Advertisementt

లెజెండ‌రీ నోట ఆ మాట అసాధార‌ణం!

Tue 28th Apr 2026 02:53 PM
aamir khan  లెజెండ‌రీ నోట ఆ మాట అసాధార‌ణం!
Sai Pallavi emotional debut meets Aamir Khan teary praise లెజెండ‌రీ నోట ఆ మాట అసాధార‌ణం!
Advertisement
Ads by CJ

భారతీయ చలనచిత్ర రంగంలో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరుగాంచిన అమీర్ ఖాన్ నోట  ప్రశంస రావడం అంటే  సామాన్య విషయం కాదు. అమీర్  కుమారుడు జునైద్ ఖాన్ అరంగేట్రం చేస్తోన్న `ఏక్ దిన్` చిత్రంలో కథానాయికగా నటించిన సాయి పల్లవిని ఉద్దేశించి అమీర్ మాట్లాడిన మాట‌లకు స‌ర్ ప్రైజ్ అవ్వాల్సిందే. `సాయి ప‌ల్ల‌వి దేశంలోనే అత్యుత్తమ నటి అమీర్ కీర్తించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కొన్ని దశాబ్దాల కెరీర్‌లో ఎంతోమంది అగ్ర నటీమణులతో పనిచేసిన అమీర్ ఒక దక్షిణాది నటి ప్రతిభను ఈ స్థాయిలో గుర్తించి గౌరవించడం ఆమె నైపుణ్యానికి నిదర్శనం.

సాయి పల్లవి  గ్లామర్  పాత్ర‌లో కాక‌  పోషించే పాత్రలో ఉండే గాఢతను ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేయడంలో సిద్ధహస్తురాలు. అమీర్ ఖాన్ వంటి నటులు సహజంగానే ప్రతి విషయంలోనూ పరిపూర్ణతను కోరుకుంటారు. అలాంటి లెజెండరీ నటుడు సాయి పల్లవిని మెచ్చుకోవడమంటే? ఆమె తన నటనతో బాలీవుడ్ హేమాహేమీలను సైతం ఆశ్చర్యపరిచిందని అర్థమవుతోంది. అదీ తొలి సినిమాతో ఈ స్థాయిలో గుర్తింపు అంటే ఎంత గొప్ప విష‌యం.

జునైద్‌కు మొదటి సినిమాలోనే సాయి పల్లవి వంటి గొప్ప నటి తోడు దొరకడం అతని అదృష్టమని అమీర్ వ్యాఖ్యానిం చడం మ‌రో విశేషం.  సాయి పల్లవి నటనకు భాషా ఎల్లలు లేవని ఈ ప్రశంస మరోసారి రుజువు చేసింది. దక్షిణాదిలో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన  నేచురల్  న‌టి  బాలీవుడ్ ఎంట్రీతోనే అమీర్ ఖాన్ వంటి  మనసు గెలుచుకోవడం  కెరీర్‌లో  మైలురాయిగా నిలిచిపోతుంది. అదృష్టం కంటే   ప‌ల్ల‌వి  పడే శ్రమ, పాత్ర పట్ల చూపే అంకితభావమే నేడు ఈ స్థాయికి చేర్చాయన్న‌ది కాద‌న‌లేని నిజం. బాలీవుడ్ వెండితెరపై సాయి పల్లవి మ్యాజిక్ చూడటానికి యావత్ భారత్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Sai Pallavi emotional debut meets Aamir Khan teary praise:

Aamir Khan Calls Sai Pallavi the Best Actress in India Right

Tags:   AAMIR KHAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ