పోకిరి, చిరుత సహా చాలా చిత్రాల్లో తనదైన అద్భుత నటనతో ఆకట్టుకున్న ఆశిష్ విద్యార్థి పరిచయం అవసరం లేదు. విలన్ వేషాలతో అతడు దక్షిణాదిన భారీ ఫాలోయింగ్ సంపాదించాడు. ఆశిష్, అతడి భార్య రూపాలి రోడ్ ప్రమాదానికి గురయ్యారని కథనాలొస్తున్నాయి. ఈ ప్రమాదంలో అతడికి స్వల్ప గాయాలు కాగా, అతడి భార్య ఇంకా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
తాజాగా ఆశిష్ విద్యార్థి మీడియాతో మాట్లాడుతూ.. ఈ వార్తను సెన్సేషనల్ చేయొద్దని వేడుకున్నారు. తాను, తన భార్య క్షేమంగానే ఉన్నామని అభిమానులకు చెప్పారు. తామిద్దరం రోడ్ ను దాటుతున్నప్పుడు వేగంగా వచ్చిన ఒక బైకర్ గుద్దాడని అతడు చెప్పాడు. అయితే తాను స్వల్ప గాయాలతో బయటపడ్డానని, తన సతీమణి ఇంకా వైద్యుల పర్యవేక్షణలో ఉందని తెలిపాడు. గువహటి(గౌహతి)లో ఈ ప్రమాదం జరిగింది. బైకర్ కూడా స్పృహలోకి వచ్చాడని, కోలుకుంటున్నాడని పోలీసులు చెప్పినట్టు వెల్లడించాడు.
అతడు బావుండాలి.. అందరూ బావుండాలి అని కూడా ఆశిష్ విద్యార్థి అన్నారు. ఆశిష్ విద్యార్థి 22 సంవత్సరాల కాపురం తర్వాత తన మొదటి భార్యకు విడాకులిచ్చాడు. అతడు రూపాలీ ని 2022లో పెళ్లాడాడు. ఇటీవల ఆశిష్ `ది ట్రెయిటర్స్` అనే రియాలిటీ షో తొలి సీజన్ లో కనిపించాడు.




జన నాయగన్ ట్రైలర్ - కేసరిని దించేశారు 
Loading..