Advertisement

సినీజోష్‌ రివ్యూ: త్రిష లేదా నయనతార

Fri 06th Nov 2015 04:38 PM
telugu movie trisha leda nayanatara,tamil movie trisha illana nayanatara,trisha leda nayanatara movie review,trishan leda nayanatara cinejosh review,g.v.prakash in trisha leda nayanatara  సినీజోష్‌ రివ్యూ: త్రిష లేదా నయనతార
సినీజోష్‌ రివ్యూ: త్రిష లేదా నయనతార
Advertisement

కేమియో ఫిలింస్‌ ఇండియా, రుషి మీడియా 

త్రిష లేదా నయనతార 

తారాగణం: జి.వి.ప్రకాష్‌, ఆనంది, మనీషా యాదవ్‌, 

సిమ్రాన్‌, విటివి గణేష్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ఎం.నాథన్‌ 

మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి 

సంగీతం: జి.వి.ప్రకాష్‌ 

ఎడిటింగ్‌: ఆంటోని ఎల్‌. రూబెన్‌ 

సమర్పణ: కేమియో సి.జె.జయకుమార్‌ 

నిర్మాణం: రుషి మీడియా 

రచన, దర్శకత్వం: ఆదిక్‌ రవిచంద్రన్‌ 

విడుదల తేదీ: 05.11..2015 

యూత్‌ మూవీస్‌, యాక్షన్‌ మూవీస్‌, ఫ్యామిలీ మూవీస్‌, హార్రర్‌ విత్‌ కామెడీ మూవీస్‌, సైన్స్‌ ఫిక్షన్‌ మూవీస్‌.. ఇలా రకరకాల జోనర్స్‌లో సినిమాలు వస్తుంటాయి. అయితే ఒక్కో డైరెక్టర్‌ ఒక్కో సెక్టార్‌ ఆడియన్స్‌ని టార్గెట్‌ చేసి సినిమాలు తీస్తారు. కొంతమంది డైరెక్టర్స్‌ మంచి యూత్‌ఫుల్‌ కథతో, డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌తో, హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్‌తో సినిమా కంప్లీట్‌ చేసేసి ప్రేక్షకుల మీదకు వదులుతారు. అవి వుంటే యూత్‌ ఎగబడి చూస్తారన్న భ్రమలో వుండే ఆ డైరెక్టర్స్‌కి యూత్‌ కూడా మంచి సినిమాలు చూస్తారని, ఫీల్‌గుడ్‌ మూవీస్‌ని ఆదరిస్తారన్న విషయం తలకెక్కదు. మరి కొంతమంది డైరెక్టర్స్‌ మంచి లవ్‌స్టోరీ తీద్దామని స్టార్ట్‌ చేసి మధ్యలో డిస్ట్రబ్‌ అయి తమ పైత్యాన్ని, తమ పర్వర్షన్‌ని వెళ్ళగక్కుతారు. అలా డైరెక్టర్‌ ఆదిక్‌ రవిచంద్రన్‌ నుంచి వచ్చిన సినిమాయే త్రిష లేదా నయనతార. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో మ్యూజికల్‌ హిట్స్‌ని అందించిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ జి.వి.ప్రకాష్‌ హీరోగా, ఆనంది, మనీషా యాదవ్‌ హీరోయిన్లుగా త్రిష ఇల్లయనా నయనతార పేరుతో తమిళ్‌లో రూపొందిన చిత్రాన్ని తెలుగులో త్రిష లేదా నయనతార పేరుతో విడుదల చేసింది రుషి మీడియా. డైరెక్టర్‌ రవిచంద్రన్‌ ఏం చెప్పదలుచుకున్నాడు? ఆ చెప్పే ప్రాసెస్‌లో ఎలాంటి పైత్యం, ఎలాంటి పర్వర్షన్‌ బయటికి వచ్చింది అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

చిన్నతనం నుంచి జీవా(జి.వి.ప్రకాష్‌), రమ్య(ఆనంది), అదితి(మనీషా యాదవ్‌) ఒకే కాలనీలో కలిసి పెరుగుతారు. జీవా అంటే రమ్యకి, అదితికి కూడా ఇష్టమే. ముగ్గురూ ఇంటర్మీడియట్‌ చదువుతుంటారు. ఓరోజు అదితి ఊరికి వెళ్తుంది. వారం రోజులపాటు ఆమె రాదని తెలిసిన రమ్య తన ప్రేమను జీవాకి చెప్తుంది. తను చెప్పాలనుకున్నది రమ్య చెప్పేయడంతో చాలా హ్యాపీగా ఫీల్‌ అవుతాడు జీవా. అర్థరాత్రి ఒంటిగంటకి జీవా ఇంటికి వచ్చి అతన్ని బయటికి పిలుస్తుంది. ఇద్దరూ కలిసి ఆడుతూ పాడుతూ ఊరంతా తిరుగుతారు. అసలు మ్యాటర్‌లోకి వెళ్ళకుండా అన్నీ కానిచ్చేస్తాడు జీవా. ఈ విషయం తన స్నేహితుడికి చెప్పి ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకుంటాడు. కానీ, మరుసటి రోజు జీవా, రమ్యల రొమాన్స్‌ కాలేజీ గోడల మీదకు ఎక్కుతుంది. దీంతో హర్ట్‌ అయిన రమ్య జీవాని తిడుతుంది. తన తప్పు ఏమీ లేదని జీవా ఎంత చెప్పినా వినదు. ఆ కోపంలోనే ఫ్యామిలీతో సహా రాజమండ్రికి వెళ్ళిపోతుంది రమ్య. అంత బాధలో వున్న జీవాకి అదితి నుంచి ఫోన్‌ వస్తుంది. ఫోన్‌లో జీవాకి లవ్‌ ప్రపోజ్‌ చేస్తుంది అదితి. లవ్‌లో త్రిష వెళ్ళిపోతేనేం నయనతార వస్తుంది అనుకుంటూ అప్పటి నుంచి అదితి గురించే ఆలోచిస్తుంటాడు. మరి అదితి విషయంలో జీవా కరెక్ట్‌గా బిహేవ్‌ చెయ్యగలిగాడా? రమ్య నిజంగానే జీవాని మర్చిపోయిందా? వీళ్ళిద్దరిలో ఎవరిది నిజమైన ప్రేమ అనేది జీవా తెలుసుకోగలిగాడా? చివరికి జీవా ఎవరికి సొంతమయ్యాడు? అనేది మిగతా కథ. 

మ్యూజిక్‌ డైరెక్టర్‌ జి.వి.ప్రకాష్‌ హీరోగా నటించిన సినిమాల్లో తెలుగులో విడుదలైంది ఈ సినిమానే. ఒక ఆర్టిస్టుగా అతని పెర్‌ఫార్మెన్స్‌ ఎలా వుందనేది పక్కన పెడితే లుక్స్‌ వైజ్‌ అతను తెలుగులో హీరోగా నెగ్గుకొచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పటివరకు తెలుగులో అంత హైట్‌ తక్కువ వున్న హీరోలు లేరనే చెప్పాలి. జీవాగా అతని పెర్‌ఫార్మెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే సినిమాలో విషయం అనేది లేకపోవడంతో పెర్‌ఫార్మ్‌ చెయ్యడానికి ఆర్టిస్టులకు కూడా పెద్దగా స్కోప్‌ కనిపించదు. చాలా సీన్స్‌లో చెప్పిన డైలాగ్సే మళ్ళీ చెప్తున్నట్టు, చూసిన ఎక్స్‌ప్రెషన్‌నే మళ్ళీ మళ్ళీ చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక హీరోయిన్లుగా నటించిన ఆనంది, మనీషా యాదవ్‌లకు వారి వారి క్యారెక్టరైజేషన్స్‌కి అసలు అర్థమే లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్‌ చేసే క్యారెక్టర్లు ఇద్దరికీ ఇచ్చాడు డైరెక్టర్‌. దీంతో ఒకరి తర్వాత ఒకరు స్క్రీన్‌ మీదకు వచ్చి ఆడియన్స్‌తో చెడుగుడు ఆడేసుకున్నారు. సిమ్రాన్‌ చేసిన స్పెషల్‌ క్యారెక్టర్‌ కూడా డైరెక్టర్‌ పర్వర్షన్‌ నుంచి వచ్చిన క్యారెక్టర్‌లాగే వుంటుంది. హీరోకి, హీరోయిన్‌కి హెల్ప్‌ చేసే క్యారెక్టర్‌ అయినా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఆడియన్స్‌ని కలవరపెడుతూ వుంటుంది. జీవాకి బాబాయ్‌గా నటించిన విటివి గణేష్‌ అక్కడక్కడా నవ్విద్దామనుకున్నా ఆడియన్స్‌కి అంత ఓపిక లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. 

ఈ సినిమాకి సంబంధించి చెప్పుకోదగిన టెక్నికల్‌ ఎస్సెట్స్‌ అంటే సినిమాటోగ్రఫీ, ఒకటి రెండు పాటలు. రిచర్డ్‌ ఫోటోగ్రఫీ కథ మూడ్‌కి తగ్గట్టు చాలా నేచురల్‌గా అనిపిస్తుంది. ఎలాంటి హడావిడి లేకుండా నార్మల్‌గా వున్న ఫోటోగ్రఫీ సినిమాకి బాగా ఉపయోగపడింది. జి.వి.ప్రకాష్‌ చేసిన పాటల్లో రెండు పాటలు మాత్రమే బాగున్నాయి. ఇక విజువల్‌గా నైట్‌ ఎఫెక్ట్‌లో ఎగ్జిబిషన్‌లో తీసిన పాట ఒక్కటే బాగుందనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఫర్వాలేదు అనిపించుకున్నాడు జి.వి.ప్రకాష్‌. శశాంక్‌ వెన్నెలకంటి ఇప్పటివరకు రాసిన సినిమాల్లో పరమ నాసిరకంగా డైలాగ్స్‌ వున్న సినిమా ఇదే. సినిమాలోని ఏ ఒక్క డైలాగ్‌ కూడా ఆకట్టుకునేలా, ఆలోచింపజేసేలా వుండదు. డైరెక్టర్‌ ఆదిక్‌ రవిచంద్రన్‌ విషయానికి వస్తే అతను ఈ సినిమా ద్వారా ఆడియన్స్‌కి ఏం చెప్పదలుచుకున్నాడు అనే విషయంలో సరైన క్లారిటీ లేదు. ఒక హీరోయిన్‌ తిరుగుబోతు, మరో హీరోయిన్‌ తాగుబోతు.. ప్రపంచంలో వర్జినిటీ అనేది డైనోసార్స్‌ కాలంలోనే అంతమైందని చెప్పడం, హీరోయిన్‌ తన ఎక్స్‌ బోయ్‌ఫ్రెండ్‌తో ఒక్కసారే చేశానని చాలా సింపుల్‌గా చెప్పడం, ఒక అమ్మాయిని సిన్సియర్‌గా ప్రేమించిన హీరో ప్రేమకి సరైన కంక్లుజన్‌ ఇవ్వకపోవడం వంటి తప్పులు ఈ సినిమాలో చాలా చేశాడు డైరెక్టర్‌. 

మహిళలు ఏ విషయంలోనూ పురుషులకు తక్కువ కాదు.. అనేది ఎప్పటి నుంచో వున్న మాట. అయితే శక్తి యుక్తుల్లో అందరూ సమానమనే ఉద్దేశంతో ఆ మాటను పెద్దలు చెప్పారు. కానీ, ఇప్పుడు పురుషులు చేసే పనులన్నీ మహిళలు చేసేస్తున్నారు అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా చెప్పడం డైరెక్టర్‌ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. రెండున్నర గంటల సినిమాలో రెండు గంటలపాటు ప్రతి సీన్‌లో మందు బాటిల్స్‌ కనిపిస్తాయి. తాగడమే జీవిత ధ్యేయంగా బ్రతికేస్తున్న క్యారెక్టర్స్‌ మనకి ఈ సినిమాలో చాలా దర్శనమిస్తాయి. ప్రధానంగా హీరో చుట్టూనే కథ తిరుగుతూ వుంటుంది. ఇద్దరు అమ్మాయిల వల్ల లైఫ్‌లో అతను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాడనేది చూపించడానికి ట్రై చేశాడు డైరెక్టర్‌. ఇద్దరూ అతన్ని మోసం చేసిన తర్వాత విసిగిపోయి తిరిగి హైదరాబాద్‌ వెళ్తున్న హీరోకి మరో అమ్మాయి తారసపడినట్టు చూపించారే తప్ప అతని ప్రేమకు పాజిటివ్‌ ఎండింగ్‌ ఇవ్వలేకపోయాడు డైరెక్టర్‌. హీరో, హీరోయిన్ల చిన్న తనం నుంచి కథను స్టార్ట్‌ చేసి వారు పెద్దయ్యాక లవ్‌లో పడే వరకు ఫస్ట్‌ హాఫ్‌లో చూపించేసి సెకండాఫ్‌లో ఏం చూపించాలే డైరెక్టర్‌ అర్థం కాలేదు. సెకండాఫ్‌లో ఏం చూస్తున్నామో, ఎందుకు చూస్తున్నామో మనకు అర్థం కాదు. ఫస్ట్‌ హాఫ్‌ కొంతలో కొంత ఫర్వాలేదు అనిపించుకున్నా సెకండాఫ్‌కి కంప్లీట్‌ అయ్యేసరికి ఫర్వాలేదు అనే మాటని కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి కలుగుతుంది. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు తమిళ వాసన ఎక్కడా తగ్గకుండా డైరెక్టర్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. త్రిష, నయనతార అనే ఇద్దరు స్టార్‌ హీరోయిన్ల పేర్లతో పెట్టిన టైటిల్‌ ఆడియన్స్‌లో కొంత ఎక్స్‌పెక్టేషన్స్‌ క్రియేట్‌ చేసింది. కానీ, సినిమా చూసిన తర్వాత ఏం సినిమారా బాబూ అని తలపట్టుకునేలా చేస్తుంది ఈ సినిమా. ఫైనల్‌గా చెప్పాలంటే త్రిష లేదా నయనతార చిత్రంలో క్లాస్‌ లేదా మాస్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకునే అంశాలు 

ఏమాత్రం లేవు. 

ఫినిషింగ్‌ టచ్‌: సారిడాన్‌ లేదా అనాసిన్‌ 

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement