Advertisementt

ధోని ‘దండ’ యాత్ర ఆస్ట్రేలియాలో- ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ బాక్సాఫీసు దగ్గర

Wed 18th Feb 2015 03:49 AM
dhoni,australia cricket match,junior ntr,temper  ధోని ‘దండ’ యాత్ర ఆస్ట్రేలియాలో- ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ బాక్సాఫీసు దగ్గర
ధోని ‘దండ’ యాత్ర ఆస్ట్రేలియాలో- ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ బాక్సాఫీసు దగ్గర
Advertisement
Ads by CJ

సచిన్‌ లేని భారత క్రికెట్‌ జట్టు
క్రికెట్‌ కామెంటేటర్‌గా కొత్త పాత్రలో అమితాబ్‌
టెన్నిస్‌ దిగ్గజం ఫెడరర్‌, పాక్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ అభిమాన జట్టుగా పాక్‌తో పోటీకి దిగిన ధోని సేన.
ఆస్ట్రేలియా, అడిలైడ్‌, భారతీయులతో కిటకిటలాడిన వీధులు
‘స్వాగతం’ హిందీ లిపిలో స్వాగతించిన ఆస్ట్రేలియా పత్రికా రంగం.
భారత్‌ 300 పరుగులు చేస్తుందని జోస్యం చెప్పిన ‘బిగ్‌ బి’.
నిర్మానుష్యంగా మారిన భారతీయ రహదారులు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్ల మధ్య జరిగే ‘యాషెస్‌ సిరీస్‌’ని మించిన ఉత్కంఠ, ఇరుదేశాల క్రికెట్‌ అభిమానుల భావోద్వేగాలు ‘భారత్‌, పాక్‌’ క్రికెట్‌ పోటీలో కనిపిస్తోంది. ప్రపంచకప్‌ గెలవడం వీరికి ‘ప్రతిష్ట’కి సంబంధించిన అంశం. ‘ఇండో, పాక్‌’ క్రికెట్‌ మ్యాచ్‌ గెలవడం వీరి ఆత్మాభిమానానికి సంబంధించిన అంశంగా అవతరించినింది. పసలేని బౌలింగ్‌ లైనప్‌ ఫామ్‌లో లేని టాప్‌ ఆర్డర్‌ భారత క్రికెట్‌ అభిమానులను కలవరపెడుతున్న నేపధ్యంలో ప్రపంచకప్‌ పోటీలు ఆరంభమయ్యాయి. అందునా తొలి మ్యాచ్‌ పాక్‌తో!
ధోని గెలిచాడు, టాస్‌ గెలిచి- రహనె కన్నా ముందుగా రైనాని దించి- రెండు కొత్త బంతులు, రెండు కొత్త నిబంధనలు వచ్చిన నేపధ్యంలో ఉమేశ్‌, షమీలకు కొత్త బంతులిచ్చి మ్యాచ్‌ గెలిచాడు- భారతీయుల హృదయాలను గెలిచాడు- ‘ప్రపంచకప్‌’ నిలబెట్టుకునే దిశగా కాన్ఫిడెన్సు లెవల్స్‌ పెంచాడు!!
ఆస్ట్రేలియాలో, ప్రపంచ క్రికెట్‌ నేపధ్యంగా పాక్‌పై ధోని సాధించిన విజయాన్ని, ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ బాక్సాఫీసు విజయంతో పోల్చి సంబరాలు జరుపుకుంటున్నారు ఎన్టీఆర్‌ అభిమానులు. పాక్‌పై భారత్‌ విజయాన్ని ప్రతి భారతీయుడూ ఆస్వాధించినట్టుగా, సొంతం జేసుకున్నట్టుగా ‘టెంపర్‌’ విజయాన్ని తెలుగు సినీ అభిమానులందరూ సొంతం చేసుకుంటున్నారు. ‘టెంపర్‌’ వంటి పెద్ద సినిమా హిట్‌తో తెలుగు సినిమా పరిశ్రమ జవసత్వాలు పుంజుకుంటోంది, ఎన్నో థియేటర్లకి ఫీడింగ్ ఇస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమలో కాసుల గళగళలు!! ఈ ఆనందాన్ని ఆస్వాదిద్దాం, మరింత గొప్ప విజయాన్ని సొంతం చేసుకుందాం. -తోటకూర రఘు

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ