Advertisementt

'క్రియేటివ్ మెన్టోర్స్' యానిమేషన్ స్టూడియో ప్రారంభం..!

Thu 11th Jun 2015 11:54 AM
creative mentors animation studio,k.viswanath,suresh,prabhakar  'క్రియేటివ్ మెన్టోర్స్' యానిమేషన్ స్టూడియో ప్రారంభం..!
'క్రియేటివ్ మెన్టోర్స్' యానిమేషన్ స్టూడియో ప్రారంభం..!
Advertisement
Ads by CJ

రోజురోజుకి యానిమేషన్ రంగం పట్ల యూత్ లో క్రేజ్ పెరుగుతోంది. అదే కారణంతో హైదరాబాద్ నగరంలో ఎన్నో యానిమేషన్ సంస్థలు నెలకొల్పబడ్డాయి. అదే క్రమంలో 'క్రియేటివ్ మెన్టోర్స్' అనే యానిమేషన్ స్టూడియో హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు. ఈ యానిమేషన్ స్టూడియోను గురువారం హైదరాబాద్ లో కె.విశ్వనాథ్ లాంచనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ "నా జీవితంలో మొదటిసారిగా ఇలాంటి ఓ క్రియేటివ్ యానిమేషన్ స్టూడియోను చూసాను. నేను చేసిన సినిమాలలో గ్రాఫిక్స్ కు చోటు లేదు. అందుకే నాకు టెక్నాలజీ పట్ల అంత అవగాహన లేదు. ఈ స్టూడియోను చూశాక టెక్నాలజీలలో ఇంత మార్పు వచ్చిందా అనిపిస్తుంది. ఈ టెక్నాలజీ అధ్బుతంగా ఉంది. అపరబ్రహ్మ విశ్వ మిత్ర సృష్టిలా ఉంది. ఈ సంస్థ వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. నిర్మాతలు, దర్శకులు ఈ స్టూడియోను వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను. ఈ స్టూడియో హాలీవుడ్ స్టూడియోలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని భావిస్తున్నాను" అని చెప్పారు.

ప్రభాకర్ మాట్లాడుతూ "లేటెస్ట్ టెక్నాలజీను ఇండియాకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ యానిమేషన్ స్టూడియో ప్రారంభించాం. ఈ టెక్నాలజీను ఫారెన్ లో చూసాం. అక్కడ మోషన్ కాప్చర్ చాలా పాపులర్. అదే టెక్నాలజీను మేము మార్కర్స్ లేకుండా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. గేమింగ్ లో, యానిమేషన్ లో ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది" అని చెప్పారు.

క్రియేటివ్ మెన్టోర్స్ డైరెక్టర్ సురేష్ మాట్లాడుతూ "ఈ టెక్నాలజీ ద్వారా తక్కువ సమయంలో 'లో' బడ్జెట్ సినిమాలను నిర్మించవచ్చు" అని చెప్పారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ