Advertisementt

రాకాస ఓటీటీ డేట్ వచ్చేసింది

Sun 26th Apr 2026 08:31 PM
rakasa  రాకాస ఓటీటీ డేట్ వచ్చేసింది
Rakasa OTT Streaming Details రాకాస ఓటీటీ డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

నిహారిక ప్రొడక్షన్స్ నుంచి సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కిన రాకాస చిత్రం మిక్స్డ్ టాక్ తోనే అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. నిహారిక అండ్ గ్యాంగ్ ఈ సినిమాకి చేసిన క్రేజీ ప్రమోషన్స్ వల్లే ఆడియన్స్ రాకాస చూసేందుకు థియేటర్స్ కి తరలి వచ్చారు. రాకాస విడుదల రోజే శర్వానంద్ నటించిన బైకర్ విడుదలైంది. 

అయినప్పటికి నిహారిక రాకాస సాలిడ్ కలెక్షన్స్ తెచ్చుకుంది. థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అయిన రాకాస చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. రాకాస చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది.

ఇప్పుడు ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చెయ్యడానికి సిద్దమైంది. థియేటర్స్ లో ఏప్రిల్ 3 న విడుదలైన రాకాస నాలుగు వారాలు తర్వాత అంటే మే 1 నుంచి స్ట్రీమింగ్ లోకి రాబోతుంది. సో థియేటర్స్ లో మిస్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ నెట్ ఫ్లిక్స్ వేదికగా మే 1 నుంచి వీక్షించేయ్యండి. 

Rakasa OTT Streaming Details:

Rakasa Lands on Netflix From May 1

Tags:   RAKASA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ