అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ లెనిన్ హడావిడి లేకపోవడంపై అక్కినేని అభిమానులు చాలా డిజప్పాయింట్ అవుతున్నారు. ప్లాప్స్ లో ఉన్న హీరో సినిమా అంటే సోషల్ మీడియాలో ఎప్పుడు వార్తల్లో ఉండాలి. కానీ లెనిన్ మొదలై ఏడాది అవుతుంది. ఈ చిత్రం మొదలయ్యాక అఖిల్ పెళ్ళికి మాత్రమే బయట కనిపించాడు తప్ప పబ్లిక్ లో కనిపించింది చాలా తక్కువ. అలాగే లెనిన్ చిత్రంలో అఖిల్ బర్త్ డే కి వదిలిన గ్లింప్స్ లో శ్రీలీల ను హీరోయిన్ గా పరిచయం చేశారు.
కానీ ఇప్పుడు శ్రీలీల ప్లేస్ లోకి భాగ్యశ్రీ బోర్సే వచ్చింది. అలాగే లెనిన్ షూటింగ్ విషయంలోనూ ఏవేవో వార్తలు వినిపించారు. ఈ రోజు లెనిన్ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుంది. లెనిన్ చిత్ర షూటింగ్ హడావిడి కానీ, లేదంటే షూటింగ్ వివరాలు కానీ, అప్ డేట్స్ కానీ ఇప్పటివరకీకు లేకపోవడంపై ఫ్యాన్స్ అసంతృప్తిలో ఉన్నారు.
తాజాగా అనగనగ ఒక రాజు చిత్ర ప్రమోషన్స్ లో నిర్మాత నాగవంశీ లెనిన్ ముచ్చట్లు మాట్లాడారు. అఖిల్ లెనిన్ హడవిడి కనిపించడం లేదేమిటి అని అడిగితే.. అఖిల్ ఈసారి కంటెంట్ మాట్లాడాలి మనం మాట్లాడకూడదు అని అన్నాడు, లెనిన్ సినిమా నుండి వచ్చే ప్రతి కంటెంట్ పేలుతుంది. అసలు అఖిల్ లాంచ్ నాకు ఇవ్వమని వినాయక్ గారిని నేను అడిగా అంటూ నాగవంశీ లెనిన్ హడావిడి ఇప్పటివరకు లేకపోవడం పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.




ఐకాన్ స్టార్‌తో మృణాల్ కన్ ఫర్మ్ 
Loading..