Advertisementt

వారంలో రూ.1000 కోట్ల ధురంధర్ 2

Thu 26th Mar 2026 01:17 PM
dhurandhar  వారంలో రూ.1000 కోట్ల ధురంధర్ 2
Dhurandhar 2 Sets New Benchmark వారంలో రూ.1000 కోట్ల ధురంధర్ 2
Advertisement
Ads by CJ

ధురంధర్, ధురంధర్ ఎవరి నోటా విన్నా ఇదే మాట. A సర్టిఫికేట్ ధురంధర్ 2 ని చూసేందుకు అండర్ 18 పీపుల్ కూడా తెగ వెయిట్ చేసారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ధురంధర్ ఫీవర్ తో కొట్టుకుంటున్నారు. ప్రీమియర్స్ నుంచే ధురంధర్ ద రివెంజ్ హవా పాన్ ఇండియా మార్కెట్ లో కల్లోలం సృష్టించింది. 

దాని ఫలితమే ధురంధర్ 2 చిత్రం వారం తిరిగేలోపు రూ.1000 కోట్లు కొల్లగొట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. వీకెండ్స్ మాత్రమేనా.. సోమ, మంగళ, బుధ వారాల్లోనూ ధురంధర్ 2 థియేటర్స్ ఫుల్ ఆక్యుపెన్సీ తో నడుస్తున్నాయి. అసలు వీక్ డేస్ లో ఇలా ఆడియన్స్ కనిపించి ఎన్నో రోజులవుతుంది. ఏ భాషలోనూ ధురంధర్ 2 కి పోటీగా నిలిచే సినిమాలు లేకపోవడం కలిసొచ్చింది. 

ఈ వారం రోజుల్లో ఇండియాలో ధురంధర్ 2 కు రూ.745 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. వారంలోనే ఇంత గ్రాస్ సాధించిన ఏకైక బాలీవుడ్ సినిమా గా ధురంధర్ 2 చరిత్ర సృష్టించింది. కేవలం 7 రోజుల్లోనే రూ.1000 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా ఈ ధురంధర్ 2 రికార్డ్ నెలకొల్పింది. లాంగ్ రన్ లో ఇంకెన్ని రికార్డులు ధురంధర్ ఖాతాలోకి చేరుతాయో చూడాలి. 

Dhurandhar 2 Sets New Benchmark:

Dhurandhar 2 collections

Tags:   DHURANDHAR
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ