Advertisement

సినీజోష్‌ రివ్యూ: సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌

Fri 03rd Jul 2015 10:31 PM
telugu movie super star kidnap,super star kidnap movie review,cinejosh review,director sushanth reddy,producer chandu  సినీజోష్‌ రివ్యూ: సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌
సినీజోష్‌ రివ్యూ: సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌
Advertisement

లక్కీ క్రియేషన్స్‌

సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌

నటీనటులు: నందు, ఆదర్ష్‌, భూపాల్‌, వెన్నెల కిషోర్‌, 

పూనమ్‌ కౌర్‌, శ్రద్ధాదాస్‌, పోసాని, ఫిష్‌ వెంకట్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ: ఈశ్వర్‌

సంగీతం: సాయి కార్తీక్‌

ఎడిటింగ్‌: బస్వా పైడిరెడ్డి

సమర్పణ: ఎ.సత్తిరెడ్డి

నిర్మాత: చందు పెన్మెత్స

రచన, దర్శకత్వం: ఎ.సుశాంత్‌రెడ్డి

విడుదల తేదీ: 03.07.2015

టాలీవుడ్‌లో రొటీన్‌ సినిమాలే కాకుండా అప్పుడప్పుడు కొత్త తరహా కథలతో, కాన్సెప్ట్‌లతో సినిమాలు చేసి ఆడియన్స్‌ని మెప్పించాలనే ప్రయత్నం కూడా జరుగుతూ వుంటుంది. అలా వచ్చిన వాటిలో కొన్ని సినిమాలను ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేశారు, కొన్నింటిని రిజెక్ట్‌ చేశారు. అలా ఓ పాత కథకి కొత్త ఫ్లేవర్‌ని అద్దుతూ రూపొందించిన సినిమా ‘సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌’. డిఫరెంట్‌ టైటిల్‌తో నందు, ఆదర్ష్‌, భూపాల్‌ వంటి చిన్న హీరోలతో రూపొందిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాత కథని కొత్తగా చెప్పాలని దర్శకుడు సుశాంత్‌రెడ్డి చేసిన ప్రయత్నం ఎంతవరకు సక్సెస్‌ అయింది? సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌ అనే డిఫరెంట్‌ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌కి డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చిందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే.

కథ: ఇది ముగ్గురు హీరోల కథ. మొదటివాడు జై(ఆదర్శ్‌). ఒక పెద్ద ప్రొడ్యూసర్‌ కొడుకు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తల్లి ప్రేమను మిస్‌ అవుతాడు. ఆ బాధని మర్చిపోవడానికి వ్యసనాలకు బానిసవుతాడు. రెండోవాడు నందు(నందు). ప్రియ(పూనమ్‌కౌర్‌) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల బ్రేకప్‌ అయిపోయి జైతో రొమాన్స్‌ చేస్తూ వుంటుంది. ప్రియురాలు దూరమైందన్న బాధతో కుమిలిపోతుంటాడు నందు. మూడోవాడు భూపాల్‌(భూపాల్‌). డైరెక్టర్‌ అవుదామని సిటీకి వస్తాడు. మహేష్‌బాబుకి కథ చెప్తానంటూ జై వెంట పడుతుంటాడు. అతని వీక్‌నెస్‌ని జై క్యాష్‌ చేసుకుంటూ వుంటాడు. ఇలా నడుస్తున్న ఈ ముగ్గురి జీవితంలో కొన్ని అనుకోని సంఘటనల వల్ల ముగ్గురూ రౌడీ అయిన పత్తాల రాజు(ఫిష్‌ వెంకట్‌) దగ్గర బుక్‌ అయిపోతారు. ఈ ముగ్గురి వల్ల తనకు 50 లక్షలు నష్టం వచ్చిందనీ, ఆ డబ్బు తనకు వారం రోజుల్లో ఇవ్వాలని ముగ్గురికీ వార్నింగ్‌ ఇచ్చి పంపిస్తాడు. అంత డబ్బు ఎలా సంపాదించాలా ఆలోచిస్తున్న వారికి సూపర్‌స్టార్‌ మహేష్‌ని కిడ్నాప్‌ చేసి అతని నిర్మాతని కోటి రూపాయలు డిమాండ్‌ చెయ్యాలని ప్లాన్‌ వేస్తారు. తమ ప్లాన్‌ ప్రకారం సూపర్‌స్టార్‌ని కిడ్నాప్‌ చెయ్యగలిగారా? పత్తాల రాజు బాకీ తీర్చారా? భూపాల్‌ డైరెక్టర్‌ అయ్యాడా? వ్యసనాలకు బానిసైన జైలో మార్పు వచ్చిందా? ప్రియ మళ్ళీ నందు దగ్గరికి వచ్చిందా? అనేది మిగతా కథ. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: ఆదర్శ్‌, నందు, భూపాల్‌ ముగ్గురూ తమ తమ క్యారెక్టర్స్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేశారు. డ్రగ్‌ ఎడిక్ట్‌గా ఆదర్శ్‌, భగ్న ప్రేమికుడిగా నందు, డైరెక్టర్‌ అవ్వాలనుకునే క్యారెక్టర్‌లో భూపాల్‌ అందర్నీ ఆకట్టుకున్నారు. నందుని చీట్‌ చేసే లవర్‌గా పూనమ్‌ కౌర్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఫర్వాలేదు అనిపిస్తుంది. ఒరిజినల్‌గా వెన్నెల కిషోర్‌ క్యారెక్టర్‌నే చేసిన వెన్నెల కిషోర్‌ సెకండాఫ్‌లో కనిపించినప్పటికీ ఆడియన్స్‌ని బాగా ఎంటర్‌టైన్‌ చేశాడు. ఓల్డ్‌ సిటీ డాన్‌ ఫరాఖాన్‌గా శ్రద్ధా దాస్‌ చాలా సెటిల్డ్‌గా పెర్‌ఫార్మ్‌ చేసింది. ఫిష్‌ వెంకట్‌, పోసాని కృష్ణమురళి తమ తమ క్యారెక్టర్స్‌ ద్వారా ఆడియన్స్‌ని బాగానే నవ్వించారు. 

టెక్నీషియన్స్‌: సాంకేతిక పరంగా ఈ సినిమాలో చెప్పుకోదగిన ఎస్సెట్స్‌ ఏమీ లేనప్పటికీ వున్నంతలో ఈశ్వర్‌ ఫోటోగ్రఫీ అందర్నీ ఆకట్టుకుంటుంది. సాయికార్తీక్‌ తన పాటలతో అలరించలేకపోయినా మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో మెప్పించగలిగాడు. బస్వా పైడిరెడ్డి ఎడిటింగ్‌ స్పీడ్‌గానే వున్నప్పటికీ అందులో తన ప్రత్యేకత చూపించడానికి అవకాశం లేకుండా పోయింది. డైరెక్టర్‌ సుశాంత్‌రెడ్డి గురించి చెప్పాలంటే ఇది తన తొలి సినిమాయే అయినప్పటికీ కిడ్నాప్‌ అనే పాత పాయింట్‌కి మహేష్‌బాబు అనే కొత్త ఫ్లేవర్‌ని అద్ది మార్కులు కొట్టెయ్యాలని ట్రై చేశాడు. అయితే తన ప్రయత్నంలో కొంతవరకు మాత్రమే సక్సెస్‌ అవ్వగలిగాడు. సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌ అంటూ టైటిల్‌తోనే కొంతవరకు సక్సెస్‌ అయిన సుశాంత్‌రెడ్డి దానికి మహేష్‌బాబు పేరుని కూడా యాడ్‌ చెయ్యడం వల్ల కొంత క్యూరియాసిటీ ఏర్పడిరది. ఫ్రెండ్స్‌ ముగ్గురూ కిడ్నాప్‌ చేసింది మహేష్‌బాబుని కాదని, కమెడియన్‌ వెన్నెల కిషోర్‌ని అని తెలిసిన తర్వాత కథలో అనేక మలుపులు తీసుకున్నాడు డైరెక్టర్‌. అది సెకండాఫ్‌ లెంగ్త్‌ని పెంచడానికి చేసిన ప్రయత్నంలాగే అనిపిస్తుంది తప్ప అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్‌, నాని, మంచు మనోజ్‌, తనీష్‌లకు గెస్ట్‌ రోల్స్‌ ఇవ్వడం సినిమాకి మంచి ప్లస్‌ అయింది. నిర్మాణ విలువల గురించి చెప్పాలంటే సినిమా కథకి తగ్గ రేంజ్‌లోనే సినిమాని నిర్మించారు నిర్మాత చందు.

ప్లస్‌ పాయింట్స్‌:

టైటిల్‌

కామెడీ

హీరోల గెస్ట్‌ రోల్స్‌

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌

మైనస్‌ పాయింట్స్‌:

మ్యూజిక్‌

సెకండాఫ్‌

లెంగ్త్‌ కోసం సాగదీసిన సీన్స్‌

విశ్లేషణ: సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌ అనే డిఫరెంట్‌ టైటిల్‌తో వచ్చిన ఈ క్రైమ్‌ కామెడీ అందర్నీ నవ్వించింది. కిడ్నాప్‌ అనే పాత కథలో మహేష్‌బాబు పేరుని ఉపయోగించడం వల్ల అది సినిమాకి బాగా ప్లస్‌ అయింది. మహేష్‌ ఫ్యాన్స్‌కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఫస్ట్‌ హాఫ్‌ స్పీడ్‌గా రన్‌ అయి, సెకండాఫ్‌ స్లో అయినా మధ్య మధ్య వచ్చే కామెడీ సీన్స్‌ ఆడియన్స్‌కి రిలీఫ్‌ని ఇస్తాయి. పేరుకి క్రైమ్‌ కామెడీ అయినప్పటికీ సినిమాలో అనుకున్నంత కామెడీ లేదనేది సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ‘సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌’ కామెడీ పరంగా ఫర్వాలేదనిపిస్తుంది.

ఫినిషింగ్‌ టచ్‌: ఇది ఫన్నీ కిడ్నాప్‌ 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement