Advertisementt

అకీరా కు అడివి శేష్ కి కనెక్షన్ అదే

Mon 27th Apr 2026 01:05 PM
adivi sesh  అకీరా కు అడివి శేష్ కి కనెక్షన్ అదే
Adivi Sesh Given Clarity About Akira Nandan అకీరా కు అడివి శేష్ కి కనెక్షన్ అదే
Advertisement
Ads by CJ

హీరో అడివి శేష్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ చాలా క్లోజ్ గా కనిపిస్తాడు. అందులోను అడివి శేష్ డైరెక్షన్ లో అకీరా హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నాడనే వార్తలు కూడా ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్నాయి. ఇక అడివి శేష్ ఎప్పుడు ఇంటర్వూస్ ఇచ్చినా మీడియా వారు అకీరా గురించి అడక్క మానరు.

రీసెంట్ గా డెకాయిట్ ప్రమోషన్స్ కోసం అడివి శేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎప్పటిలాగే అకీరా గురించి అడిగిన ప్రశ్నకు అడివి శేష్ స్పందించాడు. అకీరా తో నా స్నేహం ఎప్పటి నుంచో ఉంది. మేమిద్దరం అప్పుడప్పుడు కలుస్తుంటాము, మా ఇద్దరి మధ్యన లెఫ్ట్ హ్యాండ్ అనే కామన్ పాయింట్ ఉంది. అలా మా ఇద్దరి మధ్యన స్నేహమనే సింక్ కుదిరింది.

ఇక మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా నేను అకీరా కోసం కథ రాసాను అనేది అబద్దం, నేను అకీర ను డైరెక్ట్ చేస్తున్నాను అనేది కూడా జస్ట్ రూమర్ మాత్రమే, అకీరా తెరంగేట్రం కోసం అభిమానులు ఎలా వెయిట్ చేస్తున్నారో నేను అంతే ఎదురు చూస్తున్నాను. అకీరాకు ఇప్పటికే విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 

అకీరా ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చినా అది పెద్ద సెన్సేషన్ అవడం ఖాయం అంటూ అడివి శేష్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

Adivi Sesh Given Clarity About Akira Nandan:

Adivi Sesh Clarity On Movie With Pawan Kalyan Son Akira Nandan

Tags:   ADIVI SESH
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ