కోలీవుడ్ లో బుట్టబొమ్మ పూజ హెగ్డే నటించిన జన నాయకన్ ఈ సంక్రాంతి రేస్ లో నిలవాల్సింది, కానీ సెన్సార్ ప్రోబ్లెంస్ తో వాయిదాపడింది. అది ఎప్పుడు విడుదవుతుందో అని అభిమానులు ఎదురు చూస్తున్న సమయంలో నటి పూజ హెగ్డే ఓ పాన్ ఇండియా హీరో పై చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట్లో దుమారాన్ని రేపాయి.
తనతో ఓ హీరో అసభ్యంగా ప్రవర్తించగా.. తను ఆ హీరోని చెంపదెబ్బ కొట్టినట్టుగా పూజ హెగ్డే ఓ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
నా కెరీర్ ఆరంభంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ రాగా అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ షూటింగ్ సమయంలో ఓ రోజు ఆ సినిమాలో నటిస్తున్న హీరో, నా అనుమతి లేకుండా నా క్యారవాన్లోకి వచ్చేసి నాతొ అసభ్యంగానూ ప్రవర్తించాడు. అప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే తేరుకుని ఆ హీరోని లాగిపెట్టి కొట్టాను.
ఆ దెబ్బకి సదరు హీరో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆపై ఆ సినిమాలో ఆ హీరోతో నటించడానికి నేను ఇష్టపడలేదు. దీంతో నా సీన్స్ అన్నీ డూపుని పెట్టి తీశారు అంటూ పూజ హెగ్డే చెప్పిన మాటలు విని.. పూజ హెగ్డే ని అంతగా ఇబ్బంది పెట్టిన స్టార్, పాన్ ఇండియా హీరో ఎవరబ్బా అంటూ ఆమె అభిమానులు తెగ వెతికేస్తున్నారు.





స్టార్ హీరో రిలీజ్ పై నీలి నీడలు
Loading..