తనయుల సక్సెస్ కోసం కింగ్ నాగార్జున ఎంతగా తపన పడుతున్నారో తెలిసిందే. `తండేల్` విజయంతో నాగచైతన్య విషయంలో సంతోషంగా ఉన్నారు. అక్కినేని ఫ్యామిలీకి తొలి వంద కోట్ల వసూళ్ల సినిమా `తండేల్` కావడంతో కింగ్ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ప్రస్తుతం నాగచైతన్య కథానాయకుడిగా కార్తీక్ దండు దర్శకత్వంలో `వృశకర్మ` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు.
చైతన్య కెరీర్ లో మరోసారి సెంచరీని మించి డబులు సెంచరీ కొట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు సైత అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున ముందుగానే కార్తీక్ దండుని మరో సినిమాకు లాక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అఖిల్ కి సరైన కథ ఉంటే చెప్పమని నాగ్ అడిగారుట. అందుకు కార్తీక్ దండు కూడా పాజిటివ్ గా స్పందించాడుట.
`వృశకర్మ` రిలీజ్ అనంతరం కథపై వర్క్ చేస్తానని మాటిచ్చాడుట.ఈ చిత్రాన్ని నాగార్జున సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే నిర్మించాలనుకుంటున్నారుట. సాధారణంగా నాగార్జున దర్శకుల్ని అవకాశాలు అడగరు. కానీ కుమారుల విషయంలో కింగ్ పది మెట్లు దిగడానికైనా సిద్దంగా ఉన్నారు.
గతంలో నాగ చైతన్య విషయంలో నాగ్ ఎవరినైనా పిలిచి మాట్లాడనా? అంటే అందుకు చైతన్య ఒప్పుకోలేదు. తన ప్రయత్నాలేవో తానే చేస్తానని చెప్పి `తండేల్` తో ప్రూవ్ చేసుకున్నాడు. డాడ్ ని ఎక్కడా తగ్గించకూడదు అన్న ఉద్దేశంతో చై అలా స్పందించాడు. `వృశకర్మ`తో చైతన్యతో, నాగ్ తో ఏర్పడిన బాండింగ్ కారణంగా కార్తీక్ కూడా పాజిటివ్ గా స్పందించాడు.




అలవోకగా T20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా
Loading..