ్రవణ్ నటన సినిమాకు మెయిన్ ఎస్సెట్ అని చెప్పొచ్చు. హీరోయిన్స్ గా నటించిన రుహని శర్మ - సిమ్రత్ కౌర్ లు తమ పాత్రల్లో చెలరేగిపోయాయిరు రుహాణి శర్మ తన పాత్రకి న్యాయం చేసింది.. హై లైఫ్ అమ్మాయిగా చక్కగా సెట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో మరో మేజర్ హైలైట్ సిమ్రత్ కౌర్ పాత్ర. బోల్డ్ రోల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. బోల్డ్ సీన్స్ లోనే కాకుండా తన పెర్ఫామెన్స్ తో కూడా సిమ్రాత్ ఆకట్టుకుంటుంది. ఇక సురేఖ వాణి, మహేష్ వంటి నటులు పాత్రల పరిధి మేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

ఒకప్పుడు ప్రేమ కథలని నమ్ముకుని హిట్ కొట్టిన నిర్మాత ఎం ఎస్ రాజు అదే ప్రేమ కథలను దర్శకత్వం వహించి బొక్క బోర్లా పడ్డాడు. ఈసారి ప్రేమ కథలను పక్కనబెట్టి నమ్మక ద్రోహం, అడల్ట్ కంటెంట్ ని నమ్ముకున్నాడు. డర్టీ హరి అనే టైటిల్ తో సినిమాలో డర్టీ ఎంతుంటుందో చెప్పకనే చెప్పేసాడు. టైటిల్ లోనే డర్టీ నెస్ చూపించిన దర్శకుడు కథలో మాత్రం నమ్మక ద్రోహంతో కూడిన మర్డర్ ఎలిమినేట్స్ తో బోల్డ్ సీన్స్ తో నెగ్గుకురావాలని ప్రయత్నించాడు. అవి ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చవని తెలిసినా యూత్ ని టార్గెట్ చేస్తూ దర్శకుడు ఎం ఎస్ రాజు ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇక కథలోకి వెళితే సినిమా స్టార్టింగ్ లోనే బోల్డ్ సన్నివేశాలతో ప్రారంభించి రిచ్ లైఫ్ ని పరిచయం చెయ్యడం కోసం ప్రతి సీన్ లో ప్రతి ఒక్కరి చేతిలో మందు గ్లాస్, చేతిలో సిగరెట్స్, హీరోయిన్స్ తో స్కిన్ షోస్ తో బూతు డైలాగ్స్ తో సరిపెట్టాడు.. సెకండ్ హాఫ్ కొచ్చేసరికి కథలోకి తీసుకొచ్చిన దర్శకుడు ఇల్లీగల్ కాంటాక్ట్స్ లో ఇరుక్కున్న హీరో పడే కష్టాలు, హీరోయిన్స్ మధ్యలో నలిగిపోయే హీరో ఇబ్బందులును, ఆ ఇబ్బందులను అధిగమించే క్రమంలో హీరో కేరెక్టర్ జాస్మిన్ కేరెక్టర్ ని ఆమె ఫ్రెండ్ ని చంపెయ్యడం షాకింగ్ ట్విస్ట్ గా చూపించారు. ఆ మర్డర్ కేసు నుండి హీరో ఎలా తప్పించుకున్నాడు. హరి భార్య వసుధ ఈ కేసునుండి హరిని ఎలా బయట పడేసింది అనేది క్లైమాక్స్ ట్విస్ట్ గా చూపించారు. ప్రేమ కథ చిత్రాలతో బాగా పాపులర్ అయిన ఎం ఎస్ రాజు నుండి ఇలాంటి చిత్రాలని కనీసం ఊహించనైనా ఉండరు. కానీ యూత్ పల్స్ తో ఆకట్టుకుందామని ట్రై చేసి ఎం ఎస్ రాజు ఈ సినిమాతో తన పేరుని మరింత దిగజార్చుకున్నారేమో అనిపిస్తుంది.

సాంకేతికంగా.. ఈ సినిమాలో ఎక్కువ పాటలు  కూడా లేకపోవడం కాస్త ఊరటనిస్తోంది. మార్క్ కె రాబిన్ నేపధ్య సంగీతం అంతగా ఆకట్టుకునేలా లేదు.  కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్, బాగున్నాయి. ఎడిటింగ్ లో లేపెయ్యల్సిన సీన్స్ చాలా ఉన్నాయి. అక్కడక్కడా డీసెంట్ గా ఉంది కానీ కొన్ని చోట్ల స్లో నరేషన్ ను కవర్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి.

రేటింగ్: 2.0/5 

Dirty Hari Movie Review:

Dirty Hari Telugu Movie Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement