Advertisementt

జైలులోనూ తప్పు చేసిన రామలింగరాజు..!!

Thu 07th May 2015 11:21 AM
ramalinga raju,cellphone,jail  జైలులోనూ తప్పు చేసిన రామలింగరాజు..!!
జైలులోనూ తప్పు చేసిన రామలింగరాజు..!!
Advertisement
Ads by CJ

సత్యం కుంభకోణంలో శిక్షను అనుభవిస్తున్న రామలింగరాజు జైలులోనూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా ఆయనతోపాటు సత్యం కుంభకోణంలోని మిగిలిన నిందితులు కూడా జైలునుంచి అక్రమంగా సెల్‌ఫోన్‌ను వినియోగిస్తున్నట్లు సమాచారం.

సాధారణంగా జైలులో ఖైదీలు సెల్‌ఫోన్‌లు వాడటం, తనిఖీలు చేసి పోలీసులు వాటిని స్వాధీనం చేసుకోవడం తరచూ జరుగుతూనే ఉంటాయి. అయితే రామలింగరాజు స్థాయి వ్యక్తి అక్రమంగా సెల్‌ఫోన్‌ వాడుతూ పోలీసులకు చిక్కడం సంచలనంగా మారింది. రామలింగరాజు వద్ద ఓ సెల్‌ఫోన్‌ను, రెండు సిమ్‌లను కూడా జైలు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వార్త కథనాలు వెలువడుతున్నాయి. అయితే వీటిపై స్పందించడానికి జైలు అధికారులు ఇష్టపడటం లేదు. కాని బెయిల్‌ పొందడానికి తీవ్రంగా శ్రమిస్తున్న రామలింగరాజు ఇలా సెల్‌ఫోన్లు వాడుతూ అధికారులకు దొరికిపోవడం అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది...!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ