Advertisementt

డ్రాగన్ సెట్స్‌లోకి రాజీవ్ కనకాల!

Tue 28th Apr 2026 04:34 PM
rajeev kanakala  డ్రాగన్ సెట్స్‌లోకి రాజీవ్ కనకాల!
Rajeev Kanakala joins the sets of Dragon! డ్రాగన్ సెట్స్‌లోకి రాజీవ్ కనకాల!
Advertisement
Ads by CJ

మెగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి ఓ  ఆసక్తికర‌ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ వెర్సటైల్ నటుడు రాజీవ్ కనకాల  చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్వయంగా ధృవీకరించారు. మే 7 నుండి ఆయన ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య ఉన్న స్నేహం , గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన హిట్ సినిమాల నేపథ్యంలో ఈ వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో రాజీవ్ కనకాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. `స్టూడెంట్ నెం.1` నుండి `జనతా గ్యారేజ్` వరకు  కలిసి నటించిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. ముఖ్యంగా వీరి మధ్య ఉండే తెరపై కెమిస్ట్రీ - ఎమోషనల్ బాండింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా  ప్రశాంత్ నీల్ వంటి విజనరీ డైరెక్టర్  ఇద్దరు నటులను మళ్లీ ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకురావడం సినిమాపై అంచనాలను  పెంచుతోంది. ఈ చిత్రంలో  ఇద్ద‌రి మధ్య ఉండే సన్నివేశాలు కథలో చాలా కీలకంగా ఉండబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం `డ్రాగన్` షూటింగ్ ద‌శ‌లో ఉంది. అవుట్ పుట్ విష‌యంలో అసంతృప్తి తెర‌పైకి రావ‌డంతో అస‌వ‌రం మేర భ‌రీ రీ షూట్ ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే సినిమాను ఏకంగా ఏడాది పాటు వాయిదా వేసారు. వాస్త‌వానికి ఈ చిత్రాఇని్న్ని ఇదే ఏడాది రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఔట్ పుట్ స‌రిగ్గా రాక‌పోవ‌డంతో వ‌చ్చే ఏడాదికి వాయిదా వేసారు.

Rajeev Kanakala joins the sets of Dragon!:

Rajeev Kanakala joins the sets of NTRNeel

Tags:   RAJEEV KANAKALA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ