సీక్రెట్ గా అక్టోబర్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న టాలీవుడ్ క్యూట్ కపుల్ రష్మిక మందన్న- విజయ్ దేవరకొండ లు డేటింగ్ లో ఉన్నప్పటి నుంచి న్యూ ఇయర్ వేడుకల కోసమో, లేదంటే సమ్మర్ వెకేషన్ అంటూ వీరిద్దరూ సీక్రెట్ గా వెళ్ళిపోతూ ఉండేవారు. ఎయిర్ పోర్ట్ లో విడివిడిగా కనిపించినా, విడివిడిగా పిక్స్ షేర్ చేసినా కానీ.. వారిని మీడియా తో పాటుగా అభిమానులు పసిగట్టేసేవారు.
ఇక ఇప్పుడు రష్మిక-విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళికి రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈలోపే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విజయ్ దేవరకొండ-రష్మికలు విదేశాలకు చేక్కేస్తున్నారు. రష్మిక తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ఆతర్వాత విజయ్ దేవరకొండ కనిపించాడు.
ఇక ఈ ఏడాది రష్మిక నామ సంవత్సరంగా ఆమె సక్సెస్ లు కనిపిస్తే విజయ్ దేవరకొండ ని కింగ్ డమ్ డిజప్పాయింట్ చేయడంతో రౌడీ జనార్ధన షూటింగ్ లో బిజీ అయ్యాడు. తాజాగా రష్మిక మైస గ్లింప్స్ విడుదల కాగా.. ఈ యేడాదిని న్యూ ఇయర్ వేడుకలతో వెకేషన్స్ తో ఈ కాబోయే జంట ముగించబోతుంది.




అల్లు అర్జున్ నెక్స్ట్ పై క్రేజీ అప్ డేట్
Loading..