Advertisementt

ఇంద్రనూయిని బాబు భలే ఆకట్టుకున్నాడు..!!

Fri 03rd Apr 2015 08:42 AM
indira nooyi,chandrababu naidu,tirupathi,tirumala  ఇంద్రనూయిని బాబు భలే ఆకట్టుకున్నాడు..!!
ఇంద్రనూయిని బాబు భలే ఆకట్టుకున్నాడు..!!
Advertisement
Ads by CJ

దేశం నుంచే కాకుండా విదేశాల్లోని ప్రముఖులు కూడా తిరుమల తిరుపతి వేంకటేశ్వరుణ్ని తప్పక దర్శించుకుంటారు. భారత్‌లో నం.1 కుబేరుడు ముఖేష్‌ అంబానీ తదితరులు కూడా తిరుమలేషుడికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తారు. ఇక పెప్సికో సీఈఓ ఇంద్రానూయిని ఆకట్టుకోవడానికి బాబు తిరుమలేషుడి దర్శనానికి తీసుకెళ్లారు. ఇంద్రనూయి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు వద్ద పెప్సికో యూనిట్‌ను ప్రారంభించడానికి వచ్చారు. అయితే ప్రత్యేకంగా ఇంద్రనూయిని చంద్రబాబు తిరుమలేషుడి వద్దకు తీసుకెళ్లి దర్శనం చేయించారు. ముందుగా ఆమె పర్యటనలో తిరుమలకు వెళ్లాలన్న ఆలోచన లేదు. ఇక శ్రీవేంకటేశ్వరుడి దర్శనం అనంతరం బాబుతో కలిసి ఆమె సత్యవేడులో పెప్సికో యూనిట్‌ను ప్రారంభించారు. వండర్‌ఫుల్‌ తిరుమల, వండర్‌ఫుల్‌ సీఎం అంటూ చంద్రబాబును ప్రశంసించారు. ఇదివరకే ఇంద్రనూయి ఏపీ అభివృద్ధికి అన్ని రకాలుగా సాయం అందిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ