కల్వకుంట్ల కవిత తండ్రి కేసీఆర్ పై వార్ డిక్లెర్ చేస్తూ.. పార్టీ ని ప్రకటించడమే కాదు, తండ్రి కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ ను ఒక ఆట ఆడుకుంది. కేసీఆర్ మన మనిషి కాదు, మర మనిషి అంటూ తండ్రిని విమర్శిస్తూ చీల్చి చెండాడింది. హైడ్రా ఇల్లు కూలగొడుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చున్నారు అంటూ కొత్త పార్టీ కన్నా కేసీఆర్ గురించే ఎక్కువగా మాట్లాడింది.
అయితే కవిత కొత్త పార్టీ పెట్టి, కేసీఆర్ ను విమర్శించినా బీఆర్ఎస్ నేతలు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ కవిత పార్టీ గురించి పల్లెత్తు మాట బయటకు రానియ్యలేదు. కానీ నేడు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ కవిత కొత్త పార్టీ విషయంలో రెండు ముక్కల్లో తేల్చేసాడు.
కొత్త పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. కొత్త పార్టీల వలన మనకు నష్టం లేదు. ఎవరు ఏ పార్టీ పెట్టుకున్నా మనకేం సమస్య లేదు అంటూ కేటీఆర్ కవిత పార్టీ పేరు ఎత్తకుండా, చెల్లెలు పేరు పలకకుండా కవిత కొత్త పార్టీ పై స్పందించడం హాట్ టాపిక్ అయ్యింది.





ఓటీటీ కి వచ్చేస్తున్న శర్వా బైకర్ 
Loading..