మెగాస్టార్ చిరంజీవి-కొల్లి బాబీ కలయికలో మెగా 158 ప్రాజెక్ట్ ఎప్పుడో మొదలు కావాల్సి ఉంది. కానీ నిర్మాణ సంస్థ సమస్యలతో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఆలస్యమవుతున్నాయి. త్వరలోనే మెగా 158 చిత్రానికి ముహూర్తం పెట్టబోతున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలు కాగానే రెగ్యులర్ షూట్ కి వెళ్లేలా దర్శకుడు బాబీ ప్లాన్ చేసుకున్నాడు.
అది కూడా సినిమాలో కీలకమైన ఇంటర్వెల్ ఎపిసోడ్ తో షూట్ ని ఆరంభించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరు కి జోడిగా ప్రియమణి నటిస్తుండగా.. ఆయన కుమార్తె గా ఓ క్రేజీ హీరోయిన్ నటించబోతుంది అనే ప్రచారం ఉంది. అయితే చిరు-బాబీ చిత్రానికి కాకాజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
అయితే ఈ టైటిల్ విషయంలో మెగా ఫ్యాన్స్ అసంతృప్తిలో ఉన్నారు. ఈ టైటిల్ మరి సింపుల్ గా ఉందని వారు గోల పెడుతున్నారు. కాకాజీ గా మెగాస్టార్ ని ఊహించుకోలేము అంటూ మెగా ఫ్యాన్స్ బాబీ కి ఈ టైటిల్ విషయంలో ఆలోచించమంటూ రిక్వెస్ట్ లు పెడుతున్నారు. మరి ఈ టైటిల్ ని అసలు ఇంకా ప్రకటించలేదు, ఫైనలో కాదో తెలియదు కానీ.. ఈ టైటిల్ విషయంలో మెగా ఫ్యాన్స్ అలబూనారు.




30 వేల ధరకే కార్.. నెలవారీ ఖర్చు జీరో!
Loading..