Advertisement

సినీజోష్‌ రివ్యూ: వీడెవడు

Sat 16th Sep 2017 05:38 AM
telugu movie veedevadu review,sachin new movie veedevadu,veedevadu movie review in cinejosh,veedevadu movie cinejosh review  సినీజోష్‌ రివ్యూ: వీడెవడు
veedevadu movie review సినీజోష్‌ రివ్యూ: వీడెవడు
సినీజోష్‌ రివ్యూ: వీడెవడు Rating: 2.25 / 5
Advertisement

వైకింగ్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 

వీడెవడు 

తారాగణం: సచిన్‌ జోషి, ఈషా గుప్తా, ప్రభు, కిశోర్‌, శ్రీనివాసరెడ్డి, హర్షవర్థన్‌, వెన్నెల కిషోర్‌, ప్రతాప్‌ పోతన్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: బినేంద్ర మీనన్‌ 

సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌ 

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి 

మాటలు: వేణు మండేపూడి 

నిర్మాత: రైనా జోషి 

రచన, దర్శకత్వం: తాతినేని సత్య 

విడుదల తేదీ: 15.09.2017 

మౌనమేలనోయి చిత్రంతో హీరోగా పరిచయమైన సచిన్‌ జోషి ఆ సినిమా తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఏ సినిమా కూడా అతనికి హీరోగా మంచి గుర్తింపు నివ్వలేకపోయింది. అయినా అడపా దడపా సినిమాలు చేస్తూ హీరోగా బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్న సచిన్‌ తాజాగా తన సొంత బేనర్‌లో తాతినేని సత్య దర్శకత్వంలో నిర్మించిన చిత్రం వీడెవడు. భీమిలి కబడ్డీ జట్టు, ఎస్‌ఎంఎస్‌ వంటి డిఫరెంట్‌ సినిమాలు రూపొందించిన తాతినేని సత్య వీడెవడు చిత్రానికి ఎంచుకున్న కథాంశం ఏమిటి? సచిన్‌ని ఈ సినిమాలో ఎలా ప్రజెంట్‌ చేశాడు? ఈ సినిమా సచిన్‌ కెరీర్‌కి ఎంత వరకు ఉపయోగపడుతుంది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

అతని పేరు సత్య(సచిన్‌ జోషి). ఒక హత్య కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేస్తారు. పెళ్లయిన రెండో రోజే భార్య శృతి(ఈషా గుప్తా)ని హత్య చేయడం అందర్నీ షాక్‌కి గురి చేస్తుంది. సత్యని 14 రోజులపాటు రిమాండ్‌కి పంపిస్తుంది కోర్టు. ఈ కేసుని ఓ స్పెషల్‌ ఆఫీసర్‌(కిషోర్‌)కి అప్పగిస్తారు. సత్య నుంచి నిజం రాబట్టేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తారు. కానీ, తన చిత్రమైన ప్రవర్తనతో పోలీసుల్ని ముప్పుతిప్పలు పెడుతూ వుంటాడు సత్య. అంతకుముందు కబడ్డీ మ్యాచ్‌లో జైలర్‌(సుప్రీత్‌) తమ్ముడు.. సత్యవల్ల చనిపోతాడు. దానికి సత్యపై ప్రతీకారం తీర్చుకోవాలని జైలర్‌ ఎదురుచూస్తుంటాడు. ఎవరెన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా సత్య మాత్రం నిజం చెప్పడు. ఇంతకీ శృతిని సత్య ఎందుకు హత్య చేశాడు? పోలీసుల విచారణ తెలిసిన నిజాలేమిటి? చివరికి ఈ కథ ఎలా ముగిసింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

ఇంతకుముందు సచిన్‌ చేసిన క్యారెక్టర్లకు భిన్నమైన క్యారెక్టర్‌ ఈ సినిమాలో చేసినప్పటికీ పెర్‌ఫార్మెన్స్‌ పరంగా పూర్తి న్యాయం చెయ్యలేకపోయాడు. ఇది కేవలం డైరెక్టర్‌ సినిమా అనిపిస్తుందే తప్ప హీరో సినిమా అని ఏ దశలోనూ అనిపించదు. సినిమాలో సచిన్‌ని క్లోజప్‌ షాట్స్‌లో చూపించిన సందర్భాలు కూడా చాలా తక్కువ. పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్‌ ఎక్కువగా వున్న ఈ క్యారెక్టర్‌ని చాలా లైట్‌గా తీసుకొని చేసినట్టుగా వుంది. తొలి సినిమా అయినప్పటికీ హీరోయిగా ఈషా గుప్తా తన గ్లామర్‌తో, పెర్‌ఫార్మెన్స్‌తో మంచి మార్కులే పొందింది. స్పెషల్‌ ఆఫీసర్‌గా నటించిన కిశోర్‌ తన నేచురల్‌ పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. మొదట నెగెటివ్‌గా అనిపించిన అతని క్యారెక్టర్‌లోని వేరియేషన్స్‌ని బాగా చూపించాడు. శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెల కిషోర్‌, హర్షవర్థన్‌ అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశారు గానీ అంతగా వర్కవుట్‌ అవ్వలేదు. హీరోయిన్‌ తండ్రి క్యారెక్టర్‌లో నటించిన ప్రభు ఓకే అనిపించాడు. హీరోపై పగతో రగిలిపోయే జైలర్‌గా సుప్రీత్‌ ఎప్పటిలాగే బాగా చేశాడు. చాలా కాలం తర్వాత తెరపై కనిపించిన ప్రతాప్‌ పోతన్‌ సైకియాట్రిస్ట్‌ క్యారెక్టర్‌ని చాలా నేచురల్‌గా చేశాడు. 

సాంకేతిక విభాగాల పనితీరు గురించి చెప్పుకోవాలంటే ఫోటోగ్రఫీ సినిమాకి చాలా ప్లస్‌ అయిందని చెప్పాలి. బినేంద్ర మీనన్‌ ప్రతి సీన్‌ని చాలా కేర్‌ తీసుకొని చిత్రీకరించాడు. ఫారిన్‌ లొకేషన్‌లో తీసిన సీన్స్‌ చాలా రిచ్‌గా అనిపించాయి. థమన్‌ మ్యూజిక్‌ సినిమాకి కొంతవరకు ప్లస్‌ అయింది. అతను చేసిన పాటల్లో మూడు పాటలు వినదగ్గవిగా వున్నాయి. పాటల పిక్చరైజేషన్‌ రొటీన్‌గానే వుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం థమన్‌ బాగా చేశాడు. సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా తన మ్యూజిక్‌తో సీన్స్‌ని బాగా ఎలివేట్‌ చెయ్యడంలో సక్సెస్‌ అయ్యాడు. కథ, కథనాల గురించి చెప్పుకోవాలంటే ఇది పాత కథ. దాన్ని తన స్క్రీన్‌ప్లేతో కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు సత్య. ప్రజెంట్‌లో స్టార్ట్‌ అయిన సినిమాని మధ్య మధ్య ఫ్లాష్‌బ్యాక్‌ సీన్స్‌తో ఆడియన్స్‌కి అర్థమయ్యేలా కథని నడిపించాడు. హీరో తన భార్యని ఎందుకు హత్య చేశాడు? అనేది రివీల్‌ చెయ్యకుండా ఫస్ట్‌హాఫ్‌ వరకు సస్పెన్స్‌ బాగానే మెయిన్‌టెయిన్‌ చేశాడు. అయితే మధ్యలో వచ్చే సీన్స్‌ కొన్ని బోర్‌ కొట్టించేవిగా వున్నాయి. అయితే సెకండాఫ్‌లో ఏం జరగబోతోందనే ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చెయ్యడంలో సత్య సక్సెస్‌ అయ్యాడు. అయితే క్లైమాక్స్‌ వరకు ఆగకుండా మధ్యలోనే హీరో నిజం చెప్పే అవకాశం వున్నప్పటికీ అతను నోరు విప్పడు. ఈ సినిమాకి కథలోని మెయిన్‌ పాయింట్‌, స్క్రీన్‌ప్లే, కొన్ని ట్విస్ట్‌లు, కొంత సస్పెన్స్‌ ప్లస్‌ పాయింట్స్‌కాగా, సస్పెన్స్‌ రివీల్‌ చెయ్యకుండా సినిమాని సాగదీయడం, క్లైమాక్స్‌లో రివీల్‌ చేసిన సస్పెన్స్‌, మర్డర్‌ వెనుక వున్న మిస్టరీ, దాన్ని వివరించిన విధానం ఆడియన్స్‌ తికమక పెట్టేదిగా వుంది తప్ప ఈజీగా అర్థమయ్యేలా లేకపోవడం మైనస్‌ పాయింట్స్‌. ఫైనల్‌గా చెప్పాలంటే ఈమధ్యకాలంలో వచ్చిన కొన్ని పనికిరాని సినిమాల కంటే వీడెవడు బెటర్‌ సినిమా అని చెప్పొచ్చు. ఆడియన్స్‌ని సస్పెన్స్‌లో వుంచుతూనే కొన్ని సీన్స్‌లో థ్రిల్‌ చేసిన వీడెవడు ఏవరేజ్‌ సినిమాగా కొంతమేర ఆకట్టుకుంటుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: ఓకే.. అనిపించుకున్నాడు!

veedevadu movie review:

sachin new movie veedevadu review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement