Advertisementt

టీఆర్‌ఎస్‌లోకి మరో ప్రధాన నాయకుడు..!!

Tue 30th Jun 2015 05:19 AM
d srinivas,pcc president,trs,mlc  టీఆర్‌ఎస్‌లోకి మరో ప్రధాన నాయకుడు..!!
టీఆర్‌ఎస్‌లోకి మరో ప్రధాన నాయకుడు..!!
Advertisement
Ads by CJ
పీీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ అధిష్టానంపై పూర్తి అసంతృప్తిలో ఉన్న 'కారు' ఎక్కే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. అయితే టీఆర్‌ఎస్‌లోకి డి.శ్రీనివాస్‌ రాకను స్థానిక నాయకులు వ్యతిరేకిస్తుండటం ఆయనకిప్పుడు మింగుడుపడని విషయం. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటు కోసం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ టికెట్‌ కోసం డి.శ్రీనివాస్‌ కూడా బాగానే పోరాడినా ఫలితం మాత్రం దక్కలేదు. అయితే దిగ్విజయ్‌సింగే తనకు సీటు రాకుండా అడ్డుకున్నారని డి.శ్రీనివాస్‌ భావిస్తున్నట్లు సమాచారం.ఈమేరకు టీఆర్‌ఎస్‌లో చేరడానికి ఆయన మంతనాలు సాగిస్తున్నట్లు వార్త కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు డి.శ్రీనివాస్‌ రాకను నిజమాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు ప్రధాన నాయకుడిగా ఉన్న బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఈ సమయంలో టీఆర్‌ఎస్‌ బెర్త్‌ ఖాయం చేసుకోవాలంటే ఇక కేసీఆర్‌తోనే డైరెక్ట్‌గా శ్రీనివాస్‌ మంతనాలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ