నందమూరి నటసింహ బాలకృష్ణ లేటెస్ట్ చిత్రం అఖండ 2 తాండవం డిసెంబర్ 12 న థియేటర్స్ లో విడుదలైంది. డిసెంబర్ 5 నే పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల కావాల్సిన అఖండ 2 కి ఆర్ధిక ఇబ్బందులు వల్ల ఓ వారం వెనక్కి వెళ్లేలా చేసాయి. అప్పటికి సినిమాపై హైప్ తగ్గింది. ఇక డిసెంబర్ 11 నే ప్రీమియర్స్ తో హడావిడి చేసిన అఖండ 2 కి థియేటర్స్ లో మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది.
సినీవిమర్శకులు సైతం అఖండ 2 కి మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చారు. నార్త్ లో అఖండ 2 తాండవం ఇరగదీస్తుంది అనుకుంటే అసలు అక్కడ చప్పుడు చెయ్యలేదు. భారీ హైప్ నడుమ విడుదలైన ఈ చిత్రం అభిమానులను నిరాశపరిచింది. ఇక ఇప్పుడు సంక్రాంతి సీజన్ కి బాలయ్య అఖండ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది.
జనవరి 9 న నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ లోకి తెస్తున్నట్లుగా అఫీషియల్ గా ప్రకటించారు. సో ఈ సంక్రాంతి బరిలో బాలయ్య థియేటర్స్ లో సందడి చెయ్యకపోయినా ఓటీటీ లో అఖండ 2 తాండవం తో సందడి చెయ్యబోతున్నారు.




రాజాసాబ్ ఓవర్ హైప్ రీచ్ అవుతుందా 
Loading..