Advertisementt

స్వయంభు టీజర్ - ఇది నీతి కాదు నిజం

Wed 11th Feb 2026 01:19 PM
swayambhu  స్వయంభు టీజర్  - ఇది నీతి కాదు నిజం
Swayambhu Teaser Review స్వయంభు టీజర్ - ఇది నీతి కాదు నిజం
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా హిట్ కొట్టాక యంగ్ హీరో నిఖిల్ అంతే స్పీడుగా మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని రెడీ చేస్తాడు అనుకుంటే.. చాలా నింపాదిగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో స్వయంభు ని సిద్ధం చేస్తున్నాడు, నిన్నటివరకు చప్పుడు చెయ్యని స్వయంభు చిత్ర నిర్మాతలు ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్ పై అటెన్షన్ పెంచుతూ టీజర్ రిలీజ్ చేసారు.

స్వయంభు టీజర్ లోకి వెళితే బాహుబలి లాంటి భారీ సెటప్, అద్భుతమైన విజువల్స్ తో టీజర్ ని డిజైన్ చేసారు. బలం ఏదో ఒక చోట నశిస్తుంది మిత్రమా.. కానీ, తెగింపు ఎంత దూరమైనా వెళ్తుంది, ఒక వ్యక్తే కదా అని వదులుకుంటే.. ఆ ఇంటిని, ఒక ఇల్లే అని వదులుకుంటే ఆ గ్రామాన్ని, ఒక గ్రామమే అని వదులుకుంటే ఒక రాజ్యాన్ని వదులుకోవాల్సి వస్తుంది, ఇది నీతి కాదు నిజం అంటూ నిఖిల్ చెప్పిన డైలాగ్స్ సినిమా థీమ్ ని స్పష్టం చేస్తున్నాయి. 

ఒక సామాన్య వీరుడు అజేయమైన శక్తిగా ఎలా ఎదిగాడనేది ఈ చిత్రంలో ప్రధానాంశం. నిఖిల్ యోధుడిగా కనిపించడమే కాదు ఆ లుక్ లో నిఖిల్ ఆహార్యం పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. పోరాట యోధురాలిగా సంయుక్త మీనన్, యువరాణిగా నభ నటేష్ ఆకట్టుకున్నారు. భారీ విజువల్ వండర్ లా స్వయంభు ఉండబోతుంది, ప్రొడక్షన్ వాల్యూస్, భారీ సెట్టింగ్‌లు, అద్భుతమైన పీరియడ్ వార్ సీక్వెన్స్‌లతో కూడిన ఈ టీజర్ కి సినిమాటోగ్రఫీ ప్లస్ అయ్యింది. 

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. 

Swayambhu Teaser Review:

Swayambhu Teaser Released

Tags:   SWAYAMBHU
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ