Advertisementt

పండంటి బాబు కి జన్మనిచ్చిన కత్రినా కైఫ్

Fri 07th Nov 2025 01:36 PM
vicky kaushal  పండంటి బాబు కి జన్మనిచ్చిన కత్రినా కైఫ్
Katrina Kaif And Vicky Kaushal Welcome Baby Boy పండంటి బాబు కి జన్మనిచ్చిన కత్రినా కైఫ్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించి 2021లో వివాహం చేసుకుంది. కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ ల డేటింగ్ విషయమే ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్ గా మైంటైన్ చేసారు. అంతే గుంభనంగా ఎవ్వరిని పిలవకుండా ఫ్యామిలీ మెంబెర్స్, రిలేటివ్స్ సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. 

ఆతర్వాత కత్రిన కైఫ్ పలుమార్లు ప్రెగ్నెంట్ అంటూ వార్తలు రావడం అవన్నీ జస్ట్ రూమర్స్ గానే మిగిలిపోవడంతో అభిమానులు నిరాశపడ్డారు. ఆతర్వాత కత్రినా కైఫ్ నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యింది. ఆ విషయాన్ని చాలా రోజులు దాచి పెట్టిన కత్రినా-విక్కీ కౌశల్ లు బేబీ బంప్ ఫోటో షూట్ తర్వాత తాము త్వరలోనే పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నట్టుగా ప్రకటించారు. 

అలా అనౌన్స్ చేసిన కొద్ధి నెలలకే కత్రినా కైఫ్ పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఆ విషయాన్ని విక్కీ కౌశల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ గుడ్ న్యూస్ మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మా ప్రేమకు ప్రతిరూపంగా మాకు బాబు జన్మించాడు. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అంటూ పోస్ట్ చెయ్యడంతో కత్రినా-విక్కీ జంటలు ప్రముఖులు, ఫ్రెండ్స్, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

Katrina Kaif And Vicky Kaushal Welcome Baby Boy:

Vicky Kaushal, Katrina become parents to baby boy

Tags:   VICKY KAUSHAL
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ