Advertisement

సినీజోష్‌ రివ్యూ: రేయ్‌

Fri 27th Mar 2015 11:15 PM
rey movie,rey movie review,sai dharam tej rey review,ysv chowdary rey review,cinejosh review reyబాప్ రేయ్  సినీజోష్‌ రివ్యూ: రేయ్‌
సినీజోష్‌ రివ్యూ: రేయ్‌
Advertisement

మూవీ రివ్యూ: రేయ్‌

బ్యానర్ : బొమ్మరిల్లు వారి

నటీనటులు: సాయిధరమ్‌తేజ్‌, సయామీ ఖేర్‌, శ్రద్ధాదాస్‌, 

ఫర్హాద్‌ షానవాజ్‌, అర్పిత్‌ రాంకా, నరేష్‌, తనికెళ్ళ భరణి, ఆలీ, 

వేణుమాధవ్‌ తదితరులు

మాటలు: శ్రీధర్‌ సీపాన

సినిమాటోగ్రఫీ: గుణశేఖరన్‌

సంగీతం: చక్రి

ఎడిటింగ్‌: గౌతంరాజు

సమర్పణ: యలమంచిలి గీత

కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: వై.వి.యస్‌.చౌదరి

విడుదల తేదీ: 27.03.2015

లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించిన వై.వి.యస్‌.చౌదరి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయిధరమ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఒక కొత్త కథ, కొత్త బ్యాక్‌బ్రాప్‌తో, భారీ బడ్జెట్‌తో ‘రేయ్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. అనేక కారణాల వల్ల విడుదలకు నోచుకోని ఈ చిత్రం ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ డ్రామా, హ్యూమన్‌ ఎమోషన్స్‌ని తెరకెక్కించడంలో తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగిన వై.వి.యస్‌.చౌదరి ఈసారి పాప్‌ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకొని అమెరికా, వెస్ట్‌ ఇండీస్‌ వంటి దేశాల్లో భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని ఈ కొత్త బ్యాక్‌డ్రాప్‌ ఎంతవరకు ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయింది? సాయిధరమ్‌తేజ్‌ తొలి సినిమాగా ప్రారంభమైన ఈ చిత్రం మెగా అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంది? ఈమధ్యకాలంలో హిట్‌ అనేది లేని వై.వి.యస్‌.చౌదరికి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిచ్చిందీ తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం. 

కథ: పాప్‌ స్టార్స్‌కి అమెరికాలోని స్టేపుల్‌ సెంటర్‌లో జరిగే బెస్ట్‌ ఆఫ్‌ ది వరల్ట్‌ టైటిల్‌ గెలుచుకోవడం అన్నది ఓ డ్రీమ్‌. వారి డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్‌ చేసుకోవడానికి ఎంతో మంది పోటీ పడుతుంటారు. మెక్సికన్‌ గర్ల్‌ జెన్నా(శ్రద్ధాదాస్‌) ఆ టైటిల్‌ని వరసగా రెండోసారి గెలుచుకొని హ్యాట్రిక్‌ కోసం ఎదురుచూస్తుంటుంది. తనకి పెద్ద ఫ్యాన్‌ అయిన సందీప్‌(ఫర్హాద్‌ షానవాజ్‌) ఆమెకు పోటీకి వస్తున్నాడని జెన్నాకి తెలుస్తుంది. అతన్ని హతమార్చి దాన్ని యాక్సిడెంట్‌గా క్రియేట్‌ చేస్తుంది జెన్నా. కట్‌ చేస్తే ఇండియాలో వున్న అమృత(సయామీ ఖేర్‌) సందీప్‌ చెల్లెలికి సందీప్‌ చనిపోయాడన్న వార్త తెలుసుకొని అమెరికా బయలుదేరుతుంది. అన్నయ్య కలను తను నిజం చేసి టైటిల్‌ని గెలుచుకోవడానికి రెడీ అవుతుంది అమృత. ఇదిలా వుంటే పనీ పాటా లేకుండా ఫ్రెండ్స్‌తో అమ్మాయిలు ఎక్కడ కనపడితే అక్కడ వాలిపోయే క్యారెక్టర్‌ రాక్‌(సాయిధరమ్‌తేజ్‌)ది. అనుకోకుండా వీరిద్దరికీ పరిచయం అవుతుంది. కొన్ని మిస్‌ అండర్‌స్టాండిరగ్స్‌ తర్వాత అమృత, రాక్‌, అతని ఫ్రెండ్స్‌ కలిసి ‘రేయ్‌’ గ్రూప్‌తో స్టేపుల్‌ సెంటర్‌లో కాంపిటీషన్‌కి వెళ్తారు. ఈ గ్రూప్‌ కాంపిటీషన్‌కి వెళ్ళే క్రమంలో వారికి ఎలాంటి ప్రాబ్లమ్స్‌ ఎదురయ్యాయి? వాటిని అధిగమించి ఎలా టైటిల్‌ని గెలుచుకున్నారన్నది మిగతా కథ.

ప్లస్‌ పాయింట్స్‌: ఈ చిత్రానికి సంబంధించి మెయిన్‌గా చెప్పుకోవాల్సింది వై.వి.యస్‌.చౌదరి అన్‌కాంప్రమైజ్డ్‌ మేకింగ్‌ గురించి. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండిరగ్‌ వరకు సినిమా చాలా గ్రాండియర్‌గా వుంటుంది. ఏ సీన్‌లోనూ, ఏ ఫైట్‌లోనూ ఖర్చుకు వెనకాడకుండా సినిమా తీసినట్టు తెలుస్తుంది. సాయిధరమ్‌తేజ్‌ ఫస్ట్‌ మూవీ ‘రేయ్‌’ అనే సంగతి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఓకే అనిపించాడు తేజు. యాక్టింగ్‌లోగానీ, డాన్స్‌లోగానీ, ఫైట్స్‌లోగానీ కొత్త అనేది కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. తేజు తర్వాత ఈ సినిమాలో పెర్‌ఫార్మెన్స్‌ పరంగా చెప్పుకోవాల్సింది విలన్‌గా నటించిన శ్రద్ధా దాస్‌ గురించి. తన క్యారెక్టర్‌లోని నెగెటివ్‌ షేడ్స్‌ని అద్భుతంగా ప్రజెంట్‌ చేసింది. గుణశేఖరన్‌ ఫోటోగ్రఫీ కూడా సినిమాకి బాగా ప్లస్‌ అయింది. అందమైన ఫారిన్‌ లొకేషన్స్‌ని మరింత అందంగా చూపించే ప్రయత్నం చేశాడు.

మైనస్‌ పాయింట్స్‌: ఈ సినిమాలో చెప్పుకోదగినన్ని మైనస్‌ పాయింట్స్‌ వున్నాయి. మొదట చెప్పుకోవాల్సింది కాన్సెప్ట్‌ గురించి. అర్థం పర్థంలేని కామన్‌ ఆడియన్‌కి అర్థం కానీ ఒక కాన్సెప్ట్‌ని తీసుకొని దాన్ని ప్రేక్షకులపై రుద్దాలని చూడడం కరెక్ట్‌ కాదు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే మనది కానీ, మనకి సంబంధంలేని ఒక కథాంశంతో చేసిన సినిమాని ఎంతవరకు ఆదరిస్తారనేది కూడా ఆలోచించాలి. స్టేపుల్‌ సెంటర్‌లో జరిగే వరల్డ్‌ కాంపిటీషన్‌లో టైటిల్‌ గెలుచుకోవడమే లక్ష్యంగా హీరోయిన్‌ అమెరికా వెళ్తుంది. అంతవరకు ఓకే. కానీ, అది మ్యూజిక్‌ కాంపిటీషనా లేక డాన్స్‌ కాంపిటీషనా అనేది క్లారిటీ లేదు. ఓ సందర్భంలో హీరోయిన్‌ అన్నయ్య కంపోజ్‌ చేసిన మ్యూజిక్‌ వినిపిస్తారు. తీరా క్లైమాక్స్‌కి వచ్చేసరికి హీరో గ్రూప్‌ డాన్స్‌ చేసి టైటిల్‌ను గెలుచుకుంటుంది. ఇదిలా వుంటే ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన సయామీ ఖేర్‌ గురించి ఎంతో ఎక్స్‌పెక్ట్‌ చేసిన ఆడియన్స్‌ ఖచ్చితంగా నిరాశపడతారు. ఈ సినిమాకి హీరోయిన్‌ పెద్ద మైనస్‌ అని చెప్పాలి. ఒక మ్యూజికల్‌ సినిమాకి పాటలు ఎంత ముఖ్యమో తెలిసిందే. కానీ, ఈ సినిమాలోని ఏ ఒక్క పాటా వినసొంపుగా లేదు. దానికి తగ్గట్టుగానే పిక్చరైజేషన్‌ కూడా వుంది. అన్నింటినీ మించి ఈ సినిమా అంతా సౌండ్‌ పొల్యూషన్‌తో నిండిపోయి వుంటుంది. సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌ గట్టిగట్టిగా అరుస్తూ వుంటుంది. సినిమాలో కామెడీ లేకపోవడం కూడా మైనస్సే అయింది. నరేష్‌, హేమ, వేణుమాధవ్‌, ఆలీలతో కామెడీ చేయించే ప్రయత్నం చేశారు. కానీ, సక్సెస్‌ అవ్వలేకపోయారు. 

విశ్లేషణ: ‘రేయ్‌’ అనేది దర్శకనిర్మాత వై.వి.యస్‌.చౌదరి కష్టం. అది సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. విదేశాలలోని రేర్‌ లొకేషన్స్‌లో ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్టింగ్‌ టు ఎండిరగ్‌ పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్‌ అవ్వని కాన్సెప్ట్‌తో చేసిన ఈ సినిమా స్టార్టింగ్‌ నుంచి మనకి ఏ సీన్‌ కూడా ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చెయ్యదు. కొన్ని సీన్స్‌ ఒకదానికి ఒకటి సంబంధం లేనట్టుగా సడన్‌గా స్టార్ట్‌ అయి, సడన్‌గా ఎండ్‌ అయిపోతాయి. మనకి కనెక్ట్‌ అవ్వని సబ్జెక్ట్‌తో అద్భుతాలు సృష్టించాలని చూసిన వై.వి.యస్‌. ఫైనల్‌గా సక్సెస్‌ అవ్వలేకపోయాడని చెప్పాలి. యూత్‌కి అయినా ఈ కాన్సెప్ట్‌ నచ్చుతుందా అంటే అదీ కష్టమనే చెప్పాలి. సినిమా మొత్తంలో సాయిధరమ్‌తేజ్‌, శ్రద్దాదాస్‌ల పెర్‌ఫార్మెన్స్‌ గురించి తప్ప పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. తేజు, శ్రద్దాదాస్‌ తమ క్యారెక్టర్స్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేశారు. సినిమాకి మెయిన్‌ మైనస్‌గా చెప్పాల్సొస్తే సౌండ్‌ పొల్యూషన్‌ మోతాదుకి మించి వుందని చెప్పాలి. ఫైనల్‌గా చెప్పాలంటే ‘రేయ్‌’ ఆడియన్స్‌, మెగా అభిమానులు ఎక్స్‌పెక్ట్‌ చేసినంత ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. 

ఫినిషింట్‌ టచ్‌: బాప్ రేయ్ 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement