తమిళనాట క్రేజీ స్టార్ హీరో విజయ్ ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్ గా పార్టీ పెట్టి రాజకీయనాయకుడిగా బిజీ కాబోతున్నారు. ఆయన నటిస్తున్న చివరి చిత్రం జన నాయగన్ జనవరిలో పొంగల్ స్పెషల్ గా విడుదల కాబోతుంది. ప్రస్తుతం పోటికల్ గా బ్రేకిచ్చి జన నాయగన్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో విజయ్ పాల్గొనబోతున్నారు.
అందులో భాగంగా విజయ్ జన నాయగన్ ఆడియో లాంచ్ వేడుకను మలేషియాలో ఈనెల 27 న నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని మలేషియాలోని కౌలాలంపూర్లో నిర్వహిస్తున్నారు. దీని కోసం విజయ్ అభిమానులను భారీగా పోగేస్తున్నారు. అయితే మలేషియా పోలీసులు ఇది కేవలం సినిమా ఈవెంట్ గానే ఉండాలి కానీ.. పొలిటికల్ స్పీచ్ లు ఇవ్వడానికి కుదరదు అంటూ ఆంక్షలు విధించారు.
కౌలాలంపూర్ లోని బుకిట్ జలీల్ స్టేడియంలో ఆడియో విడుదల కార్యక్రంలో విజయ్ అభిమానులను ఉద్దేశించి ఎలాంటి పొలిటికల్ స్పీచ్ ఇవ్వకూడదని, కేవలం సినిమా విషయాలే మాట్లాడాలని మలేషియా పోలీసులు చెప్పినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా విజయ్ విజయ్ అంటూ నినాదాలు చేయడం, అలాగే విజయ్ పొలిటికల్ పార్టీ బ్యానర్ల వినియోగంపై నిషేధం విధించినట్లుగా తెలుస్తుంది.
మరి విజయ్ కి ఇది షాక్ అనే చెప్పాలి. కారణం ఆయన ఇప్పుడు ఏ వేదిక పైన అయినా పొలిటికల్ గా అభిమానులను యాక్టీవ్ చెయ్యాలని చూస్తున్నారు. అందుకే ఈ మలేషియా లో ఆడియో లాంచ్ చేస్తే అటు పొలిటికల్ గాను వర్కౌట్ అవుతుంది అని భావించినట్టుగా ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడ అది కుదిరేలా కనిపించడం లేదు.




వెకేషన్ కి చెక్కేస్తున్న కాబోయే జంట
Loading..