Advertisementt

టాక్సిక్ పోస్ట్ పోన్ కి కారణమదే

Wed 29th Apr 2026 03:52 PM
yash  టాక్సిక్ పోస్ట్ పోన్ కి కారణమదే
Yash Toxic postponed టాక్సిక్ పోస్ట్ పోన్ కి కారణమదే
Advertisement
Ads by CJ

కన్నడ హీరో యశ్ టాక్సిక్ వాయిదా వార్తలను నిజం చేస్తూ జూన్ 4 నుంచి టాక్సిక్ ని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. హీరో యశ్ స్వయంగా టాక్సిక్ పోస్ట్ పోన్ విషయాన్నీ తెలిపారు. ఇప్పటికే ఒకసారి మనసు మార్చుకున్న టాక్సిక్ మళ్లీ వాయిదా వెనుక కారణాలు అనేకరకాలుగా వినిపిస్తున్నాయి.

అందులో ముఖ్యంగా టాక్సిక్ ఓటీటీ డీల్ పూర్తి కాకపోవడమే దీని వాయిదాకు ప్రధానకారణమంటున్నారు. టీజర్ తర్వాత టాక్సిక్ పై విపరీతమైన నమ్మకం వచ్చి ఎగబడి కొంటారనుకుంటే టీజర్ కి వచ్చిన నెగిటివిటి కారణముగా టాక్సిక్ ని కొనేందుకు ఓటీటీ లు ముందుకు వచ్చిన భారీ డీల్ ప్రపోజల్ పెట్టకపోవడంతో సినిమా వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది.

మరోపక్క యశ్ గ్లోబల్ మర్కెట్ ని శాసించడానికే టాక్సిక్ ని వాయిదా వేశారు అంటున్నారు. ఇప్పటికే ఇంగ్లీష్ లోను విడుదల చేస్తున్న ఈ చిత్రాన్ని మరిన్ని భాషల్లో విడుదల చేసేందుకే సమయం తీసుకుంటున్నారనే మాట వినబడుతుంది. అయితే జూన్ 4 నుంచి వాయిదా అన్న మేకర్స్ కొత్త విడుదల తేదీని మాత్రం ఇవ్వలేదు. 

Yash Toxic postponed:

Yash postpones his Toxic disappointing all

Tags:   YASH
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ