Advertisementt

గర్ల్ ఫ్రెండ్ ఓవర్సీస్ టాక్

Fri 07th Nov 2025 10:56 AM
the girlfriend  గర్ల్ ఫ్రెండ్ ఓవర్సీస్ టాక్
The Girlfriend Overseas Talk గర్ల్ ఫ్రెండ్ ఓవర్సీస్ టాక్
Advertisement
Ads by CJ

ఈ ఏడాది రష్మిక నామ సంవత్సరం అనాలేమో.. ఎందుకంటే రష్మిక నటించిన చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలవుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో సికందర్, ఛావా చిత్రాలతో అలరించిన రష్మిక.. ద్వితీయార్ధంలో ధనుష్ కుబేర, హిందీలో థామా చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్న రష్మిక ఈఏడాది మరో సినిమాని విడుదల చేసింది. 

అదే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంకలో తెరకెక్కిన ద గర్ల్ ఫ్రెండ్. గత రాత్రి నుంచే ప్రీమియర్స్ తో సందడి చేసిన ద గర్ల్ ఫ్రెండ్ టాక్ ఎలా ఉంది, రష్మిక మరో హిట్ కొట్టేసిందా అనే అతృతతో ఆమె ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ ఎదురు చూసారు. రష్మిక గర్ల్ ఫ్రెండ్ ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా డీసెంట్ లవ్ స్టోరీ.. రష్మిక మరోసారి యాక్టింగ్ తో అదరగొట్టింది, భూమా అనే పాత్రలో కనిపిస్తుంది.. మళ్లీమళ్లీ అద్భుతం చేసింది అంటూ ఓ నెటిజెన్ ట్వీట్ చేసాడు. 

రాహుల్ రవింద్రన్ రైటింగ్, డైరెక్షన్ బాగుంది, ఇంటర్వెల్ లో ఇన్‌సెక్యూర్ లవ్ స్టోరీని చాలా బాగా డీల్ చేసారు. చివరి 30 నిమిషాల్లో రష్మిక యాక్టింగ్ అదిరిపోయింది, దసరా తర్వాత దీక్షిత్ శెట్టి విలక్షణమైన పాత్రలో కనిపించారు. మల్టీ షేడ్స్ లో నటిస్తూ మెప్పించాడు. చివరి 10 నిమిషాలు రష్మిక నట విస్పోటనం చూపించింది.. 

డీసెంట్ లవ్ స్టోరీ, గుడ్ యాక్టింగ్, గుడ్ ఇంటర్వెల్, క్లైమాక్స్‌‌లో రష్మిక యాక్టింగ్ వేరే లెవల్ అంటూ గర్ల్ ఫ్రెండ్ ని వీక్షించిన ప్రతి ఒక్కరూ ట్వీట్లు వేస్తున్నారు. మరి గర్ల్ ఫ్రెండ్ లో విషయమెంతుందో అనేది పూర్తి సమీక్షలో మరికాసేపట్లో చూసేద్దాం. 

The Girlfriend Overseas Talk:

The Girlfriend Overseas Public Talk

Tags:   THE GIRLFRIEND
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ