పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ సినీ ఎంట్రీపై ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. అకీరా కు ఇంట్రెస్ట్ ఉందొ లేదో తెలియదు, పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా ని ఇంట్రడ్యూస్ చెయ్యడానికి రెడీగా ఉన్నారో, లేదో తెలియదు, తాను రాజకీయాల్లో బిజీ అయ్యి కొడుకుని తన వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తారని చాలామంది భావించారు.
కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సినిమాలు అంటూ రెండు పడవలపై కాళ్ళు వేశారు. అకీరా ఎంట్రీపై పవన్ ఫ్యాన్స్ లో ఎన్నో ఆశలు. మరోపక్క పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాణ సంస్థలు అకీరా ని లాంచ్ చేసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. తాజాగా అకీరా తల్లి రేణు దేశాయ్ అకీరా సినిమా వారసత్వంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
అకీరా తొందరగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమై, హీరో అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీలాగే నేను కూడా హీరో ఎప్పుడు అవుతావని అకీరాను అడుగుతుంటాను. ప్రతి ఇంటర్వ్యూలోనూ నన్ను అకీరా విషయంలో ప్రశ్న అడుగుతున్నారు. నేను ఒకటే చెబుతున్నా, నేను వాడి కన్న తల్లిని, అకీరా హీరో అవ్వాలని మీ కంటే ఎక్కువగా నేనే కోరుకుంటున్నాను.
అకీరా హీరో అవ్వాలని ప్రతిరోజు దేవుడికి కొబ్బరికాయ కూడా కొడుతున్నాను. అయితే హీరో అవ్వాలా, వద్దా అనేది మాత్రం అకీరా ఇష్టం అంటూ రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూ లో కొడుకు సినీ ఎంట్రీపై తేల్చేసింది.




అఖండ 2 ఓటీటీ డేట్ ఫిక్స్ అయ్యిందా 
Loading..