కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చివరి చిత్రంగా హెచ్ వినోద్ తెరకెక్కించిన జన నాయగన్ జనవరి 9 న విడుదలకు సిద్దమవుతుంది. విజయ్ పోలీస్ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రం తెలుగులో నేషనల్ అవార్డు విన్నింగ్ బాలయ్య భగవంత్ కేసరి చిత్రానికి రీమేక్ అనే ప్రచారం జరిగింది. కానీ ఆ విషయాన్ని ఎక్కడా క్లారిటీ ఇవ్వకుండా అటు జన నాయగన్ మేకర్స్, ఇటు అనిల్ రావిపూడి అందరిని కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చారు.
కానీ ఇప్పుడు జన నాయగన్ చిత్రం తెలుగు చిత్రమైన భగవంత్ కేసరి చిత్రానికి రీమేక్ అని స్పష్టమైంది. తాజాగా వదిలిన జన నాయగన్ ట్రైలర్ తోనే క్లారిటీ వచ్చేసింది. భగవంత్ కేసరిని మక్కికి మక్కి దించేశారు. మమిత బైజు ని ఆర్మీ లోకి పంపించేందుకు విజయ్ పడే తపన, విలన్ తో యాక్షన్ సీక్వెన్స్, పోలీస్ గెటప్ అన్ని భగవంత్ కేసరి కి రీమేక్ అనే విషయాన్నీ బయటపెట్టేశాయి.
ఎంత దాచినా జన నాయగన్ ట్రైలర్ ఆ విషయాన్ని బయటపెట్టేసింది. ఇక విజయ్ లుక్స్ విషయంలోనూ, యాక్షన్ సీక్వెన్స్ లోను అదిరిపోయే పెరఫార్మెన్స్ చూపించగా, మమిత బైజు తన కేరెక్టర్ లో ఒదిగిపోయింది. విలన్ గా బాబీ డియోల్ గూస్ బంప్స్ తెప్పించారు. మేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, BGM అన్ని రిచ్ గా ఉన్నాయి.
కాకపోతే జన నాయగన్ ట్రైలర్ చూస్తున్నంతసేపు విజయ్ కేరెక్టర్ లో బాలయ్యను, మమిత బైజు కేరెక్టర్ లో శ్రీలీలను, బాబీ డియోల్ కేరెక్టర్ లో అర్జున్ రామ్ పాల్ కనిపించారు అంతే.




అకీరా ఎంట్రీపై రేణు దేశాయ్ కామెంట్స్ 
Loading..