Advertisementt

శ్రీమాలిక.. శైలజాకిరణ్‌కు బొల్లినేని బహుకరణ

Sat 03rd Jan 2026 11:49 PM
puranapanda srimalika book  శ్రీమాలిక.. శైలజాకిరణ్‌కు బొల్లినేని బహుకరణ
Puranapanda Sri Malika a Sacred Literary Offering Honoured by Bollineni Krishnaiah శ్రీమాలిక.. శైలజాకిరణ్‌కు బొల్లినేని బహుకరణ
Advertisement
Ads by CJ

హైదరాబాద్, జనవరి 3: అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ ఆవిర్భావ ఘట్టంతో మనల్ని శక్తిమంతుల్ని చేసే గొప్ప రచనా సంకలనంగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) తీర్చిదిద్దిన నాలుగు వందల పేజీల శ్రీమాలిక గ్రంధం (Srimalika Book) తెలుగు రాష్ట్రాలలో అప్రతిహతంగా దూసుకెళ్లడంలో కీలక భూమిక పోషిస్తున్న కిమ్స్ హాస్పిటల్స్ (Kims Hospitals) ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య (Bollineni Krishnaiah) సౌజన్య హృదయాన్ని, పురాణపండ శ్రీనివాస్ అసాధారణ నిర్విరామ కృషిని, పవిత్ర సొగసుల శైలిని ఎందరెందరో పీఠాధిపతులు, మఠాధిపతులు, సాహిత్యవేత్తలు, ఘనాపాఠీలు, భక్తపాఠకులు వేనోళ్ళ ప్రశంసలు వర్షిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు పై అపారమైన గౌరవంతో, తొలిసారి ఉపముఖ్యమంత్రి హోదాలో అపూర్వ సేవలందిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషిని గుర్తిస్తూ.. ఈ ఇరువురు ప్రముఖుల ఫోటోలను శ్రీమాలిక వెనుక ముద్రించి అటు అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయాలలోని ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు బొల్లినేని కృష్ణయ్య వేల వేల ప్రతులను పంచి ప్రశంసలు పొందడం విశేషం.

అంతేకాకుండా మరోప్రక్క నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతుల చిత్రాలతో ప్రచురించిన పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనం శ్రీమాలిక ప్రతులను తిరుపతి, కుప్పం, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, శ్రీశైలం తదితర ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఉచితంగా సమర్పించడం.. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక ఆధ్యాత్మిక గ్రంధాన్ని వేల వేల కార్యకర్తల పూజా పీఠాలకు చేర్చిన ఘనత నిర్మొహమాటంగా బొల్లినేని కృష్ణయ్యదేనని పార్టీలో అగ్రనేతలు సైతం అభినందిస్తున్నారు.

జూబిలీ హిల్స్ రామాలయంలో జరిగిన ఒక అపురూప పవిత్ర శ్రీకార్యంలో పాల్గొన్న మార్గదర్శి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త శ్రీమతి శైలజాకిరణ్ (Sailaja Kiran) తదితరులకు బొల్లినేని కృష్ణయ్య అపురూప జ్ఞాపికగా పురాణపండ శ్రీనివాస్ పవిత్ర కదంబ పరిమళం శ్రీమాలిక గ్రంధాన్ని పరమ సంతోషంతో బహూకరించడం అక్కడివారందరి దృష్టినీ ఆకర్షించింది. ఇటీవల హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో కూడా అగ్రస్థానంలో మేధావి వర్గాన్ని శ్రీమాలిక విశేషంగా ఆకట్టుకుందని మీడియా సైతం కోడై కూసింది.

ఇదే సమయంలో అక్కడి రామాలయ వేదపాఠశాల వేదపండిత, ఆచార్య, విద్యార్థి వర్గాలకు సైతం బొల్లినేని కృష్ణయ్య ఈ దివ్య గ్రంధాలను బహూకరించారు.

ఋషుల పరంపరను చెక్కు చెదరకుండా ఆర్షగ్రంధాల రచనా, సంకలనాల ద్వారా అమోఘ గ్రంధాలను అందిస్తున్న పురాణపండ శ్రీనివాస్ తన జీవన యాత్రలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎల్లవేళలా దైవీయ స్పృహతో సంచరిస్తూ  తానే ఒక మంత్రాక్షరంగా దైవబలంతో వెలుగులీనడాన్ని ప్రత్యేకంగా పేర్కొనాల్సిందే!

బొల్లినేని కృష్ణయ్య చేసిన నిర్మాణాత్మక రాజకీయ వైద్య సేవలు ఒక ఎత్తయితే ఈ శ్రీమాలిక ఆధ్యాత్మిక నిస్వార్ధ సేవ చరిత్రకెక్కడం ఖాయమని తెలుగుదేశం శ్రేణులు ముక్త కంఠంతో ఎలుగెత్తి అభినందనలు వర్షిస్తున్నాయి.

కొన్ని ముఖ్య సభల్లో, సమావేశాల్లో సాక్షాత్తూ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడి శ్రీమతి భువనేశ్వరి పర్యవేక్షణలో శ్రీమాలిక బుక్స్ పంచినట్లు ఆయాప్రాంతాల్లో తెలుగుదేశం శ్రేణులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కార్యాలయంలో సైతం పత్రికలు ఉంచే చోట సైతం నాలుగైదు శ్రీమాలిక గ్రంధాలు ఎదురుగా ఉంటాయని, ఎంతోమంది మంత్రులు, రాజకీయ ప్రముఖులు నిత్యం వాటిని చూస్తుంటారని స్పష్టంగా తెలుస్తోంది.  హిందూపూర్ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ గతంలో తన నియోజక వర్గంలో కొన్ని ముఖ్య కార్యాలయాలకు బుక్స్ అందించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

Puranapanda Sri Malika a Sacred Literary Offering Honoured by Bollineni Krishnaiah:

Sri Malika Spiritual Journey Bollineni Krishnaiah Devotional Contribution Gains Widespread Acclaim

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ