హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య గత ఏడాదిన్నర కాలంగా మీడియాలో ఎంతగా రచ్చ చేసిందో, రాజ్ తరుణ్ తనని మోసం చేసి వేరే హీరోయిన్ తో కలిసి తిరుగుతున్నాడు, తనకు అన్యాయం చేసాడు అంటూ రాజ్ తరుణ్ పరువును రోడ్డు కీడ్చింది. రాజ్ తరుణ్-లావణ్య సహజీవం చేస్తూ లావణ్య ప్రవర్తన నచ్చక రాజ్ తరుణ్ ఆమెను వదిలెయ్యగా లావణ్య రాజ్ తరుణ్ ఆస్తి కోసం వెంటాడడం స్టార్ట్ చేసి రాజ్ తరుణ్ పరువు తీసింది.
అయితే గతంలో లావణ్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది, మస్తాన్ అనే యువకుడితో లావణ్య కు లింక్స్ ఉన్నాయి. ఇప్పుడు లావణ్య మద్యం మత్తులో హల్చల్ చేసి కలకలం సృష్టించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో పాజిటివ్ రావడంతో లావణ్యపై కేసు నమోదు చేసి ఆమె కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నిన్న బుధవారం సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ మండలం మల్లేపల్లి వద్ద బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టిన లావణ్య.. ఘటన జరిగిన తర్వాత ఆగకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేయగా.. అక్కడి గ్రామస్తులు ఆమె ఎటు కదలకుండా కారును అడ్డుకున్నారు. సారీ చెప్పాలని గ్రామస్థులు చెప్పడంతో నచ్చని లావణ్య వారితో వాగ్వాదానికి దిగింది. అయితే ఈ గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు.
గ్రామస్థులు పోలీసులకు కంప్లైంట్ చెయ్యడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లావణ్యను ప్రశ్నించగా.. ఆమె పోలీసులతోనూ కాసేపు వాగ్వాదం పెట్టుకుంది. అయితే లావణ్య కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్టు గ్రామస్థులు చెబుతున్నారు.




చీరకట్టులో మెస్మరైజ్ చేస్తున్న హీరోయిన్ 

Loading..