Advertisementt

‘మా’ అధ్యక్షుడు నేపాల్‌ని ఆదుకోవాలి!

Mon 27th Apr 2015 02:20 AM
maa president,rajendra prasad,nepal,earthquake,help  ‘మా’ అధ్యక్షుడు నేపాల్‌ని ఆదుకోవాలి!
‘మా’ అధ్యక్షుడు నేపాల్‌ని ఆదుకోవాలి!
Advertisement
Ads by CJ

వెయ్యి అణుబాంబులు ఒక్కసారిగా ప్రయోగించినట్లు భూకంపం నేపాల్‌ని నేలమట్టం చేసింది. టూరిజంమీద మనుగడ సాగిస్తున్న ఈ సుందర ప్రదేశం చిన్నాభిన్నమైంది. మృతులు, క్షతగాత్రులతో కఠ్మాండు రోదిస్తోంది. ఈ భూకంపం భారత్‌, చైనా, భూటాన్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లనూ వణికించింది. భారత్‌లో మృతులసంఖ్య 50కి పైబడినా నేపాల్‌ని ఆదుకోవడానికి భారతప్రధాని స్పందించిన తీరు మనకు ఆదర్శం. మనమధ్యే బతుకుతున్న మనలో ఒకరిగా కలిసిపోయిన నేపాలీల కుటుంబాలెన్నో నేపాల్‌లో వున్నాయి, భూకంపానికి బలయిపోయాయి. ఉసూరుమంటున్న ఈ నేపాలీలను ఆదుకోవడం ‘మా’ అధ్యక్షుడుగా ఎన్నికయిన రాజేంద్రప్రసాద్‌ తక్షణ కర్తవ్యం. ఫిలిమ్‌ ఛాంబర్‌ కార్యవర్గంతో చర్చించి మందులు, ఆహారం, వస్త్రాలు వంటి అత్యవసర వస్తువులను అందించాలి. నిధి సేకరణకు నడుం కట్టాలి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ