Advertisementt

పెద్ద నాన్న సీఎం అయినా అంతేనా?

Thu 26th Mar 2015 01:24 PM
nara rohith,rowdy fellow,sankara,pandagala vachadu,asura,madarasi,chandrababu naidu  పెద్ద నాన్న సీఎం అయినా అంతేనా?
పెద్ద నాన్న సీఎం అయినా అంతేనా?
Advertisement
Ads by CJ

వైవిధ్యమైన చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నారా రోహిత్ సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల ‘రౌడీఫెలో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రోహిత్‌కు ఆ చిత్రం పేరు తెచ్చిపెట్టినా.. కమర్షియల్‌గా నిరాశనే మిగిల్చింది. కాగా నారా రోహిత్ నటించిన నాలుగు సినిమాలు షూటింగ్‌ను పూర్తిచేసుకున్న విడుదలకు నోచుకోవడం లేదు. ఆయన నటించిన శంకర, పండగలా వచ్చాడు, అసుర, మదరాసి చిత్రాలు చిత్రీకరణ పూర్తిచేసుకున్నాయి. అయితే వీటి విడుదల విషయంలో రోహిత్ జోక్యం చేసుకుంటే తప్ప విడుదలయ్యే అవకాశం లేదని ఫిల్మ్‌నగర్ టాక్. ‘రౌడీఫెలో’ చిత్రంలో రోహిత్ ‘మా పెద్దనాన్న సీఎం..! అయితే  ఏంటీ అనే ఓ డైలాగ్ వుంటుంది. ఇప్పుడు ఆ డైలాగ్‌కు కౌంటర్‌గా  మీ పెద్దనాన్న సీఎం అయినా అంతేనా..? అంటున్నారు సినీ జనాలు. అయితే ఈ సినిమాలతో రోహిత్ కమర్షియల్ హీరోగా ఎదుగుతాడని అంటున్నారు అతని సన్నిహితులు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ