దర్శకధీరుడు తో సినిమా చేసే అవకాశం వస్తే ఏ హీరో నో చెప్పరు. అది విలన్ కేరెక్టర్ అయినా, లేదంటే మారేదన్నా అయినా. అదే సూపర్ స్టార్ మహేష్ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తున్నారు అనగానే అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ. పృథ్వీ రాజ్ ఈ చిత్రంలో ఏ రోల్ చేస్తున్నారు, ఎలాంటి లుక్ లో కనిపిస్తారనే ఆసక్తి విపరీతంగా చోటు చేసుకుంది.
ఈనెల 15 #GlobeTrotter ఈవెంట్ అనగానే ఎగ్జైట్ అవుతున్న ఆడియన్స్ కి రాజమౌళి సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. అదే ఈరోజు SSMB 29 #GlobeTrotter లో పృథ్వీ రాజ్ సుకుమారన్ లుక్ రివీల్ చేస్తున్నట్టుగా ప్రకటించిన కొద్ధిగంటల్లోనే పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ రివీల్ చేసారు.
కుంభ గా పృథ్వీ రాజ్ క్రూయల్ గా కనిపించబోతున్నారనే విషయాన్ని ఫస్ట్ లుక్ తోనే రివీల్ చేసారు. రోబోటిక్ వీల్ చైర్ లో పృథ్వీ రాజ్ స్టయిల్ గానే కనిపించిన ఆయన చూపులోని విలనిజం హైలెట్ అవుతోంది. మరి ఈ రేంజ్ లో పృథ్వీరాజ్ లుక్ ఉంటే.. మహేష్ బాబు లుక్ ఏ రేంజ్ లో ఉండబోతుందో.. #GlobeTrotter లో అది రివీల్ అయ్యే వరకు మహేష్ ఫ్యాన్స్ లో బీబత్సమైన క్యూరియాసిటీ మొదలయ్యింది.




ఫస్ట్ టైమ్ SSMB 29పై క్రేజీగా రాజమౌళి 
Loading..