మన శంకర వరప్రసాద్ గారు హిట్ కొట్టేసారు. సంక్రాంతి విన్నర్ గా ఈ సీజన్ లో మొదటి హిట్ కొట్టేసారు మన మెగాస్టారూ.. ఇది మేమంటున్న మాట కాదు మన శంకర వరప్రసాద్ గారు ప్రీమియర్స్ వీక్షించిన ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట. ఈరోజు జనవరి 12 న విడుదలవుతున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్ర ప్రీమియర్స్ గత రాత్రి నుంచే మొదలైపోయాయి.
అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరు-నయనతార కాంబోలో వెంకీ కీ రోల్ చేసిన మన శంకర వరప్రసాద్ ని సంక్రాంతి విన్నర్ అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గోల గోల చేస్తున్నారు.
మెగాస్టార్ చిరు, నయనతార భార్య పిల్లల మధ్య నలిగిపోయే ఒక జాతీయ భద్రత అధికారి పాత్రలో చిరంజీవి పాత్రలో జీవించేశారు. 21 నిమిషాల నిడివితో కూడిన కీలక పాత్రలో వెంకీ మామ సెకండ్ హాఫ్ అద్భుతం, ఇట్స్ వింటేజ్ చిరంజీవి సినిమా అనే చెప్పాలి ఈ సినిమాతో, ఒక్క మాటలో చెప్పాలి అంటే చిరంజీవి తో అనిల్ రవిపూడి రఫ్ ఆడించాడు, భీమ్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా కుదిరింది బాస్ కి.. అంటూ ఓ మెగాభిమాని ట్వీట్ చేసాడు.
చిరంజీవి - వెంకటేష్ ది కామెడీ టైమింగ్స్ అదిరిపోయింది... అనిల్ రావు పూడి దర్శకత్వంలో ఈ సంక్రాంతికి మరో హిట్ అంటూ మరో నెటిజెన్ ట్వీట్ చేసాడు. #Chiru #Venky ల ఎపిసోడ్, సాంగ్ సినిమాకు హైలైట్.. నయనతార తన పాత్రతో మెప్పించింది. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సంక్రాంతికి సాలిడ్ హిట్, ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది అంటూ నెటిజెన్స్ మన శంకర వరప్రసాద్ గారు చూసి ట్వీట్లు వేస్తున్నారు.
.




అధిక టికెట్ ధరలతో సినీమాఫియా లూటీ
Loading..