Advertisementt

ఏపీ రాజధాని కమిటీ చైర్మన్‌ మృతి..!!

Thu 28th May 2015 06:47 AM
shiva ramakrishnan,ias,dead,ap capital committee  ఏపీ రాజధాని కమిటీ చైర్మన్‌ మృతి..!!
ఏపీ రాజధాని కమిటీ చైర్మన్‌ మృతి..!!
Advertisement
Ads by CJ

ఏపీ రాజధాని కమిటీ చైర్మన్‌ శివరామకృష్ణన్‌ కన్నుమూశారు. మాజీ ఐఏఎస్‌ అధికారి అయిన శివరామకృష్ణన్‌ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఏపీ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధానిని ఎంపిక చేయడానికి శివరామకృష్ణన్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఇక రాజధాని ఎంపిక కోసం శివరామకృష్ణన్‌ ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలతోపాటు ప్రముఖ పట్టణాలను కూడా సందర్శించారు. దీంతో ఆయనకు ఏపీతో అవినాభావ సంబంధం ఏర్పడింది. తాను సమర్పించిన నివేదికలో కూడా ప్రతి జిల్లాలో ఉన్న వనరుల గురించి, ఆయా జిల్లాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి శివరామకృష్ణన్‌ వివరించారు.

శివరామకృష్ణన్‌ మృతిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సమర్పించిన నివేదిక ప్రకారం రాజధానిని అభివృద్ధి చేస్తేనే శివరామకృష్ణన్‌కు నిజమైన నివాళి ఇచ్చినట్లు అని జగన్‌ పేర్కొన్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ