అవును నిజమే, రాజమౌళి మొదటిసారి మహేష్ మూవీపై పెదవి విప్పారు. జనవరి లో సైలెంట్ గా SSMB 29 షూటింగ్ స్టార్ట్ చేసిన రాజమౌళి మహేష్ బర్త్ డే కి ప్రీ లుక్ ఇస్తూ నవంబర్ లో ఈ మూవీ అప్ డేట్ అన్నారు తప్ప.. ఎక్కడా సినిమాపై చిన్న క్లూ కానీ సినిమా షూటింగ్ విషయం కానీ చెప్పలేదు.
ఈ నెల 15 న రాజమౌళి-మహేష్ మూవీ ఈవెంట్ ని జియో హాట్ స్టార్ ప్రసారం చేస్తుంది అంటూ డిజిటల్ హక్కులను జియో హాట్ స్టార్ కి ఇచ్చినట్టుగా ప్రకటించిన రాజమౌళి ఫస్ట్ టైం SSMB 29 పై అప్ డేట్ ఇవ్వడం మహెష్ ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆయన సోషల్ మీడియా ద్వారా.. #GlobeTrotterలోని మూడు ప్రధాన పాత్రలతో ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ జరుగుతోంది.
మరోవైపు #GlobeTrotter ఈవెంట్ కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు చూడనివిధంగా, ఊహించని విధంగా #GlobeTrotter ఈవెంట్ మీ ముందుకు రానుంది. నవంబర్ 15న ఈవెంట్ కోసం మీతో పాటు నేను కూడా ఎదురుచూస్తున్నాను. దానికంటే ముందు మీరు ఈ వీక్ ని ఎంజాయ్ చేస్తూ మరింత హుషారుగా ఉండేందుకు నేడు పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ విడుదల కానుంది.. అంటూ రాజమౌళి సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు.




గర్ల్ ఫ్రెండ్ ఓవర్సీస్ టాక్ 
Loading..