Advertisementt

తమ్మారెడ్డి భరద్వాజ ఫైర్..!

Mon 18th May 2015 11:34 AM
thammareddy bharadhwaj,producers council,secretary  తమ్మారెడ్డి భరద్వాజ ఫైర్..!
తమ్మారెడ్డి భరద్వాజ ఫైర్..!
Advertisement
Ads by CJ

నిర్మాతల మండలిని, చిన్న సినిమాలను కొందరు నాశనం చేస్తున్నారని గత కొన్నిరోజులుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై అగ్ర నిర్మాతలు, నటులు విలేకర్ల సమావేశాలలో స్పందిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా సోమవారం హైదరాబాద్ లో తమ్మారెడ్డి భరద్వాజ్ ప్రెస్ మీట్ నిర్వహించి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి సెపరేట్ అయిన వారు నిర్మాతల మండలి పేరును ఉపయోగించుకొని కొన్ని చేయకూడని పనులు చేస్తున్నారని తన ఆవేదనను వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుండి ఎనిమిది మంది విడిపోయి ఓ కంపనీను మొదలు పెట్టారు. ఆ సంస్థను వారు నిర్మాతల మండలి పేరు వినియోగించుకొని యాడ్స్ తమకు అగ్రిమెంట్ చేసిన వారికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలా బ్లాక్ మెయిల్ చేయడం ఎంత వరకు న్యాయం. కంపెనీను మొదలు పెట్టుకోవడం దానిని నడుపుకోవడం వారి హక్కే. కాని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉన్న వారే అందులో మెంబర్స్ గా ఉండి వారికి నచ్చినట్లుగా కౌన్సిల్ పేరును వాడుకోవడం వలన మా వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోంది. నిర్మాత మండలి కార్య దర్శి అయిన వ్యక్తే దానిని నడపడం బాధాకరం. సినీ పరిశ్రమ మంచి కోసం ఏ నిర్ణయమైన జరగాలి. అందరిని కలుపుకొని పోవాలి. అన్ని చానెల్స్ ను సమానంగా చూడాలి" అని తెలిపారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ