రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. అంశం ఏదైనా స్పందించడం ఆమె నైజం తాజాగా రేణు చేసిన వ్యాఖ్యలు రాజకీయ , సినీ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, బీజేపీ సిద్ధాంతాలను ప్రశంసిస్తూ తాను `ఒక గర్వపడే అంధభక్తురాలిని` అని ఆమె బహిరంగంగా ప్రకటించడం విశేషం. ఇటీవల విడుదలైన `ధురంధర్ 2` సినిమాను వీక్షించిన అనంతరం అందులోని ఓ కీలక సన్నివేశాన్ని ఉటంకిస్తూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్‌లో దావూద్ ఇబ్రహీంను పోలిన విలన్ పాత్ర `దేశంలో చాయ్‌వాలా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనవారిలో భయం పెరిగింది` అని చెప్పే డైలాగ్‌ను రేణు దేశాయ్ ప్రత్యేకంగా హైలైట్ చేశారు. `చాయ్‌వాలా కా జల్వా` అనే క్యాప్షన్‌తో ఉన్న వీడియోను రీషేర్ చేస్తూ.. ప్రధాని మోదీ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. మన దేశ సైనిక దళాలు, నిఘా ఏజెన్సీల త్యాగాల వల్లే మనం ఇళ్లలో ప్రశాంతంగా ఉంటున్నామని, దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అధికారంలో ఉండటం.. పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తరుణంలో రేణు దేశాయ్ ఇలా నేరుగా మోదీకి మద్దతు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె చేసిన ఈ `అంధభక్తురాలు` అనే కామెంట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నప్పటికీ రేణు దేశాయ్ మాత్రం తన రాజకీయ మొగ్గును ఎక్కడా దాచుకోకుండా స్పష్టంగా, ధైర్యంగా వెల్లడించడం విశేషం.





తెలుగులో ధురంధర్ 2 దూకుడు

Loading..